
రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా స్వీయదర్శకత్వం వహించిన అద్భుత చిత్రం కాంతారకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం జెనీవాలో మార్చి 17న ఈ సినిమా ప్రదర్శించనున్నారు. స్క్రీనింగ్ పూర్తైన అనంతరం రిషబ్ శెట్టి ప్రసంగిస్తారు. ఇప్పటికే హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి స్విట్జర్లాండ్ చేరుకున్నారు.
తన సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించనుడంతో సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంతార సినిమా ప్రకృతి ప్రసాదించిన అడవుల రక్షణ గురించి ప్రస్తావించిన కాంతార చిత్రం ప్రపంచ స్థాయిలో ప్రదర్శితం కానుండటం నిజంగా గొప్ప విషయం అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ రాసుకొచ్చారు. దీనికి పలు ఫోటోలు జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన కాంతార వందల కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే! దీంతో కాంతార ప్రీక్వెల్ తీసే పనిలో పడింది చిత్రయూనిట్.
Comments
Please login to add a commentAdd a comment