
ఐక్యరాజ్యసమితి: తాలిబన్ల చేతికి చిక్కిన అఫ్గానిస్తాన్‌లో ఆహారం కొరత వేధిస్తోంది. ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. పేదల పరిస్థితి దయనీయంగా మారింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఆహార నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు నాటికి నిల్వలు పూర్తిగా నిండుకోవడం ఖాయమని అఫ్గాన్‌లో ఐరాస ప్రతినిధి రమీజ్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో మూడొంతుల్లో కనీసం ఒక వంతు ప్రజలకు రోజుకు ఒకసారైనా తిండి దొరుకుతుందని కచ్చితంగా చెప్పలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరు దాకా ఎలాగోలా నెట్టికొచ్చినా ఆ తర్వాత ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఇక అత్యవసరమైన ఔషధాలు లేకుండా దొరకడం లేదని అన్నారు. మరోవైపు అఫ్గాన్‌లో తీవ్రమైన కరువు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment