ఐరాస శాంతిదూతగా మలాలా | Malala set to be youngest UN Messenger of Peace | Sakshi
Sakshi News home page

ఐరాస శాంతిదూతగా మలాలా

Published Sun, Apr 9 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

ఐరాస శాంతిదూతగా మలాలా

ఐరాస శాంతిదూతగా మలాలా

ఆ హోదా పొందిన పిన్నవయస్కురాలు
ఐక్యరాజ్యసమితి: బాలల హక్కుల కోసం పోరాడుతున్న నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్‌(19)కు మరో అత్యున్నత గౌరవం లభించింది. ఆమెను ఐక్యరాజ్యసమితి శాంతిదూతగా ఎంపిక చేసినట్లు యూఎన్‌ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ప్రకటించారు. యూఎన్‌ శాంతిదూతగా నియమితురాలైన అత్యంత పిన్న వయస్కురాలుగా మలాలా నిలిచారు. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆమెకు ఈ హోదా ఇవ్వనున్నారు.

‘‘మహిళలు, యువతులు, ప్రజల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతూ మలాలా అసాధారణ నిబద్ధత కనబరుస్తున్నారు. అందుకే ఆమెను శాంతిదూతగా ఎంపిక చేశాం. బాలికల విద్యా హక్కు కోసం మలాలా ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నారు. శాంతిదూతగా మలాలాను ఎంపిక చేయడం వల్ల మహిళలకు మరింత మేలు చేకూరుతుంది’’ అని గుటెరస్‌ అన్నారు. ఐరాస కార్య కలాపాలను ప్రచారం చేసేందుకు ప్రముఖులను శాంతిదూతగా ఎంపిక చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement