Antonio guteras
-
ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో భారత ప్రథమ మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్(58) బాధ్యతలు చేపట్టారు. సంబంధిత అధికార పత్రాలను మంగళవారం ఆమె ఐరాస సెక్రటరీ జనరల్ గుటెర్రస్‌కు అందజేశారు. 1987 ఐఎఫ్ఎస్ అధికారి అయిన రుచిరా కాంబోజ్, గతంలో భూటాన్‌లో భారత రాయబారిగా పనిచేశారు. 2002–2005 సంవత్సరాల్లో ఐరాసలోని భారత శాశ్వత మిషన్‌లో కౌన్సిలర్‌గా ఉన్నారు. భారత శాశ్వత రాయబారి టీఎస్ తిరుమూర్తి పదవీ కాలం ముగియడంతో ఆ స్థానంలో రుచితా జూన్‌లో నియమితులయ్యారు. -
అగ్నికి ఆజ్యం పోస్తున్నారు: రష్యా వార్నింగ్
కీవ్: ఉక్రెయిన్‌తో సంఘర్షణ మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం పొంచి ఉందని రష్యా అభిప్రాయపడింది. ఉక్రెయినే తన తీరుతో ఆ దిశగా రెచ్చగొడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అణు యుద్ధ ముప్పును అస్సలు కొట్టిపారేయలేమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఘాటు హెచ్చరికలు చేశారు. ఉక్రెయిన్‌పై దాడులను ఏ మాత్రమూ కొనసాగించలేనంతగా రష్యాను బలహీనపరచడమే అమెరికా లక్ష్యమన్న ఆ దేశ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. మూడో ప్రపంచ యుద్ధం రావొద్దంటూ శాంతి మంత్రం పఠిస్తున్న చాలా దేశాలు తమ ప్రవర్తన ద్వారా చేజేతులారా అందుకు రంగం సిద్ధం చేస్తున్నాయంటూ అమెరికా, పాశ్చాత్య దేశాల తీరును దుయ్యబట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలందించడం ద్వారా నాటో దేశాలే అగ్నికి ఆజ్యం పోస్తున్నాయంటూ తీవ్ర విమర్శలకు దిగారు. రష్యాతో ఒప్పందం చేసుకోవద్దంటూ ఉక్రెయిన్‌పై అమెరికా, ఇంగ్లండ్ ఒత్తిడి తెస్తున్నాయన్నారు. చర్చలు ఆగిపోవడానికి ఉక్రెయినే కారణమని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను అమెరికా, ఇంగ్లండ్ తీవ్రంగా ఖండించాయి. లావ్రోవ్‌వి మతిలేని వ్యాఖ్యలంటూ దుయ్యబట్టాయి. ‘అణు యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరు. చేయకూడని యుద్ధమది’’ అని పెంటగాన్ ప్రెస్ సెక్రెటరీ జాన్ కిర్బీ అన్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని చూడాలని ఎవరూ కోరుకోరని చైనా పేర్కొంది. 40 దేశాల మంత్రుల భేటీ ఉక్రెయిన్‌కు కావాల్సినంత సైనిక సాయం అందిస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్పష్టం చేశారు. 40 దేశాలరక్షణ మంత్రులు, అధికారులతో జర్మనీలో ఆయన సమాలోచనలు జరిపారు. ఉక్రెయిన్‌కు 500 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు పంపేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు. అత్యాధునిక జెపార్డ్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ పంపుతామని జర్మనీ ప్రకటించింది. దాడులు మరింత ఉధృతం తమ భూభాగాలపై దాడులకు దిగేలా ఉక్రెయిన్ను ఇంగ్లండ్ రెచ్చగొడుతోందని రష్యా రక్షణ శాఖ ఆరోపించింది. కీవ్‌లోని కీలక ప్రభుత్వ కార్యాలయాలపై విరుచుకుపడతామని హెచ్చరించింది. పొపాస్నా, లిసిచాన్స్క్, గిర్‌స్కే, ఖరీ్కవ్, జపోరిజియాలపై బాంబుల వర్షం కురిపించింది. క్రెమినా నగరం రష్యా వశమైందని ఇంగ్లండ్ పేర్కొంది. యుద్ధం ద్వారా ఉక్రెయిన్ను పాశ్చాత్య దేశాలకు పుతినే దగ్గర చేశారని విశ్లేషకులంటున్నారు. శాంతియుత పరిష్కారమే కోరుతున్నాం: గుటెరస్‌తో పుతిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్టు పుతిన్ చెప్పారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తో ఆయన భేటీ అయ్యారు. ‘‘చర్చల్లో చాలా పురోగతి సాధించినా ఉక్రెయిన్ వైఖరి ప్రతిష్టంభనకు దారి తీసింది. క్రిమియా హోదా, డోన్బాస్‌పై వైఖరి మార్చుకుంది. ఇప్పటికైనా క్రిమియాపై రష్యా సార్వభౌమత్వాన్ని డోన్బాస్కు స్వాతంత్య్రాన్ని ఉక్రెయిన్ గుర్తించాలి’’ అని డిమాండ్ చేశారు. గుటెరస్ అంతకుముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో కూడా భేటీ అయ్యారు. యుద్ధాన్ని తక్షణం విరమించాలని సూచించారు. ఇది చదవండి: పుతిన్ కొత్త ప్లాన్..? -
ఐరాసలో మాకూ చోటివ్వండి: తాలిబన్లు
ఐక్యరాజ్యసమితి: ప్రపంచ దేశాల అంతర్జాతీయ కూటమి అయిన ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో తామకూ భాగస్వామ్య పాత్ర పోషించే అవకాశమివ్వాలని తాలిబన్లు విన్నవించుకున్నారు. తమ శాశ్వత ప్రతినిధి, దోహాకు చెందిన సుహైల్ షాహీన్ ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొని ప్రసంగించేందుకు అనుమతినివ్వాలని తాలిబన్లు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌కు తాలిబన్లు లేఖ రాశారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని గత సర్కార్ కూలిపోయిందని, ఇక మీదట ఐరాసలో అఫ్గాన్ శాశ్వత ప్రతినిధిగా సుహైల్‌ను కొనసాగించాలని ఆ దేశ విదేశాంగ శాఖ నుంచి 20న లేఖ వచ్చిందని ఐరాసలో ఉన్నతాధికారి ఫర్హాన్ హక్ వెల్లడించారు. తమ ప్రతినిధి బృందం ఐరాస సమావేశాల్లో పాల్గొనేందుకు, అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్‌కు మాట్లాడే అవకాశమివ్వాలని తాలిబన్లు కోరినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఘనీ ప్రభుత్వ హయాంలో ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా నియమించబడిన గ్రామ్ ఇసాక్జాయ్ ఇంకా ఐరాసలో కొనసాగుతున్న నేపథ్యంలో తాలిబన్ల ప్రతిపాదన కొత్త సమస్య తెచ్చిపెట్టేలా ఉంది. సర్వ సభ్య సమావేశంలో 193 సభ్య దేశాలకు ఈ విషయం తెలియజేశామని, 27న ‘అఫ్గాన్’ సీటు వద్ద ఎవరిని ప్రతినిధిగా సమావేశాల్లో కూర్చోబెట్టాలో ఇంకా నిర్ణయించలేదని ఐరాస ఉన్నతాధికారి ఫర్హాన్ చెప్పారు. తాలిబన్లను బహిష్కరించకండి: ఖతార్ అఫ్గాన్ సంక్షోభంలో మధ్యవర్తి పాత్ర పోషించిన ఖతార్ ఈ విషయంలో స్పందించింది. ‘ అఫ్గాన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగాలంటే తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలి. వారిని బహిష్కరించకూడదు. అఫ్గాన్ తాత్కాలిక ప్రభుత్వం తరఫున శాశ్వత ప్రతినిధిని ఈ సమావేశాల్లో అనుమతించాలి’ అని న్యూయార్క్‌లో సర్వ సభ్య సమావేశంలో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన టర్కీ అధ్యక్షుడు 74 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న కశ్మీర్ అంశాన్ని భారత్–పాక్‌లు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస వేదికగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డోగన్ బుధవారం మరోసారి లేవనెత్తారు. అయితే, గతంలోనూ ఎర్డోగన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. -
అఫ్గన్‌కు 60 కోట్ల డాలర్ల సాయం చేయండి: ఐరాస
జెనీవా: తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌ను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించా ల్సిందిగా సోమవారం ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితి(ఐరాస) కోరింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు అఫ్గన్ ప్రజల కష్టాలు తీర్చేందుకు 60.6 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,463 కోట్లు) సాయం చేసి ప్రపంచ దేశాలు తమ మానవతా దృక్పథాన్ని మరోసారి చాటాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హితవు పలికారు. సోమవారం జెనీవాలో జరిగిన విరాళాల సేక రణ సదస్సులో ఆయన మాట్లాడారు. అఫ్గన్ పేదలకు సాయపడాలన్నారు. ఐక్యరాజ్య సమితి అత్యవసర విభాగం తరఫున 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు సదస్సులో గుటెర్రస్ ప్రకటించారు. -
కరోనా: సంక్షోభంలో వారి భవిష్యత్తు
ఐక్యరాజ్యసమితి: కోవిడ్–19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పసివారిపై తీవ్రమైన ప్రభావం చూపనుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇటీవలి కాలంలో శిశు మరణాల సంఖ్యను తగ్గించుకోగలిగినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం కారణంగా కొన్ని లక్షల మంది అత్యంత దుర్భర పరిస్థితుల్లోకి వెళతారనీ, ఫలితంగా శిశుమరణాలు వేలాదిగా పెరిగే ప్రమాదముందని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. 2019 అంచనాల ప్రకారం 386 మిలియన్ల మంది చిన్నారులు దుర్భర దారిద్య్రంలో ఉండగా, ఈ ఏడాది తలెత్తిన సంక్షోభం కారణంగా మరో 42 నుంచి 66 మిలియన్ల మంది పసివారు పేదరికంలో మగ్గిపోతారని అంచనా వేసింది. ‘పాలసీ బ్రీఫ్; ద ఇంపాక్ట్ ఆఫ్ కోవిడ్–19 ఆన్ చిల్డ్రన్’ పేరుతో ఒక పత్రాన్ని ఐరాస విడుదల చేసింది. కోవిడ్ మహమ్మారి చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ, వారి భవిష్యత్తు సంక్షోభంలో పడనుందని అందులో పేర్కొంది. అవి 1) చిన్న పిల్లలకు వైరస్ సోకడం, 2) వైరస్ కలిగించే తక్షణ సామాజిక ఆర్థిక ప్రభావం 3) సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలుపై కోవిడ్ –19 దీర్ఘకాలిక ప్రభావం ఉంటుందని వెల్లడించింది. పాఠశాలల మూసివేత కారణంగా 188 దేశాల్లో 1.5 బిలియన్ల మంది పిల్లల విద్యాబోధన పూర్తిగా కుంటుపడింది. మూడింట రెండొంతుల దేశాలు దూరవిద్యావిధానాన్ని అమలుచేయగా, అందులో తక్కువ ఆదాయం కలిగిన దేశాల వాటా కేవలం 30 శాతమే. 143 దేశాల్లోని 368.5 మిలియన్ల మంది పిల్లలు పౌష్టికాహారం కోసం పాఠశాలలపైనే ఆధారపడి ఉన్నారు. బడులు మూతపడటంతో ఇప్పుడు వీరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీని ప్రభావంతో 143 దేశాల్లో 368.5 మిలియన్ల మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడతారని ఐరాస అంచనా వేసింది. చిన్నారుల మానసిక ఆరోగ్యం, వారి సంక్షేమం సైతం ప్రమాదంలో పడనుందని పేర్కొంది. ఈ తీవ్రత నుంచి చిన్నారులను రక్షించడానికి ప్రభుత్వాలు చొరచూపాలనీ, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక, ఆహార భద్రత కల్పించాలని ఐరాస ప్రదాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కోరారు. మాతా శిశు సంరక్షణ, పౌష్టికాహార కార్యక్రమాలు, పాఠశాల విద్యకు హాని జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఇది చదవండి: చైనాపై పెరిగిన అనుమానాలు? -
తీవ్ర నిధుల సంక్షోభంలో ఐరాస
ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి తీవ్రమైన నిధుల కొరతలో ఉందని సంస్థ ప్రధాన కార్యదర్శి ఆంటొనియొ గ్యుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వచ్చే నెల వేతనాలిచ్చేందుకూ సరిపోను నిధులు లేవన్నారు. ఐరాసలో ఈ దశాబ్దంలో ఈ స్థాయి సంక్షోభం ఎన్నడూ లేదన్నారు. సంస్థకు ఇస్తామని ప్రకటించిన నిధులను తక్షణమే అందించాలని 193 సభ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. నిధుల్లేకుండా ఐరాస పథకాల అమలు సాధ్యం కాబోదన్నారు. ఈ దశాబ్దంలోనే ఈ నెలలో అత్యంత తక్కువ స్థాయిలో నిధులున్నాయన్నారు. సంస్థకు దేశం తరఫున అందించాల్సిన నిధులను పూర్తిగా అందించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. అయితే, శాంతి పరిరక్షణ దళ ఖర్చుల నిమిత్తం భారత్‌కే ఐరాస రూ. 270 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 73 దేశాలు మాత్రమే.. 2017, 2018 సంవత్సరాలకు గానూ 73 దేశాలు మాత్రమే, మార్చి నాటికి తమ వాటాను పూర్తిగా చెల్లించాయని గ్యుటెరస్ తెలిపారు. 2016లో 62 దేశాలు, 2015లో 67 దేశాలు తమ వాటాను పూర్తిగా చెల్లించాయన్నారు. 2018 చివరి నాటికి సభ్య దేశాల నుంచి సంస్థకు అందాల్సిన నిధులు 529 మిలియన్ డాలర్లు. 2018, 2019 సంవత్సరాలకు గానూ.. సంస్థ సాధారణ బడ్జెట్ అయిన 5.4 బిలియన్ అమెరికన్ డాలర్లలో దాదాపు 22% అమెరికా నుంచి అందాల్సి ఉంది. ఈ జనవరి నుంచి తీవ్రస్థాయిలో పొదుపు చర్యలు చేపట్టకుండా, నెలవారీ ఖర్చుల విధానం ప్రారంభించకుండా ఉండి ఉంటే.. పరిస్థితి మరింత దారుణంగా ఉండి ఉండేదని గ్యుటెరస్ అభిప్రాయపడ్డారు. ‘ఆ చర్యలే చేపట్టకుండా ఉండి ఉంటే.. జనరల్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అవసరమైన నిధులు కూడా మనవద్ద ఉండేవి కావు’ అన్నారు. అత్యంత తీవ్రమైన నిధుల లేమి కారణంగా కఠినమైన పొదుపు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. -
‘చాంపియన్ ఆఫ్ ది ఎర్త్’ మోదీ
న్యూఢిల్లీ: స్వచ్ఛ, హరిత పర్యావరణం తమ ప్రభుత్వ ప్రాథమ్యాల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చెప్పారు. వాతావరణం, విపత్తులకు సంస్కృతితో సంబంధం ఉందనీ, పర్యావరణాన్ని కాపాడటం మన సంస్కృతిలో భాగం కానంతవరకు విపత్తులను నివారించడం చాలా కష్టమైన పని ఆయన పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డును మోదీ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ చేతుల మీదుగా అందుకున్నారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ–ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్) విజయవంతమవ్వడంలో కీలకపాత్ర పోషించినందుకుగాను మోదీతోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు సంయుక్తంగా ఈ అవార్డును ఐరాస ప్రకటించింది. అవార్డును స్వీకరించిన అనంతరం మోదీ మాట్లాడుతూ ‘వ్యవసాయ, పారిశ్రామిక విధానాల నుంచి ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణం వరకు.. అన్నింట్లోనూ స్వచ్ఛ వాతావరణం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు భారత్ ఇటీవలి కాలంలో మరింతగా పాటుపడుతోంది. 2005తో పోలిస్తే 2020కల్లా కర్బన ఉద్గారాలను 20–25 శాతం, 2030 నాటికి 30–35 శాతం తగ్గించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 2022 కల్లా ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌ను నిషేధించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చెప్పారు. వారందరికీ దక్కిన గౌరవం ఈ అవార్డు.. మోదీ మాట్లాడుతూ ‘ఈ దేశంలో కొన్ని తెగల ప్రజలు అడవుల్లో బతుకుతూ తమ ప్రాణాలకంటే అక్కడి చెట్లనే ఎక్కువ ప్రేమిస్తారు. మత్స్యకారులు తమ జీవనానికి అవసరమైన డబ్బు సంపాదించడానికి ఎన్ని చేపలు అవసరమో అన్నే పడతారు తప్ప అత్యాశకు పోరు. రైతులు ఎంతో కష్టపడి దేశం ఆకలి తీరుస్తున్నారు. చెట్లను దేవతలుగా పూజించే మహిళలు ఇక్కడ ఉన్నారు. వీరందరికీ దక్కిన గుర్తింపుగా నేను ఈ అవార్డును భావిస్తున్నాను’ అని అన్నారు. ప్రకృతిని భారతీయులెప్పుడూ ప్రాణం ఉన్న జీవిగానే చూశారనీ, పర్యావరణాన్ని గౌరవించడం భారత సంస్కృతిలో పురాతన కాలం నుంచే భాగంగా ఉందనీ, స్వచ్ఛతా అభియాన్ ద్వారా ప్రజల ప్రవర్తనను మార్చడంలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని మోదీ చెప్పుకొచ్చారు. అసలైన నాయకుడు మోదీ: గ్యుటెరస్ హరిత వాతావరణాన్ని నమ్మే వారి పక్షానే సాంకేతికత ఉంటుందని గ్యుటెరస్ అన్నారు. ‘అసలైన నాయకత్వం కలిగిన ఓ రాజనీతిజ్ఞుడిని ఈ పురస్కారంతో మనం గుర్తిస్తున్నాం. వాతావరణ మార్పు సమస్యను గుర్తించి, పర్యావరణ పరిరక్షణతో వచ్చే లాభాలను అర్థం చేసుకునే నాయకుడు మోదీలో ఉన్నారు. ఆయనకు సమస్యలు తెలుసు, పరిష్కరించేందుకూ పనిచేస్తున్నారు. హరిత వాతావరణం మంచి వాతావరణం. బూడిద వాతావరణాన్ని నమ్మే వారి భవిష్యత్తు కూడా బూడిదలాగే ఉంటుంది’ అని గ్యుటెరస్ పేర్కొన్నారు. అవార్డును మోదీకి ప్రదానం చేయడంతో ఆయనకు తగిన గుర్తింపు దక్కిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. -
ఐరాస శాంతిదూతగా మలాలా
-
ఐరాస శాంతిదూతగా మలాలా
ఆ హోదా పొందిన పిన్నవయస్కురాలు ఐక్యరాజ్యసమితి: బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్(19)కు మరో అత్యున్నత గౌరవం లభించింది. ఆమెను ఐక్యరాజ్యసమితి శాంతిదూతగా ఎంపిక చేసినట్లు యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. యూఎన్ శాంతిదూతగా నియమితురాలైన అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా నిలిచారు. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆమెకు ఈ హోదా ఇవ్వనున్నారు. ‘‘మహిళలు, యువతులు, ప్రజల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతూ మలాలా అసాధారణ నిబద్ధత కనబరుస్తున్నారు. అందుకే ఆమెను శాంతిదూతగా ఎంపిక చేశాం. బాలికల విద్యా హక్కు కోసం మలాలా ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారు. శాంతిదూతగా మలాలాను ఎంపిక చేయడం వల్ల మహిళలకు మరింత మేలు చేకూరుతుంది’’ అని గుటెరస్ అన్నారు. ఐరాస కార్య కలాపాలను ప్రచారం చేసేందుకు ప్రముఖులను శాంతిదూతగా ఎంపిక చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.