Food shortages
-
Israel-Hamas war: గాజాలో ఆకలి కేకలు
గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. అక్కడున్న మొత్తం 23 లక్షల మందీ జనాభా తీవ్ర ఆహార కొరతతో అల్లాడుతున్నారు. 80 శాతం మంది గాజావాసులు ఇజ్రాయెల్ దాడులకు తాళలేక, దాని బెదిరింపులకు తలొగ్గి ఇప్పటికే ఇల్లూ వాకిలీ వదిలేశారు. కొద్ది నెలలుగా శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎలాంటి సహాయక సామగ్రినీ ఇజ్రాయెల్ అనుమతించకపోవడంతో అన్నమో రామచంద్రా అంటూ అంతా అలమటిస్తున్నారు. వారిలోనూ కనీసం 5 లక్షల మంది అత్యంత తీవ్రమైన కరువు బారిన పడ్డారని ఐరాస ఆవేదన వెలిబుచ్చింది. తాళలేని ఆకలిబాధతో దుర్భర వేదన అనుభవిస్తున్నారని ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) తాజా నివేదికలో వెల్లడించింది. వారికి తక్షణ సాయం అందకపోతే అతి త్వరలోనే గాజా ఆకలిచావులకు ఆలవాలంగా మారడం ఖాయమని హెచ్చరించింది... నరకానికి నకళ్లు... గత ఆదివారం గాజా శరణార్థి శిబిరంలో ఓ రెణ్నెల్ల పసివాడు ఆకలికి తాళలేక మృత్యువాత పడ్డాడు. గాజాలో కనీవినీ ఎరగని మానవీయ సంక్షోభానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే కావచ్చని ఐరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మున్ముందు అక్కడ పదులు, వందలు, వేలల్లో, అంతకుమించి ఆకలి చావులు తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నాయి. ప్రతీకారేచ్ఛతో పాలస్తీనాపై నాలుగున్నర నెలలుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆ క్రమంలో గాజా స్ట్రిప్‌ను అష్టదిగ్బంధనం చేయడమే ఇందుకు కారణం. గాజాకు ఆహారం, నిత్యావసరాల సరఫరాను కూడా ఇజ్రాయెల్ వీలైనంతగా అడ్డుకుంటూ వస్తోంది. చివరికి ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల సాయాన్ని కూడా అనుమతించడం లేదు. దాంతో గాజావాసులు అల్లాడిపోతున్నారు. శరణార్థి శిబిరాలు నరకానికి నకళ్లుగా మారుతున్నాయి. కొన్నాళ్లుగా ఆకలి కేకలతో ప్రతిధ్వనిస్తున్నాయి. యుద్ధం మొదలైన తొలినాళ్లలో గాజాలోకి రోజుకు 500 పై చిలుకు వాహనాల్లో సహాయ సామగ్రి వచ్చేది. క్రమంగా 50 వాహనాలు రావడమే గగనమైపోయింది. ఇప్పుడవి 10కి దాటడం లేదు! ఉత్తర గాజాలోనైతే పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆ ప్రాంతానికి ఎలాంటి మానవతా సాయమూ అందక ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. యూఎన్ఆర్డబ్ల్యూఏ కూడా చివరిసారిగా జనవరి 23 అక్కడికి సహాయ సామగ్రిని పంపింది. నాటినుంచి ఇజ్రాయెల్ ఆంక్షలు తీవ్రతరం కావడంతో చేతులెత్తేసినట్టు సంస్థ చీఫ్ ఫిలిప్ లాజరిని స్వయంగా అంగీకరించారు! గాజా ఆకలి కేకలను పూర్తిగా మానవ కలి్పత సంక్షోభంగా ఆయన అభివరి్ణంచారు. ‘‘సహాయ సామగ్రితో కూడిన వాహనాలేవీ గాజాకు చేరకుండా చాలా రోజులుగా ఇజ్రాయెల్ పూర్తిగా అడ్డుకుంటోంది. కనీసం ఆహార పదార్థాలనైనా అనుమతించాలని కోరినా పెడచెవిన పెడుతోంది’’ అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. కలుపు మొక్కలే మహాప్రసాదం ఆకలికి తట్టుకోలేక గాజావాసులు చివరికి కలుపు మొక్కలు తింటున్నారు! ఔషధంగా వాడాల్సిన ఈ మొక్కలను ఆహారంగా తీసుకుంటే ప్రమాదమని తెలిసి కూడా మరో దారి లేక వాటితోనే కడుపు నింపుకుంటున్నారు. దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మాలో అని పిలిచే ఈ మొక్కలను కట్టకింత అని రేటు పెట్టి మరీ అమ్ముకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ఆకలికి తాళలేక గుర్రాల కళేబరాలనూ తింటున్నారు! మాటలకందని విషాదం... యూఎన్ ఆఫీస్ ఫర్ ద కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ (ఓసీహెచ్ఏ) గణాంకాల మేరకు గాజాలోని మొత్తం 23 లక్షల మందినీ తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. వారిలోనూ ► లక్షల మందికి పైగా తీవ్రమైన కరువు పరిస్థితుల బారిన పడ్డారు. ఇజ్రాయెల్ వైఖరే ఇందుకు ప్రధాన కారణం... ► గాజాలోకి సహాయ సామ్రగి కోసం ఇజ్రాయెల్ కేవలం ఒకే ఒక ఎంట్రీ పాయింట్‌ను తెరిచి ఉంచింది. ► ఆ మార్గంలోనూ దారిపొడవునా లెక్కలేనన్ని చెక్ పాయింట్లు పెట్టి ఒక్కో వాహనాన్ని రోజుల తరబడి తనిఖీ చేస్తోంది. ► దీనికి తోడు అతివాద ఇజ్రాయెలీ నిరసనకారులు పాలస్తీనా వాసులకు సాయమూ అందడానికి వీల్లేదంటూ భీష్మించుకున్నారు. ► దక్షిణ గాజా ఎంట్రీ పాయింట్‌ను కొన్నాళ్లుగా వారు పూర్తిగా దిగ్బంధించారు. ► సహాయక వాహనాలకు భద్రత కలి్పస్తున్న స్థానిక పోలీసుల్లో 8 మంది ఇటీవల ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు. అప్పట్నుంచీ ఎస్కార్టుగా వచ్చే వారే కరువయ్యారు. ► దాంతో గాజాలో సహాయక వాహనం కనిపిస్తే చాలు, జనమంతా ఎగబడే పరిస్థితి నెలకొని ఉంది! వాహన సిబ్బందిని చితగ్గొట్టి చేతికందినన్ని సరుకులు లాక్కెళ్తున్నారు. ► మరోవైపు దీన్ని సాకుగా చూపి ఇజ్రాయెల్ సహాయ వాహనాలను అడ్డుకుంటోంది. ► గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేసి వందల మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. యుద్ధానికి కారణంగా నిలిచిన ఈ దాడిలో ఐరాస పాలస్తీనా శరణార్థుల సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) సిబ్బంది పాత్రా ఉందని ఇటీవల తేలడంతో ఆ సంస్థ గాజా నుంచి దాదాపుగా వైదొలగింది. సహాయక సామగ్రి చేరవేతలో ఇన్నాళ్లూ వ్యవహరించిన ఆ సంస్థ నిష్క్రమణతో గాజావాసుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒంటరిగా మారిన ఉత్తరకొరియా.. కరువు ముంగిట కిమ్ ‘రాజ్యం’
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన ఉత్తరకొరియాలో కరువు రాజ్యమేలుతోంది. 1990ల నాటి కరువు కంటే తీవ్ర పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో సుమారు 30 లక్షల మంది ప్రాణాలొదిలారు. దేశంలో పంటల సాగు తగ్గిపోవడంతో ప్రజలకు సరిపోను ఆహార పదార్థాలు లభ్యం కావడం లేదు. సరిహద్దులను పూర్తిగా మూసివేయడంతో పరిస్థితి విషమంగా మారింది. సరిహద్దుల వెంట ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే జనం ఆకలితోచనిపోతున్నట్లు సమాచారం. దేశంలో ఆహార కొరత ఏర్పడిన విషయాన్ని సాక్షాత్తూ అధ్యక్షుడు కిమ్ స్వయంగా అంగీకరించడం గమనార్హం. మరోవైపు, ప్రభుత్వం క్షిపణులు, అ«ణ్వాయుధాల తయారీకి భారీగా ఖర్చు పెడుతోంది. -
పుష్కలంగా ఆహారం.. అయినా పోషకాహార లోపం..
సాక్షి, అమరావతి: దేశంలో ఆహారం పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ పోషకాహార లోపం పిల్లలను, మహిళలను పట్టిపీడిస్తోంది. తిండి కొరతవల్ల కాకుండా ఆహారపు అలవాట్లు కారణంగానే ఎక్కువమంది ఈ లోపం బారిన పడుతున్నారు. నిజానికి.. దేశంలో తలసరి ఆహార ఉత్పత్తి గత కొన్నేళ్లుగా క్రమంగా పెరుగుతోంది. 1980 ప్రారంభంలో ఒక వ్యక్తికి రోజుకు ఒక కిలోకంటే కొంత ఎక్కువగాను.. ఇటీవల కాలంలో 1.73 కిలోల ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్య, పోషకాహార సూచికలు పేలవంగా ఉన్నాయని.. ఈ సూచికల క్షీణత ఆందోళన కలిగిస్తోందని నాబార్డు నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–2021 వెల్లడించింది. నివేదికలో పొందుపర్చిన సూచనలు, ఇతర ముఖ్యాంశాలివీ.. ► దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో 67.1% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ► 15–49 ఏళ్లలోపు మహిళల్లోని 57 శాతం మందిని కూడా ఇదే సమస్య పట్టిపీడిస్తోంది. 2015–16తో పోలిస్తే పిల్లల్లోనూ, మహిళల్లోనూ ఇది పెరగడం ఆందోళన కలిగించే అంశం. ► ఆహారాన్ని తక్కువగా తీసుకోవడమే పోషకాహార లోపానికి ప్రధాన కారణం. ► పౌష్టికాహారం అందుబాటులో ఉన్నప్పటికీ ఆహారపు అలవాట్లు కారణంగా ఈ లోపాలబారిన పడుతున్నారు. ► ఎక్కువగా కారం, నూనె, చక్కెరతో కూడిన ఆహారం తీసుకోవడమే కారణం. ► ఈ లోపానికి పూర్తిగా కొనుగోలు సామర్థ్యం తక్కువగా ఉండటం కారణం కాదు. ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబాల వారిలో కూడా ఈ లోపాలున్నాయి. ► ఈ లోపంతో పిల్లలు బరువు తక్కువగా ఉండటం చాలా సాధారణమైంది. ► శరీరం పోషకాలను గ్రహించడం కూడా ప్రభావితం చేస్తుంది. స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రతతో పాటు వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోవడంలో సమతుల్యత పాటించాలి. ► ఆరోగ్య సూచికలను మెరుగుపరచడానికి పోషకాహారంపై ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యం. ► ఆహార భద్రతపై అనేక నివేదికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. పంటలు, పశువులు, చేపలలో రసాయనాలు, హార్మోన్లు అధికంగా ఉంటున్నాయి. ► రసాయన అవశేషాల వినియోగంపై కఠినమైన నియంత్రణ ఉండాలి. -
గోధుమల ఎగుమతులపై నిషేధం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గోధుమలు, గోధుమ పిండి ధరల్ని కట్టడి చేయడానికి వాటి ఎగుమతుల్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కాలంలో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఏకంగా 14–20శాతం వరకు పెరగడంతో ధరల్ని నియంత్రించడానికి ఎగుమతుల్ని నిలిపివేసింది. ఎగుమతులపై నిషేధం నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) శుక్రవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన నోటిఫికేషన్ స్పష్టం చేసింది. అయితే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆధారంగా మే 13 వరకు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం గోధుమల ఎగుమతికి అనుమతినిస్తామని పేర్కొంది. అంతే కాదు ఆహార కొరతనెదుర్కొంటున్న ఇరుగు పొరుగు దేశాలకు కేంద్ర ప్రభుత్వం చెప్పిన దేశాలకు గోధుమల ఎగుమతి జరుగుతుందని స్పష్టం చేసింది. గోధుమ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయికి చేరుకున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 70 లక్షల టన్నుల గోధుమల ఎగుమతులు జరిగాయి. మొత్తం ఎగుమతుల్లో 50శాతం బంగ్లాదేశ్‌కే వెళ్లాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆయా దేశాల నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో చాలా దేశాలు గోధుమల కోసం భారత్‌పైనే ఆధారపడ్డాయి. దీంతో రైతుల దగ్గర నుంచి మంచి ధరకు గోధుమల్ని కొన్ని సంస్థలు కొనుగోలు చేశాయి. ఈ సమయంలో గోధుమల ఎగుమతులపై నిషేధాన్ని విధించడమంటే రైతు వ్యతిరేక విధానమని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అంతర్జాతీయంగా గోధుమలకు గిరాకీ పెరగడంతో రైతులకు మంచి ధర వస్తూ ఉంటే వాటిని ఆపేసిందంటూ కాంగ్రెస్ నాయకుడు చిదంబరం మండిపడ్డారు. మరోవైపు భారత్ కృషిక్ సమాజ్ (బీకేఎస్) కూడా గోధుమల ఎగుమతుల నిలిపివేతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతు ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించడం అంటే అది పరోక్షంగా రైతులపై పన్ను విధించడమేనని ఆ సంస్థ చైర్మన్ అజయ్ విర్ జాఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం గోధుమల నిషేధం చర్యల్ని సమర్థించుకుంది. గోధుమ ధరలు 40% పెరిగిపోవడంతో ధరల్ని కట్టడి చేయడానికే ఎగుమతుల్ని నిలిపివేశామని చెబుతోంది. -
హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు!
The biggest challenge facing humans in space is eating లండన్: ప్రస్తుతం ప్రపంచమంతా అంటువ్యాధులతో మగ్గిపోతోంది. మరోవైపు భవిష్యత్తులో అంతరిక్షంలో స్థిరపడాలని కలలు కంటోంది కూడా. ఐతే అంతరిక్షంలో స్థిరపడాలనే కల అంత తేలికగా నెరవేరదని తాజాగా సైంటిస్టులు అందుకు సంబంధించి విస్తుపోయే విస్తవాలను వెల్లడించారు. ఒక వేళ మనుషులు స్పేస్‌లో స్థిరపడితే ఆహార కొరత కారణంగా ఒకరినొకరు చంపుకుతింటారని హెచ్చరించారు. అంతరిక్షంలో స్థిరపడితే ఎదుర్కొనవల్సిన సవాళ్లను జనాళ్ల ముందుంచారు. దీంతో అందరూ ఆలోచనలోపడ్డారు. బృహస్పతి, శని గ్రహాలకు చెందిన చందమామలు (మూన్స్) క్యాలిస్టో, టైటాన్లు మానవులు జీవించడానికి అనుకూలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఐతే అంగారక గ్రహం లేదా చంద్రుడిపై ఒక కాలనీని స్థాపించి, అనుకోని విపత్తు ఏదైనా సంభవిస్తే భూమి నుంచి ఈ రెండు ప్రదేశాలకు ఆహారాన్ని సప్లై చేయడం కుదురుతుందో లేదో ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు. వ్యాధులు ప్రభలడం, ఆహార కొరత వంటి క్లిష్ట పరిస్థితుల్లో భూమి నుంచి సహాయం రావడానికి సంవత్సరాల కాలం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు యూకే నివేదిక ప్రకారం.. ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోబయాలజీ ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ ఏం చెబుతున్నారంటే.. భూమి నివాసయోగ్యం కానప్పుడు ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలో నవాసాలేర్పరచుకోవాలి. అది సాధ్యపడాలంటే ముందుగా పరీక్షలు నిర్వహించాలి. ఈ విషయంలో చరిత్ర నుంచి విలువైన పాఠం నేర్చుకోవాలి. 19వ శతాబ్ధం చివరి భాగంలో కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ నార్త్-వెస్ట్ పాసేజ్‌ను వెతకడానికి బయలుదేరారు. ఆ సమయంలో సాంకేతికత లోపం తలెత్తడంతో దారితప్పారు. వారివద్ద క్యాన్డ్ ఫుడ్ కూడా ఉంది. ఐతే ఆధునిక కాలపు అత్యుత్తమ సాంకేతికత కలిగిఉన్నప్పటికీ అక్కడికి వెళ్లినవారంతా ఒకరినొకరు చంపుకు తిన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఏకాకైన మానవ సమాజాలు చాలా త్వరగా నశించిపోతాయని ప్రొఫెసర్ కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఆహార కొరత అక్కడ ఎదుర్కొనే సమస్యలకు సిద్ధపడకుండా కాలిస్టోలోకి మనుషులను పంపితే, పరిణామాలు తప్పవు. తిండి దొరక్క బతకడానికి వేరే మార్గం లేక ఒకరినొకరు తింటారని భవిష్యత్ పరిస్థితిని కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులకు ఆహార సరఫరా ఒక ప్రధాన సవాలని డాక్టర్ కామెరాన్ స్మిత్ కూడా ఆయనతో ఏకీభవించాడు. అంతరిక్షంలో మానవ మనుగడను స్థాపించడానికి ముందుగా వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ గ్రహాంతరవాసుల కోసం వెతుకులాట కొనసాగిస్తోంది. చదవండి: Omicron: స్కూళ్లు, సినిమా హాళ్లు మళ్లీ మూత! -
అఫ్గాన్‌లో ఆహార కొరత తీవ్రం!
ఐక్యరాజ్యసమితి: తాలిబన్ల చేతికి చిక్కిన అఫ్గానిస్తాన్‌లో ఆహారం కొరత వేధిస్తోంది. ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. పేదల పరిస్థితి దయనీయంగా మారింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఆహార నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు నాటికి నిల్వలు పూర్తిగా నిండుకోవడం ఖాయమని అఫ్గాన్‌లో ఐరాస ప్రతినిధి రమీజ్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో మూడొంతుల్లో కనీసం ఒక వంతు ప్రజలకు రోజుకు ఒకసారైనా తిండి దొరుకుతుందని కచ్చితంగా చెప్పలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరు దాకా ఎలాగోలా నెట్టికొచ్చినా ఆ తర్వాత ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఇక అత్యవసరమైన ఔషధాలు లేకుండా దొరకడం లేదని అన్నారు. మరోవైపు అఫ్గాన్‌లో తీవ్రమైన కరువు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
ఖతర్ అష్టదిగ్బంధం
► సంబంధాలు తెంచుకున్న పొరుగు దేశాలు ► ఆహార కొరత ముంగిట ఖతర్ ► మూడో వంతు జనాభా భారతీయులే ► ఆందోళనలో వలస కార్మికులు నిత్యం రాజకీయ అస్థిరత తాండవించే పశ్చిమాసియాలో ఖతర్ కేంద్రంగా మరో సంక్షోభం ముదురుతోంది. హైదరాబాద్ నగరానికి రెండింతలుండే ఈ దేశంలో ఎక్కువ జనాభా భారతీయులే. ప్రపంచంలోనే అత్య ధిక తలసరి ఆదాయం(రూ.84.3 లక్షలు) గల ఈ దేశంతో సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు దౌత్య సంబంధాల్ని తెంచు కున్నాయి. జిహాదీ, ఉగ్రవాద సంస్థలకు ఖత ర్ మద్దతిస్తుందని ఆరోపిస్తూ ఆ దేశంతో భూ, జల, వాయుమార్గాల్ని మూసివేశాయి. పొరు గుదేశాల సహాయనిరాకరణతో ఆహారం, నిత్యావసరాల కోసం ఇప్పుడు ఖతర్ విలవిలలాడుతోంది. ఎందుకీ సంక్షోభం.. ఖతర్.. ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తూ మద్దతు ఇస్తోందనే ప్రధాన ఆరోపణతో జూన్ 5న పొరుగు దేశాలు దౌత్య సంబంధాల్ని తెంచుకోవడంతో పాటు తమ దేశాల్లోని ఖతర్ పౌరులు 14 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలనీ అల్టిమేటం జారీచేశాయి. ఈ నేపథ్యంలో ఖతర్‌లో ఆహార సంక్షోభం ఏర్పడింది. ఆ దేశానికి అవసర మయ్యే ఆహారంలో దాదాపు 40 శాతం సర ఫరా అవుతున్న ఏకైక భూసరిహద్దు మార్గాన్ని సౌదీ మూసివేసింది. ఆహార కొరత భయంతో ప్రజలు మార్కెట్లకు వెల్లువెత్తుతున్నారు. చాలా విమానయాన సంస్థలు దోహా నుంచి విమానాల రాకపోకలను రద్దు చేశాయి. తమ గగనతలంలో ఖతర్ విమాన రాకపోకల్ని పొరుగు దేశాలు నిషేధించడంతో విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం పడుతోంది. యెమెన్, మాల్దీవులు, లిబియా ప్రభుత్వాలు కూడా ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్, కువైట్, రష్యాలు అండగా నిలిచాయి. ఉగ్రవాదానికి సాయం నిజమేనా..? ఖతర్, పొరుగు దేశాలకు.. చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కొన్ని గల్ఫ్ దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ‘ముస్లిం బ్రదర్హుడ్’ సహా పలు ప్రాంతీయ ఇస్లామిక్ గ్రూపులకు ఖతర్ మద్దతివ్వడం పొరుగు దేశాల ఆగ్రహానికి కారణమైంది. షియా ప్రాబల్యమున్న ఇరాన్‌తో ఖతర్ సన్నిహిత సంబంధం.. సున్నీ ఆధిక్య సౌదీ అరేబియాకు కోపం తెప్పిస్తోంది. ఇరాన్ విషయంలో అమెరికా శత్రుపూర్వకంగా వ్యవహరిస్తోందని, ప్రాంతీయ సుస్థిరత నెలకొల్పడంలో ఇరాన్ పెద్ద శక్తిగా పేర్కొంటూ ఖతర్ ప్రభుత్వ వార్తా సంస్థ వెబ్సైట్లో గతనెల్లో ఒక కథనం ప్రచురి తమైంది. ఆ కథనం హ్యాకర్ల పనని ఖతర్ పాలకులు పేర్కొన్నా.. పొరుగు దేశాలు మాత్రం శాంతించలేదు. నిజానికి ఐసిస్ పోరాటానికి అమెరికా సారథ్యంలోని సంకీర్ణంలో ఖతర్ కూడా భాగస్వామి. అయితే ఐసిస్‌కు ఖతర్ ఆర్థిక సాయం చేస్తోందని ఇరాక్‌లోని షియా నాయకుల ఆరోపణ. అల్‌కాయిదాతో సంబంధాలున్న హయత్ తాహ్రిర్ అల్షామ్తో సంబంధాలున్నాయనే ఆరోపణల్ని తోసిపుచ్చింది. అఫ్గాన్ తాలిబాన్ ఖతర్ రాజధాని దోహాలో ఉండటం గమనార్హం. మూడోవంతు భారతీయులే.. ప్రపంచంలో మూడో అతి పెద్ద సహజవాయువు నిక్షేపాలు, చమురు నిల్వలున్న ఖతర్ విస్తీర్ణం 11,586 చదరపు కిలోమీటర్లు. 2003లో జనాభా ఏడు లక్షలు కాగా.. ప్రస్తుతం 25 లక్షలు.. 2022 ఫిఫా ప్రపంచకప్ పోటీల కోసం స్టేడియాలు, ఇతర నిర్మాణ పనులు పెద్ద ఎత్తున సాగుతుండడంతో భారత్, ఇతర దేశాల నుంచి భారీగా వలసలు చోటుచేసుకు న్నాయి. జనాభాలో 12 శాతం ఖతర్ పౌరులు కాగా.. మూడో వంతు(6.5 లక్షలు) భారతీ యులే. మతపరంగా ముస్లింలు, క్రైస్తవుల తర్వాత మూడో స్థానంలో హిందువులే ఉన్నారు. ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నా పని పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. చాలా మం ది కార్మికులు ఇంకా శిబిరాల్లోనే దుర్భర పరిస్థితుల్లోవున్నారని పలు అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు వెల్లడించాయి. కార్మికులు దోపిడీకి గురవుతున్నారని అవి పేర్కొన్నాయి. ఖతర్‌కు అండగా ఇరాన్ 5 విమానాలు, 3 నౌకల్లో ఆహారపదార్థాల సరఫరా టెహరాన్: ఖతర్‌ను ఆదుకునేందుకు ఇరాన్ రంగంలోకి దిగింది. ఆహారపదార్థాలతో కూడిన ఐదు విమానాలను ఖతర్‌కు పంపింది. పండ్లు, కూరగాయలు వంటి నిత్యావసరాల్ని ఖతర్‌కు పంపామని, ఒక్కో విమానంలో 90 టన్నుల ఆహారపదార్థాల్ని తరలించినట్లు ఇరాన్ జాతీయ విమానయాన సంస్థ తెలిపింది. అవసరమైన మేరకు సరఫరా కొనసాగిస్తామని వెల్లడిం చింది. మరోవైపు 350 టన్నులతో కూడిన ఆహారపదార్థాలతో మూడు నౌకలు ఇప్పటికే ఖతర్‌కు బయల్దేరాయి. కాగా మానవతా దృక్పథంతో కొందరు ఖతర్ దేశస్తుల్ని తమ దేశంలో ఉండేందుకు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈలు అనుమతించాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఫుడ్ కలర్‌గానూ బీట్రూట్
తిండి గోల యూరప్‌లో ఆహార కొరత ఏర్పడినప్పుడు, వ్యాధులు ప్రబలినప్పుడు అక్కడి ప్రజలు బతకడానికి దుంపజాతికి చెందినవాటినే ప్రధానంగా బీట్‌రూట్‌నే జీవనాధారంగా చేసుకున్నారనే వార్తలు ఉన్నాయి. దుంప జాతికి చెందిన బీట్రూట్ స్వస్థలం నార్త్ అమెరికా. మన దగ్గర బంగాళదుంప, చిలగడ దుంప, ముల్లంగి.. వంటి దుంప రకాలు ఉన్నాయి. వాటి జాబితాలోనిదే బీట్రూట్ కూడా! ఇంగ్లిషు రాని వారితో కూడా ఇంగ్లిషులోనే పిలిపించుకునే కూరగాయ ఇదొక్కటే అయి ఉంటుంది. బ్రిటీష్ వారితో పాటు ఇది మన దేశంలో అడుగుపెట్టింది. బీట్రూట్లో రక్తాన్ని వృద్ధి చేసే గుణాలు, యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పచ్చిగానే ముక్కలు చేసుకొని, భోజనంలో సైడ్ డిష్‌గా తినడానికి కారణం అదే! డచ్ దేశ స్థుల సంప్రదాయ వంట బీట్రూట్, ఉడికించిన కోడిగుడ్డుతో కలిపి నిల్వపచ్చడి పెట్టడం పోలండ్, ఉక్రెయిన్‌లో సూప్‌లు, శాండ్‌విచ్‌లలో బీట్రూట్ను విరివిగా ఉపయోగిస్తారు. రష్యా వంటకాలలోనూ సైడ్ డిష్‌గా బీట్రూట్ ఉండాల్సిందే! నీటి శాతం తక్కువగా ఉండే ఈ దుంపతో జ్యూస్‌లు బాగా చేస్తారు. వైన్ తయారీలో బీట్రూట్ ఉంటుంది. టొమాటో పేస్ట్, సాస్, డిజెర్ట్, జామ్స్, జెల్లీ, ఐస్‌క్రీమ్, స్వీట్లు...లలో బీట్రూట్ను కలర్‌గా ఉపయోగిస్తారు. -
పరలోకాహారం కోసం ప్రార్థించాలి!
ఆహార కొరతకు, ఆకలి చావులకు కేంద్రంగా ఉండేది పాలస్తీనా (ఇప్పటి ఇజ్రాయేల్). తమ ఆహార సమస్యకు, ఆకలి చావులకు పరిష్కారంగా భావించి వేలాదిమంది యేసు ఎక్కడుంటే అక్కడకు వచ్చేవారు. బాధలు, రోగాలు, తాత్కాలిక సమస్యలకు పరిష్కారంగా తనని ఆశ్రయించే వారిని మందలిస్తూ... క్షయమైన వాటికోసం కాదు, అక్షయమైన వాటికోసం తాపత్రయపడాలని ఉద్బోధించాడు ప్రభువు. భూలోక సంబంధమైన ఆహారం కాకుండా జీవాహారమైన ప్రభువు విశ్వాసి జీవితంలో భాగం కావడం ఎంత ఆశీర్వాదకరమో కదా! ఆ జీవాహారం సమృద్ధిగా అందుబాటులో ఉండగా క్షయమైన లోకావసరాలను మాత్రమే లక్ష్యపెడుతూ, పరలోకపు ఈవులను, విలువలను నిర్లక్ష్యం చేయడం నిజంగా దురదృష్టకరం. ప్రపంచంలో మరే ప్రాణికీ లేనివిధంగా మనిషి మూలాలు దేవునిలో ఉన్నాయి. అంతిమంగా దైవప్రసన్నతను, సాన్నిధ్యాన్ని అనుభవించడంలోనే మనిషి నిజమైన శాంతిని, జీవన సంతృప్తిని పొందుతాడు. లోకం ఇవ్వగలిగిన వాటికోసం కాదు... దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన నిత్యజీవం కోసం ఆయన్ని ఆశ్రయించే క్రమశిక్షణను మనిషి పెంపొందించుకోవాలి. - టి.ఎ.ప్రభుకిరణ్