Sundargarh district
-
ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్
భువనేశ్వర్: ఓ వైపు కేరళలో నిఫా వైరస్ భీతికొల్పుతుండగా.. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలవరపెడుతోంది. రోజురోజుకు స్క్రబ్ టైఫస్ కేసులు ఆ రాష్ట్రంలో పెరుగుతుండటం ప్రజలను ఆందోళన గురిచేస్తోంది. తాజాగా సుందర్‌గఢ్ జిల్లాలో 11 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్క్రబ్ టైఫస్ బారిన పడినవారి సంఖ్య 180కి చేరింది. ప్రధానంగా సందర్గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేసులతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 180కి చేరిందని జిల్లా వైద్య అధికారి కన్హుచరణ్ నాయక్ తెలిపారు. స్క్రబ్ టైఫస్ సోకినవారు ప్రధానంగా సుందర్‌గఢ్, బాలిశంకర ప్రాంతాలకు చెందినవారని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుమానిత 50 షాంపిల్స్‌ను టెస్టుకు పంపించగా.. అందులో 11 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేశారు. మూడు రోజులకు మించి జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్‌ను అరికట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు వైద్య బృందాలను పంపించారు. కావాల్సినన్ని మందులు, వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆశా వర్కర్లు తిరుగుతూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: మాధవన్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందన -
ఎమ్మెల్యే కనిపించడం లేదు.. ఫోన్ చేసినా కలవడం లేదు!
సాక్షి, భువనేశ్వర్: రౌర్కెలా నగరంలోని సెక్టారు-6 ప్రాంతంలోని పాఠశాలలు, క్లబ్‌లు, ఇళ్ల గోడలపై ఎమ్మెల్యే సుబ్రోత్ తొరై అదృశ్యమైనట్లు పోస్టర్లు కనిపించడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై ఆదివారం ఎమ్మెల్యేకి పలువురు ఫోన్‌చేసిన ఆయన ఫోన్ కలవకపోవడం గమనార్హం. మరోవైపు ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఆయన జాడ నియోజకవర్గంలో లేదని స్థానికులు చెబుతున్నారు. చదవండి: సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం.. ఆ ప్రశ్న క్షణాల్లో తొలగింపు! ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పర్యటించినప్పుడు సదరు ఎమ్మెల్యే సౌచాలయాలు, రహదారుల నిర్మాణం, తాగునీటి సదుపాయం వంటివి కల్పిస్తామన్న హామీ ఇచ్చారని, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జాడ లేదని నియోజకవర్గం ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆ పోస్టర్లకు స్పందించి నియోజకవర్గ సమస్యల పరిష్యారంపై స్పందిస్తే బాగుంటుందనిస్థానికులు ఆశిస్తున్నారు. చదవండి: కాశీ విశ్వనాథ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబడుతోంది: ప్రధాని మోదీ -
వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగులు
రూర్కెలా: ఓ వ్యక్తిని ఏనుగులు తొక్కి చంపిన ఘటన ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. కోయల్ నది పరివాహక ప్రాంతంలోని రియన్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హరి కెరకెట్టా(55) తన కుమారుడితో కలిసి మోటార్ సైకిల్ పై మార్కెట్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా వారికి ఏనుగుల గుంపు ఎదురైంది. బైక్ పై కూర్చున్న హరి కుమారుడు ఏనుగులను చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో హరి కిందపడిపోయాడు. ఏనుగులు అతడిని తొక్కి చంపాయని రూర్కెలా అటవీశాఖ అధికారి జితేంద్ర కుమార్ మొహంతి తెలిపారు. భయపడి పారిపోయే క్రమంలో బైకు మీద నుంచి హరి కిందపడిపోయి ఉంటాడని చెప్పారు. అతడికి కుటుంబానికి తక్షణమే రూ. 10 వేలు ఎక్స్ గ్రేసియా అందజేశామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయ్యాక నిబంధనలకు అనుగుణంగా పరిహారం అందజేస్తామని చెప్పారు.