![North Korea Reported First Covid 19 Cases Kim Jong Order Lockdown - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/12/Untitled-15.jpg.webp?itok=1T9CBV5L)
ప్యాంగ్యాంగ్: కరోనా మహమ్మారి ప్రపంచ నలుమూలల వ్యాపించి వీర విహారం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో కూడా తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా పేర్కొంది. ఈ వార్త ప్రపంచ దేశాలకు కొంత ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. కానీ తాజాగా ఆ దేశంలో కూడా కరోనా కేసు నమోదు అయినట్టు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా మహమ్మారిని అడ్డుకుంటున్నట్లు ప్రకటించుకుంటూ వచ్చిన కిమ్ ప్రభుత్వం తాజాగా గురువారం( మే 11) నాడు తొలి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు ప్రకటించింది. రాజధాని ప్యోంగ్యాంగ్‌లో ప్రజలు జ్వరాలతో బాధపడుతుండగా, సదరు వ్యక్తుల నుంచి ఆదివారం నమూనాలు సేకరించారు.
గురువారం ఆ ఫలితాలు రావడంతో వారికి ఓమిక్రాన్ వేరియంట్‌తో సోకినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ వార్త తెలిసిన తక్షణమే ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ అధికారులతో సమావేశమయ్యారు. అందులో.. మహమ్మారి కట్టడికి కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. తమ భూభాగంలోకి కొవిడ్-19 ప్రవేశించకుండా అడ్డుకోగలిగామని ఉత్తర కొరియా ఇన్నాళ్లు గర్వంగా చెప్పుకుంటూ వచ్చిన చివరికి తలవంచాల్సి వచ్చింది. ఇటీవల చైనాలో వైరస్ కేసులు వెలుగు చూసిన వెంటనే అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసి.. వర్తకులు, పర్యాటకులను సైతం దేశంలోకి రాకుండా చేసింది. అయినప్పటికీ ఒమిక్రాన్ కొరియాలో ప్రవేశించింది.
చదవండి: China: చైనాలో మరో విమాన ప్రమాదం.. ఒక్కసారిగా మంటలు రావడంతో
Comments
Please login to add a commentAdd a comment