University of Edinburgh
-
హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు!
The biggest challenge facing humans in space is eating లండన్: ప్రస్తుతం ప్రపంచమంతా అంటువ్యాధులతో మగ్గిపోతోంది. మరోవైపు భవిష్యత్తులో అంతరిక్షంలో స్థిరపడాలని కలలు కంటోంది కూడా. ఐతే అంతరిక్షంలో స్థిరపడాలనే కల అంత తేలికగా నెరవేరదని తాజాగా సైంటిస్టులు అందుకు సంబంధించి విస్తుపోయే విస్తవాలను వెల్లడించారు. ఒక వేళ మనుషులు స్పేస్‌లో స్థిరపడితే ఆహార కొరత కారణంగా ఒకరినొకరు చంపుకుతింటారని హెచ్చరించారు. అంతరిక్షంలో స్థిరపడితే ఎదుర్కొనవల్సిన సవాళ్లను జనాళ్ల ముందుంచారు. దీంతో అందరూ ఆలోచనలోపడ్డారు. బృహస్పతి, శని గ్రహాలకు చెందిన చందమామలు (మూన్స్) క్యాలిస్టో, టైటాన్లు మానవులు జీవించడానికి అనుకూలంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఐతే అంగారక గ్రహం లేదా చంద్రుడిపై ఒక కాలనీని స్థాపించి, అనుకోని విపత్తు ఏదైనా సంభవిస్తే భూమి నుంచి ఈ రెండు ప్రదేశాలకు ఆహారాన్ని సప్లై చేయడం కుదురుతుందో లేదో ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలని భావిస్తున్నారు. వ్యాధులు ప్రభలడం, ఆహార కొరత వంటి క్లిష్ట పరిస్థితుల్లో భూమి నుంచి సహాయం రావడానికి సంవత్సరాల కాలం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు యూకే నివేదిక ప్రకారం.. ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన ఆస్ట్రోబయాలజీ ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ ఏం చెబుతున్నారంటే.. భూమి నివాసయోగ్యం కానప్పుడు ప్రత్యామ్నాయంగా అంతరిక్షంలో నవాసాలేర్పరచుకోవాలి. అది సాధ్యపడాలంటే ముందుగా పరీక్షలు నిర్వహించాలి. ఈ విషయంలో చరిత్ర నుంచి విలువైన పాఠం నేర్చుకోవాలి. 19వ శతాబ్ధం చివరి భాగంలో కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ నార్త్-వెస్ట్ పాసేజ్‌ను వెతకడానికి బయలుదేరారు. ఆ సమయంలో సాంకేతికత లోపం తలెత్తడంతో దారితప్పారు. వారివద్ద క్యాన్డ్ ఫుడ్ కూడా ఉంది. ఐతే ఆధునిక కాలపు అత్యుత్తమ సాంకేతికత కలిగిఉన్నప్పటికీ అక్కడికి వెళ్లినవారంతా ఒకరినొకరు చంపుకు తిన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఏకాకైన మానవ సమాజాలు చాలా త్వరగా నశించిపోతాయని ప్రొఫెసర్ కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులు ఎదుర్కొనే అతిపెద్ద సవాలు ఆహార కొరత అక్కడ ఎదుర్కొనే సమస్యలకు సిద్ధపడకుండా కాలిస్టోలోకి మనుషులను పంపితే, పరిణామాలు తప్పవు. తిండి దొరక్క బతకడానికి వేరే మార్గం లేక ఒకరినొకరు తింటారని భవిష్యత్ పరిస్థితిని కొకెల్ వివరించారు. అంతరిక్షంలో మానవులకు ఆహార సరఫరా ఒక ప్రధాన సవాలని డాక్టర్ కామెరాన్ స్మిత్ కూడా ఆయనతో ఏకీభవించాడు. అంతరిక్షంలో మానవ మనుగడను స్థాపించడానికి ముందుగా వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. కాగా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ గ్రహాంతరవాసుల కోసం వెతుకులాట కొనసాగిస్తోంది. చదవండి: Omicron: స్కూళ్లు, సినిమా హాళ్లు మళ్లీ మూత! -
డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువే!
లండన్: కరోనా డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ తీవ్రతకలదని, అందుకే ఇది సోకిన వారిలో కొద్దిమందే ఆస్పత్రిపాలవుతున్నారని రెండు వేర్వేరు అధ్యయనాలు వెల్లడించాయి. లండన్ ఇంపీరియల్ కాలేజీ, ఎడిన్బర్గ్ యూనివర్సిటీలు రోగులు, ఆస్పత్రులనుంచి గణాంకాలు సేకరించి ఈ అధ్యయనాలను రూపొందించాయి. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ సోకిన వారు ఆస్పత్రిలో గడపాల్సిరావడం 40–45 శాతం తక్కువని ఇంపీరియల్ కాలేజీ నివేదిక తెలిపింది. గతంలో ఒకసారి కరోనా సోకి, మరలా ఇప్పుడు ఒమిక్రాన్ సోకినవారిలో ఆస్పత్రిలపాలయ్యే ఛాన్సులు తక్కువని తెలిపింది. టీకాలు తీసుకోనివారిలో హాస్పిటలైజేషన్ రిస్క్ అధికమేనని హెచ్చరించింది. ఒమిక్రాన్‌కు ఉన్న అధిక వేగం కారణంగా ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నివేదిక రూపకర్తల్లో ఒకరైన నీల్ ఫెర్గూసన్ చెప్పారు. ఈ అధ్యయనం కోసం 56వేల ఒమిక్రాన్, 2.69 లక్షల డెల్టా కేసులను పరిశీలించారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ ప్రభావం తక్కువేనని ఎడిన్బర్గ్ వర్సిటీ నివేదిక తెలిపింది. ఇది సంతోషకరమైన విషయమని, కానీ అంతమాత్రాన అశ్రద్ధ కూడదని ఆరోగ్యనిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న వేళ పండుగ సంబరాలపై నిబంధనలు విధిస్తున్నారు. దక్షిణాఫ్రికాదీ అదేమాట కరోనా గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ తీవ్రత తక్కువని దక్షిణాఫ్రికాలోని విట్వాటర్ర్సాండ్ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ తీవ్రత చాలా తగ్గిందని యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర షెరిల్ కోహెన్ చెప్పారు. మిగిలిన ఆఫ్రికన్ దేశాల్లో కూడా ఒమిక్రాన్ ప్రభావం తగ్గవచ్చని అంచనా వేశారు. అయితే అధిక వ్యాక్సినేషన్ ఉన్న దేశాలతో పోలిస్తే అల్ప వ్యాక్సినేషన్ దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉండొచ్చన్నారు. దేశంలో నడుస్తున్న నాలుగో వేవ్ గత వేవ్స్ కన్నా తక్కువ ప్రమాదకారిగా తేలిందని దక్షిణాఫ్రికా ఆరోగ్య నిపుణులు వాసిలా జసాత్ చెప్పారు. ఈ వేవ్‌లో తొలి నాలుగు వారాల్లో భారీగా కేసులు నమోదయ్యాయని, అయితే వీటిలో 6 శాతం కేసులు మాత్రమే ఆస్పత్రికి చేరాయని వివరించారు. అలాగే సీరియస్ కండీషన్లోకి దిగజారిన పేషెంట్ల సంఖ్యకూడా గతం కన్నా తక్కువేనన్నారు. గత వేవ్స్‌లో కరోనా సోకిన వారిలో 22 శాతం మరణించగా, నాలుగో వేవ్‌లో మరణాలు 6 శాతానికి పరిమితమయ్యాయని తెలిపారు. ప్రజల్లో ఇమ్యూనిటీ పెరగడం, టీకాల విస్తృతి పెరగడం, వేరియంట్లో విరులెన్స్(విష తీవ్రత) తగ్గడం వంటి అనేక కారణాలు ఇందుకు దోహదం చేసిఉండొచ్చని, దీనిపై మరింత అధ్యయనం జరగాల్సిఉందని చెప్పారు. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్‌తో హాస్పటలైజేషన్ రిస్కు 80 శాతం తక్కువ కాగా తీవ్ర లక్షణాలు కనిపించే రిస్కు 70 శాతం తక్కువని దక్షిణాఫ్రికా జాతీయ అంటువ్యాధుల సంస్థ తెలిపింది. -
డిప్రెషన్, ఆందోళనతో గుండెజబ్బులు ఎక్కువవుతాయి..
ఎడిన్బర్గ్ : నడివయస్సులో మానసిక ఒత్తిడి(డిప్రెషన్), ఆందోళనల కారణంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు అంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనల వల్ల మహిళలలో గుండెపోటు వచ్చే అవకాశం 44శాతం ఎక్కువని స్కాట్లాండ్కు చెందిన ‘‘యూనివర్శిటీ ఆఫ్ ఈడెన్‌బర్గ్’’ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పురుషులలో 45-79 సంవత్సరాల వయస్సు గల వారిలో మానసిక ఒత్తిడి కారణంగా గుండెపోటు వచ్చే అవకాశం 30 శాతం ఎక్కువని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఆస్ట్రేలియాకు చెందిన 2,21,677 మందిపై ఈ బృందం పరిశోదనలు జరిపింది. మానసిక ఒత్తిళ్లలో తేడాలను బట్టి వారిని మూడు విభాగాలుగా విభజించారు. మానసిక ఒత్తిళ్ల స్థాయిని తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు వారిని పది ప్రశ్నలు అడిగారు. 1,02,039 మంది పురుషులలో (ప్రామాణిక వయస్సు 62), 1,19638 మంది మహిళలలో(ప్రామాణిక వయస్సు 60) 16.2 శాతం మంది మధ్యస్తమైన మానసిక ఒత్తిడిని కలిగి ఉన్నారని,7.3 శాతం మంది అధిక మానసిక ఒత్తిడిని కలిగి ఉన్నారని తేలింది. దాదాపు నాలుగేళ్ల అనంతరం వారిలో 4వేల గుండెపోట్లు, 2 వేల స్ట్రోక్‌లు నమోదైనట్లు వారు గుర్తించారు. వ్యక్తుల జీవన విధానాలను బట్టి వారి మధ్య జబ్బు తీవ్రతలో తేడాలుండొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. -
త్వరలో... జెట్‌లాగ్‌కు చుక్కల మందు!
పరిపరిశోధన జెట్‌లాగ్‌ను తగ్గించే చుక్కల మందును రూపొందించే పనిలో ఉన్నారు స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడింబర్గ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. కళ్లలో కాస్త చుక్కల మందు వేయడం ద్వారా బయలాజికల్ క్లాక్‌ను సరిచేసి, జెట్లాగ్ అనర్థాలను తగ్గించవచ్చని వారు పేర్కొంటున్నారు. వెలుతురు రాగానే నిద్రలేవడం, చీకటి పడ్డ తర్వాత నిద్రకు ఉపక్రమించడం అన్నది మన జీవగడియారంలో మనం స్వాభావికంగా సెట్ అయి ఉండటం వల్ల సాధ్యపడుతోందన్న విషయం తెలిసిందే. ఇలా లయబద్ధంగా నిద్రలేవడం, నిద్రరావడాన్ని సర్కాడియన్ రిథమ్‌గా పేర్కొంటాం. మనకు రాత్రీ, విదేశాల్లో పగలు ఉండే దేశాలకు వెళ్లినప్పుడు లేదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు జీవగడియారంలో సెట్ అయిన ప్రోగ్రామ్ అయిన సర్కాడియన్ రిథమ్‌కు విఘాతం కలుగుతుంది. ఫలితంగా రాత్రిళ్లు నిద్రలేకపోవడం లేదా పగటివేళ నిద్రముంచుకురావడం వంటి అనర్థాలు కలుగుతుంటాయి. దీన్నే జెట్లాగ్గా అభివర్ణిస్తారు. కళ్లలో వేసే ఈ మందు... మెదడులో జీవగడియారం ఉండే ప్రాంతంలోని కణాలతో అనుసంధానితమై జెట్లాగ్ నివారిస్తుందని పేర్కొంటున్నారు ఎడింబర్గ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. అంతేకాదు... ఈ చుక్కల మందు పరిజ్ఞానాన్ని భవిష్యత్తులో రాత్రివేళల్లో పనిచేయాల్సి రావడం వల్ల పగలు ఇబ్బంది పడేవారికీ ఉపయోగించవచ్చునని పరిశోధకులు పేర్కొంటున్నారు. -
లుంగీ డ్యాన్స్‌తో థ్రిల్ చేశాడు!
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌ను బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత యూనివర్సిటీ ఎడిన్బర్గ్ ఘనంగా సత్కరించింది. ఆయన చేస్తున్న మానవతా సేవలకు గుర్తింపుగా గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ జీవితపాఠాలను ఉద్వేగభరితంగా వివరించారు. అనంతరం వేదికపై తన పాపులర్ లుంగీ డ్యాన్స్‌తో విద్యార్థులను అలరించాడు. ఆ తర్వాత 'నేను మళ్లీ డాకర్ట్ అయ్యానోచ్' అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు. షారుఖ్ ప్రసంగంలోని కొన్నిముఖ్యమైన అంశాలు జీవితంలో 'సాధారణం' అంటూ ఏదీ లేదు. అదొక జీవం లేని పదం మాత్రమే. సంతోషకరమై, విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే కొంత పిచ్చితనం (రొమాంటిక్ తరహాలో) కూడా అవసరమే. మీ వెర్రితనాన్ని ఎప్పుడు చంచలత్వంగా భావించకండి. బయటి ప్రపంచం నుంచి దాచిపెట్టకండి. ప్రపంచంలోని అందమైన వ్యక్తులు, సృజనకారులు, విప్లవాలు తీసుకొచ్చినవాళ్లు, ఆవిష్కరణలు చేసినవాళ్లు.. తమ నైజాన్ని, ప్రవృత్తిని స్వీకరించడం వల్లే వాటిని సాధించారు గడబిడ కావడంలో తప్పేమీ లేదు. ప్రపంచం గురించిన స్పష్టత కావాలంటే గడబిడ పడటం కూడా ఒక మార్గమే. కళాకారుడి కన్నా కళే ముఖ్యం. మీదైన కళతో మీకు అనుబంధం లేకపోవడమే వెనుకబాటు. ముందుకుసాగండి. మీరు సంపన్నులు కాకముందే తత్వవేత్తలు అవొద్దు. మీరు చేస్తున్న పని మీలో 'జోష్'ను (ఉత్సాహాన్ని) నింపకపోతే దానిని మానేయండి