కార్మిక విధానానికి ఐఎల్వో ఆమోదం
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం పరిధిలోకి వచ్చేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్వో) ఓ విధానాన్ని ఆమోదించింది. జెనీవాలో శుక్రవారం జరిగిన 104వ అంతర్జాతీయ కార్మిక సదస్సులో 484 ఓట్ల మెజార్టీతో దీన్ని ఆమోదించారు.
భారత్లో 93 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారని, ఈ అంశంపై చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించిందని ఐఎల్వో ఉపాధి విధాన శాఖ డెరైక్టర్ అజితా అవద్ అన్నారు. సదస్సుకు భారత్ తరపున కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హాజరై ప్రసంగించారు.