The biggest challenge facing humans in space is eating లండన్: ప్రస్తుతం ప్రపంచమంతా అంటువ్యాధులతో మగ్గిపోతోంది. మరోవైపు భవిష్యత్తులో అంతరిక్షంలో స్థిరపడాలని కలలు కంటోంది కూడా. ఐతే అంతరిక్షంలో స్థిరపడాలనే కల అంత తేలికగా నెరవేరదని తాజాగా సైంటిస్టులు అందుకు సంబంధించి విస్తుపోయే విస్తవాలను వెల్లడించారు. ఒక వేళ మనుషులు స్పేస్‌లో స్థిరపడితే ఆహార కొరత కారణంగా ఒకరినొకరు చంపుకుతింటారని హెచ్చరించారు. అంతరిక్షంలో స్థిరపడితే ఎదుర్కొనవల్సిన సవాళ్లను జనాళ్ల ముందుంచారు. దీంతో అందరూ ఆలోచనలోపడ్డారు. బృహస్పతి, శని గ్రహాలకు చెందిన చందమామలు (మూన్స్) క్యాలిస్టో, టైటాన్‌లు మానవులు జీవించడానికి అనుకూలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఐతే అంగారక గ్రహం లేదా చంద్రుడిపై ఒక కాలనీని స్థాపించి, అనుకోని విపత్తు ఏదైనా సంభవిస్తే భూమి నుంచి ఈ రెండు ప్రదేశాలకు ఆహారాన్ని సప్లై చేయడం కుదురుతుందో లేదో ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు.
వ్యాధులు ప్రభలడం, ఆహార కొరత వంటి క్లిష్ట పరిస్థితుల్లో భూమి నుంచి సహాయం రావడానికి సంవత్సరాల కాలం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు యూకే నివేదిక ప్రకారం.. ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోబయాలజీ ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ ఏం చెబుతున్నారంటే.. భూమి నివాసయోగ్యం కానప్పుడు ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలో నవాసాలేర్పరచుకోవాలి. అది సాధ్యపడాలంటే ముందుగా పరీక్షలు నిర్వహించాలి. ఈ విషయంలో చరిత్ర నుంచి విలువైన పాఠం నేర్చుకోవాలి. 19వ శతాబ్ధం చివరి భాగంలో కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ నార్త్-వెస్ట్ పాసేజ్‌ను వెతకడానికి బయలుదేరారు. ఆ సమయంలో సాంకేతికత లోపం తలెత్తడంతో దారితప్పారు. వారివద్ద క్యాన్డ్ ఫుడ్ కూడా ఉంది. ఐతే ఆధునిక కాలపు అత్యుత్తమ సాంకేతికత కలిగిఉన్నప్పటికీ అక్కడికి వెళ్లినవారంతా ఒకరినొకరు చంపుకు తిన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఏకాకైన మానవ సమాజాలు చాలా త్వరగా నశించిపోతాయని ప్రొఫెసర్ కొకెల్ వివరించారు.
అంతరిక్షంలో మానవులు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఆహార కొరత
అక్కడ ఎదుర్కొనే సమస్యలకు సిద్ధపడకుండా కాలిస్టోలోకి మనుషులను పంపితే, పరిణామాలు తప్పవు. తిండి దొరక్క బతకడానికి వేరే మార్గం లేక ఒకరినొకరు తింటారని భవిష్యత్ పరిస్థితిని కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులకు ఆహార సరఫరా ఒక ప్రధాన సవాలని డాక్టర్ కామెరాన్ స్మిత్ కూడా ఆయనతో ఏకీభవించాడు. అంతరిక్షంలో మానవ మనుగడను స్థాపించడానికి ముందుగా వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
కాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ గ్రహాంతరవాసుల కోసం వెతుకులాట కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment