Shanghai Residents Told to Stay Inside as Lockdown Tightened - Sakshi
Sakshi News home page

షాంఘైలో కొత్త రకం కరోనా కల్లోలం.. ప్రజలు ఇళ్లకే పరిమితం!

Published Tue, Mar 29 2022 6:39 PM | Last Updated on Tue, Mar 29 2022 8:43 PM

Covid 19: Govt Impose Lockdown In Shanghai Bars Even No Walking Pets - Sakshi

ఇటీవలే కరోనా మహమ్మారి నుంచి బయటపడుతున్నామని ప్రపంచ దేశాలు ఊపరి పీల్చుకుంటున్నాయి. ఈ క్రమంలో కోవిడ్‌ పుట్టినిల్లైన చైనాలో తాజాగా కొత్త కరోనా వేరియంట్‌కి సంబంధించిన కేసులు అనుహ్యంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చైనా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ వైరస్‌ విజృంభణ చూస్తే ఇప్పడప్పుడే అదుపులోకి వచ్చే పరిస్థితి ఏ మాత్రం కనబడటం లేదు. చివరికి రోజువారీ కోవిడ్ కేసులు మంగళవారం రికార్డు స్థాయిలో 4,477కి పెరగడంతో షాంఘై నగరం తూర్పు భాగంలో నివసించే ప్రజలకు లాక్‌డౌన్ పరిమితులను విధించింది చైనా ప్రభుత్వం. 

ఆ ప్రాంత ప్రజలు కేవలం కోవిడ్ పరీక్ష కోసం మాత్రమే బయటకు రావాలని ఉత్తర్వులు జారీ చేసింది. షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్తో పాటు ఫైనాన్షియల్ సంస్థలకు పేరున్న పుడోంగ్ జిల్లాలో కోవిడ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో అక్కడి స్థానిక అధికారులు ఆ ప్రాంతంలో లాక్డౌన్ విధించారు. వైరస్‌ వ్యాప్తి అరికట్టేందుకు నివాసితులు బయటకు రావడం, బహిరంగ ప్రదేశాలలో తిరగడం నిషేధమని, షాంఘై మున్సిపల్ హెల్త్ కమిషన్ అధికారి తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. హాల్ వేస్, ఓపెన్ ఏరియాల్లు, రెసిడెన్షియల్ కాంపౌండ్స్లో కనీసం వాకింగ్ చేసేందుకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. గతంలో నివాసితులు తమ భవనాల లాబీలోకి వెళ్లి కూర్చునే అవకాశం ఉండేది. అలానే తమ పరిసర ప్రాంతాల్లో వైరస్‌ సోకిన వారు లేకపోతే ఆ ప్రాంతంలోనూ నిక్షేపంగా సంచరించే అవకాశం ఉండేది. అయితే కేసులు విపరీతంగా పెరిగేసరికి కేవలం ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ప్రజలను ఆదేశించింది.

చదవండి: ఉక్రెయిన్‌ మహిళపై రష్యా సైనికుల దురాగతం...ఆమె భర్తను చంపి, వివస్త్రను చేసి..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement