
రౌర్కెలాలో గోడపై సుబ్రోత్ తొరై కనిపించడం లేదంటూ వెలిసిన పోస్టర్లు
సాక్షి, భువనేశ్వర్: రౌర్కెలా నగరంలోని సెక్టారు-6 ప్రాంతంలోని పాఠశాలలు, క్లబ్‌లు, ఇళ్ల గోడలపై ఎమ్మెల్యే సుబ్రోత్ తొరై అదృశ్యమైనట్లు పోస్టర్లు కనిపించడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై ఆదివారం ఎమ్మెల్యేకి పలువురు ఫోన్‌చేసిన ఆయన ఫోన్ కలవకపోవడం గమనార్హం. మరోవైపు ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి ఆయన జాడ నియోజకవర్గంలో లేదని స్థానికులు చెబుతున్నారు.
చదవండి: సోనియా గాంధీ తీవ్ర అభ్యంతరం.. ఆ ప్రశ్న క్షణాల్లో తొలగింపు!
ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పర్యటించినప్పుడు సదరు ఎమ్మెల్యే సౌచాలయాలు, రహదారుల నిర్మాణం, తాగునీటి సదుపాయం వంటివి కల్పిస్తామన్న హామీ ఇచ్చారని, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జాడ లేదని నియోజకవర్గం ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆ పోస్టర్లకు స్పందించి నియోజకవర్గ సమస్యల పరిష్యారంపై స్పందిస్తే బాగుంటుందనిస్థానికులు ఆశిస్తున్నారు.
చదవండి: కాశీ విశ్వనాథ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించబడుతోంది: ప్రధాని మోదీ