వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగులు | Man trampled to death by elephant herd | Sakshi
Sakshi News home page

వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగులు

Published Tue, Nov 17 2015 7:46 PM | Last Updated on Thu, Jul 11 2019 6:30 PM

వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగులు - Sakshi

వ్యక్తిని తొక్కి చంపిన ఏనుగులు

రూర్కెలా: ఓ వ్యక్తిని ఏనుగులు తొక్కి చంపిన ఘటన ఒడిశాలోని సుందర్ గఢ్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. కోయల్ నది పరివాహక ప్రాంతంలోని రియన్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హరి కెరకెట్టా(55) తన కుమారుడితో కలిసి మోటార్ సైకిల్ పై మార్కెట్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా వారికి ఏనుగుల గుంపు ఎదురైంది. బైక్ పై కూర్చున్న హరి కుమారుడు ఏనుగులను చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో హరి కిందపడిపోయాడు.

ఏనుగులు అతడిని తొక్కి చంపాయని రూర్కెలా అటవీశాఖ అధికారి జితేంద్ర కుమార్ మొహంతి తెలిపారు. భయపడి పారిపోయే క్రమంలో బైకు మీద నుంచి హరి కిందపడిపోయి ఉంటాడని చెప్పారు. అతడికి కుటుంబానికి తక్షణమే రూ. 10 వేలు ఎక్స్ గ్రేసియా అందజేశామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు పూర్తయ్యాక నిబంధనలకు అనుగుణంగా పరిహారం అందజేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement