లైంగిక వేధింపుల ఆరోపణలు, కేసులపై రేవణ్ణ వ్యాఖ్య
బెంగళూరు/శివమొగ్గ: తనపై, తన కుమారుడు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులు, కేసులు అంతా రాజకీయ కుట్రలో భాగమని కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ వ్యా ఖ్యానించారు. సోమవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర కోణం ఉంది. ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటా. ఆరోపణల్లో నిజం ఉందని దర్యాప్తులో తేలితే ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధం. నాలుగైదేళ్లనాటి పాత అంశాలను పట్టుకుని ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.
సిట్ దర్యాప్తు చేశాక నిజాలు బయటికొస్తాయిగా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. వాళ్లనుకున్నదే చేస్తారు. ఇవన్నీ ఈనాటివి కాదు. కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా ఇది పెద్ద సెక్స్ కుంభకోణమే అయితే సిట్ ఏర్పాటుచేశారుగా. సమగ్ర దర్యాప్తు చేయనివ్వండి. సాధారణంగానే ప్రజ్వల్ విదేశాలకు వెళ్తాడు. ఇప్పుడూ అలాగే వెళ్లాడు. ఎఫ్‌ఐఆర్ వేస్తారనిగానీ, సిట్‌తో దర్యాప్తు చేయిస్తారనిగానీ ప్రజ్వల్‌కు తెలీదు. దర్యాప్తు అధికారులు ఆదేశించినప్పుడు ప్రజ్వల్ వచ్చి వారికి సహకరిస్తాడు’’ అని రేవణ్ణ చెప్పారు.
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్!
లైంగిక ఆరోపణల నేపథ్యంలో ప్రజ్వల్‌ను సస్పెండ్ చేయాలనే నిర్ణయానికొచ్చినట్లు జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సోమ వారం చెప్పారు. ‘‘ ప్రజ్వల్‌పై ఆరోపణలు నిజమైతే ఆయనకు శిక్ష పడాల్సిందే. వివాదంలో ప్రజ్వల్‌ను వెనకేసుకొచ్చే ప్రసక్తే లేదు. తప్పు అని తేలితే కఠినచర్యలు తీసు కోవాల్సిందేనని మా కుటుంబం మొత్తం కోరుకుంటోంది. ప్రజ్వల్ సస్పెన్షన్ నిర్ణయా న్ని మంగళవారం హుబ్బళిలో పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ప్రతిపాదిస్తాం. పార్ల మెంట్‌సభ్యుడు కాబట్టి నిర్ణయం ఢిల్లీ స్థాయి లో జరగాలి. ఈ విషయాన్ని జేడీఎస్ జాతీ య అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడకు వివరించా’’ అని కుమారస్వామి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment