కార్మిక విధానానికి ఐఎల్‌వో ఆమోదం | Labor policy approved by ilo | Sakshi
Sakshi News home page

కార్మిక విధానానికి ఐఎల్‌వో ఆమోదం

Published Sun, Jun 14 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

కార్మిక విధానానికి ఐఎల్‌వో ఆమోదం

కార్మిక విధానానికి ఐఎల్‌వో ఆమోదం

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం పరిధిలోకి వచ్చేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) ఓ విధానాన్ని ఆమోదించింది. జెనీవాలో శుక్రవారం జరిగిన 104వ అంతర్జాతీయ కార్మిక సదస్సులో 484 ఓట్ల మెజార్టీతో దీన్ని ఆమోదించారు.

భారత్‌లో 93 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారని, ఈ అంశంపై చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించిందని ఐఎల్‌వో ఉపాధి విధాన శాఖ డెరైక్టర్ అజితా అవద్ అన్నారు. సదస్సుకు భారత్ తరపున కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హాజరై ప్రసంగించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement