![India Reported 7 231 New Covid Cases In Last 24 Hours - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/1/corona.jpg.webp?itok=lN8w3SrO)
న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,231 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోన కేసుల సంఖ్య 4,44,28,393కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. మొత్తం సుమారు 45 మరణాలు సంభవించాయని, దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 5 లక్షలకు చేరుకుందని వెల్లడించింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 0.15 శాతం ఉండగా, జాతీయ రికవరీ రేటు 98.67 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇదిలా ఉండగా ఢిల్లీలో సుమారు 377 క్తొత కేసులు నమోదయ్యాయని పేర్కొంది. అలాగే కరోనా సంబంధితన మరణాలు రెండు సంభవించాయని తెలిపింది. ప్రస్తుతం తాజగా అక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య 2.58 శాతంగా ఉందని పేర్కొంది.
(చదవండి: కరోనా అలర్ట్.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు)
Comments
Please login to add a commentAdd a comment