ఉత్తర కొరియాలో ఏ ఘటన అయినా హాట్ టాపిక్‌గానూ, సంచలనంగానూ ఉంటుంది. ఎందుకంటే ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ తీసుకునే నిర్ణయాలు చాలా విభిన్నంగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. దీంతో ఎప్పుడూ ఉత్తర కొరియా వార్తల్లో నిలుస్తుంటోంది. ఇప్పుడు తాజగా మరోసారి లాక్‌డౌన్ విషయమై వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్ సుమారు ఐదు రోజులు పూర్తి లాక్‌డౌన్‌లో ఉంది. కానీ కరోనా మహమ్మారీ గురించి మాత్రం కాదని తెగేసి చెబుతోంది.
తమ ప్రజలు శ్వాసకోస సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారని, అందుకు సంబంధించిన కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్ విధించామని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర కొరియా అధికారులు ఆదివారం వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతిరోజు శరీర ఉష్ణోగ్రతలు గురించి నివేదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఐతే అక్కడే ప్రజలు ఈ నోటీసులు రాకమునుపే ముందస్తుగా పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడం విశేషం.
ఉత్తరకొరియా ప్రజలకు జారీ చేసిన నోటీసుల్లో ప్రజల్లో చాలమంది తీవ్రమైన జలుబుతో కూడా బాధపడుతున్నట్టు సమాచారం. కానీ కోవిడ్ సంబంధించిన కేసుల గురించి మాత్రం గోప్యంగానే ఉంచుతోంది. గతేడాదే తొలిసారిగా ఉత్తర కొరియా కోవిడ్ కేసులు గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే ఆగస్టు నాటికే తాము కోవిడ్‌పై విజయం సాధించామని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించాడు. ఇదిలా ఉండగా, ఉత్తర కొరియాలోని శ్రామిక ప్రజలందరూ ఇప్పటికే స్వచ్ఛందంగా నిబంధనలను పాటిస్తున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
(చదవండి: విచిత్ర ఘటన: యజమానినే కాల్చి చంపిన కుక్క)
Comments
Please login to add a commentAdd a comment