భువనేశ్వర్: ఓ వైపు కేరళలో నిఫా వైరస్ భీతికొల్పుతుండగా.. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలవరపెడుతోంది. రోజురోజుకు స్క్రబ్ టైఫస్ కేసులు ఆ రాష్ట్రంలో పెరుగుతుండటం ప్రజలను ఆందోళన గురిచేస్తోంది. తాజాగా సుందర్‌గఢ్ జిల్లాలో 11 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్క్రబ్ టైఫస్ బారిన పడినవారి సంఖ్య 180కి చేరింది.
ప్రధానంగా సందర్‌గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేసులతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 180కి చేరిందని జిల్లా వైద్య అధికారి కన్హుచరణ్ నాయక్ తెలిపారు. స్క్రబ్ టైఫస్ సోకినవారు ప్రధానంగా సుందర్‌గఢ్, బాలిశంకర ప్రాంతాలకు చెందినవారని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుమానిత 50 షాంపిల్స్‌ను టెస్టుకు పంపించగా.. అందులో 11 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేశారు. మూడు రోజులకు మించి జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్‌ను అరికట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు వైద్య బృందాలను పంపించారు. కావాల్సినన్ని మందులు, వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆశా వర్కర్లు తిరుగుతూ జాగ్రత్తలు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: మాధవన్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందన
Comments
Please login to add a commentAdd a comment