జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పదిశాతం మంది కోవిడ్ మహమ్మారి బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర సేవల విభాగం అధిపతి డాక్టర్ మైఖేల్ రయాన్ ప్రకటించారు. డబ్ల్యూహెచ్‌వో అంచనా ప్రకారం, ఇది వాస్తవంగా కరోనా సోకిన వారి సంఖ్యకన్నా 20 రెట్లు అధికమని, రానున్నది అత్యంత క్లిష్టమైన కాలమని ఆయన హెచ్చరించారు. ప్రతి 10 మందిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడినట్లు ఆయన వెల్లడించారు.
కోవిడ్‌పై చర్చించేందుకు సమావేశమైన 34 సభ్యదేశాల ఎగ్జిక్యూటివ్ బోర్డును ఉద్దేశించి మైఖేల్ రయాన్ మాట్లాడారు. ప్రపంచ జనాభా 760 కోట్లలో, 76 కోట్ల మంది కరోనా బారిన పడ్డారన్న డబ్ల్యూహెచ్‌వో అంచనాలతో, జాన్సన్ హాకిన్స్ యూనివర్సిటీ అంచనాలు సరిపోయాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3.5 కోట్ల మందికి పైగా కరోనా బాధితులున్నారని ఆయన తెలిపారు. (కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ షురూ)
Comments
Please login to add a commentAdd a comment