
తిరువనంతపురం:మంకీపాక్స్ వైరస్ కేసులు కేరళలో మళ్లీ నమోదయ్యాయి. తాజాగా రెండు కేసులు వెలుగుచూడడం ఇక్కడ కలకలం రేపింది. యూఏఈ నుంచి ఇటీవలే కేరళ వచ్చిన ఇద్దరికి మంకీ పాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
వయనాడ్‌కు చెందిన వ్యక్తికి తొలుత మంకీపాక్స్ నిర్ధారణ కాగా తాజాగా కన్నూర్ జిల్లా వాసికి వైరస్ సోకినట్లు తేలింది.దీంతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు వైరస్ సోకిన వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు.ఇదిలాఉంటే కేరళలో ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ కొన్ని మంకీపాక్స్ కేసులు నమోదైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment