scrub typhusin
-
పొరుగునే స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్! మన దగ్గరా అప్రమత్తత అవసరం!!
ఆంధ్రప్రదేశ్‌కు ΄పొరుగునే ఉన్న ఒడిశాలో కొంతకాలంగా ‘స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్వైరవిహారం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్కడ కనిపిస్తున్న ఈ కేసులు గత రెండు మూడు వారాలుగా ఒక్కసారిగా పెరిగాయి. ఇటీవల ఒక్క సుందర్ఘర్ జిల్లాలోనే దాదాపుగా 200కు పైగా కేసులు రావడంతో పాటు, కొన్ని మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలూ అప్రమత్తం కావాల్సిన అవసరమున్న ఈ తరుణంలో స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్పై అవగాహన కోసం ఈ కథనం. స్క్రబ్ టైఫస్’ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను ‘బుష్ టైఫస్’ అని కూడా అంటారు. ఈ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియమ్ పేరు ‘ఓరియెంటియా సుసుగాముషి’. ఇది చిమ్మటలా కనిపించే చిగ్గర్ అనే ఒక రకం కీటకం ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ‘ఓరియెంటియా సుసుగాముషి’ అనే బ్యాక్టీరియమ్ దేహంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకసారి చిగ్గర్ కుట్టాక... బ్యాక్టీరియమ్ బాధితుల రక్తంలోకి చేరితే... దాదాపు పది రోజుల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. చాలావరకు లక్షణాలు నిర΄ాయకరంగా ఉండవచ్చు. కానీ మొదటివారంలో దీన్ని గుర్తించకపోవడం లేదా సరైన చికిత్స ఇవ్వకపోవడం జరిగితే రెండోవారం నుంచి కొన్ని దుష్ప్రభావాలు వస్తాయి. ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె, కొన్ని సందర్భాల్లో మెదడు కూడా ప్రభావితమై మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. నిర్ధారణ ఈ వ్యాధి నిర్ధారణకు చాలా పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు వెయిల్ ఫెలిక్స్ పరీక్ష, ఇన్‌డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరోసెంట్ యాంటీబాడీ (ఐఎఫ్ఏ) పరీక్ష, ఇన్‌డైరెక్ట్ ఇమ్యూనో పెరాక్సైడేజ్ (ఐపీపీ) పరీక్ష, ఎలీజా, ఇమ్యూనో క్రొమాటోగ్రాఫిక్ టెస్ట్ (ఐసీటీ), పీసీఆర్ పరీక్షల ద్వారా దీన్ని నివారణ చేయవచ్చు. అయితే చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలో కూడా దాదాపుగా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో తగిన మోతాదులో యాంటీబయాటిక్ చికిత్స చేసి, బాధితుల పరిస్థితిని నార్మల్ చేయవచ్చు. అందుకే అన్నన్ని ఖరీదైన పరీక్షలకు బదులు కాస్తంత అనుభవజ్ఞులైన డాక్టర్లు కొన్ని లక్షణాల ఆధారంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ను గుర్తిస్తారు. ఉదాహరణకు మలేరియాలో ప్రోటోజోవన్ పారసైట్ రకాన్ని బట్టి కొన్ని రోజుల వ్యవధిలో జ్వరం మాటిమాటికీ వస్తుంటుంది. అదే వైరల్ జ్వరాలు చాలా తీవ్రంగా, ఎక్కువ ఉష్ణోగ్రతతో వస్తుంటాయి. ఈ లక్షణాలను బట్టి ఆయా జ్వరాలను గుర్తుబట్టి చికిత్స అందిస్తారు. దీనికి జ్వరం వచ్చిన తొలిదశలోనే సింపుల్‌గా ఇచ్చే యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే చాలు. ఒకవేళ చికిత్స అందించకపోతే కొన్నిసార్లు ఇది లంగ్స్, గుండె, నాడీ వ్యవస్థ, జీర్ణవ్యవస్థతోపాటు కిడ్నీలపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. నివారణ దీనికి టీకా ఏదీ అందుబాటులో లేదు. చిగ్గర్ కీటకాల కాటుకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఇవి పొలాల్లో, మట్టిలో నివసిస్తూ, అక్కడే గుడ్లు పెడతాయి. కాబట్టి చేలూ, పొలాల్లో నడిచే సమయాల్లో చెప్పులు వాడటం వంటి జాగ్రత్తలతో దీన్ని చాలావరకు నివారించవచ్చు. ఫుల్ స్లీవ్ దుస్తులు, కాళ్లు పూర్తిగా కప్పేలాంటి దుస్తులు ధరించడం మేలు. ట్రెకింగ్ వంటి సాహసక్రీడల్లో పాల్గొనేవారు చిగ్గర్స్ ఉండే ప్రాంతాల్లోనే నడిచే అవకాశాలు ఎక్కువ. అందుకే... ట్రెక్కింగ్ చేసేవారు ఇప్పుడీ వ్యాధి విస్తరిస్తున్న ప్రాంతాలకు కొన్నాళ్లు ట్రెక్కింగ్‌కు వెళ్లకవడమే మంచిది. చికిత్స కొన్ని అరుదైన సందర్భాల్లో (అంటే కాంప్లికేషన్ వచ్చిన కేసుల్లో) మినహా... టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ మందులతోనే ఇది అదుపులోకి వస్తుంది. కీమోప్రోఫిలాక్టిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే... అది కొంతవరకు దీని నివారణకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇప్పుడు మన రాష్ట్రాల నుంచి ఒడిశా వెళ్లాల్సినవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కిమో ప్రోఫిలాక్టిక్ తీసుకోవడం కొంత మేలు చేస్తుందని చెప్పవచ్చు. డా.. శివరాజు, సీనియర్ ఫిజీషియన్ (చదవండి: డీజే మ్యూజిక్ వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా?) -
ఒడిశాలో 180 మందికి స్క్రబ్ టైఫస్
భువనేశ్వర్: కేరళలో నిఫా వైరస్ మాదిరిగానే ఒడిశాలో స్క్రబ్ టైఫస్ ప్రజలను వణికిస్తోంది. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య ఆదివారానికి 180కి చేరుకుంది. ఇప్పటివరకు సేకరించి పంపిన 59 శాంపిళ్లలో 11 స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా వెల్లడైనట్లు ఆరోగ్య శాఖాధికారులు వెల్లడించారు. మొత్తం 180 మంది బాధితుల్లో ఇతర రాష్ట్రాల వారు 10 మంది ఉన్నారన్నారు. సుందర్‌గఢ్, బర్గఢ్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయని అన్నారు. ఈ వ్యాధితో రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. ఒక రకమైన లార్వా పురుగులు కుట్టడం వల్ల ఇది సోకుతుంది. పొలాలు, అటవీ ప్రాంతాలకు దగ్గర్లోని వారు తొందరగా ఈ వ్యాధికి గురవుతారు. జ్వరం, పురుగు కుట్టిన చోట చర్మంపై ఎశ్చర్ అనే నల్ల మచ్చ ఏర్పడటం దీని లక్షణాలు. -
ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్
భువనేశ్వర్: ఓ వైపు కేరళలో నిఫా వైరస్ భీతికొల్పుతుండగా.. ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలవరపెడుతోంది. రోజురోజుకు స్క్రబ్ టైఫస్ కేసులు ఆ రాష్ట్రంలో పెరుగుతుండటం ప్రజలను ఆందోళన గురిచేస్తోంది. తాజాగా సుందర్‌గఢ్ జిల్లాలో 11 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో స్క్రబ్ టైఫస్ బారిన పడినవారి సంఖ్య 180కి చేరింది. ప్రధానంగా సందర్గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేసులతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 180కి చేరిందని జిల్లా వైద్య అధికారి కన్హుచరణ్ నాయక్ తెలిపారు. స్క్రబ్ టైఫస్ సోకినవారు ప్రధానంగా సుందర్‌గఢ్, బాలిశంకర ప్రాంతాలకు చెందినవారని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుమానిత 50 షాంపిల్స్‌ను టెస్టుకు పంపించగా.. అందులో 11 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేశారు. మూడు రోజులకు మించి జ్వరం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్‌ను అరికట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు వైద్య బృందాలను పంపించారు. కావాల్సినన్ని మందులు, వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. గ్రామాల్లో ఆశా వర్కర్లు తిరుగుతూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇదీ చదవండి: మాధవన్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందన -
స్క్రబ్ టైఫస్...టెర్రర్
స్క్రబ్ టైఫస్ వ్యాధి పేరు ఉంటేనే టెర్రర్ పుడుతోంది. మూడేళ్లుగా జిల్లాలో ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది. మలేరియా, డెంగీ వంటి దోమకాటు జ్వరాలతో పాటు తాజాతా టైఫస్ జ్వరాలు ప్రజలను భయభ్రాంతులకు గురిజేస్తున్నాయి. ఈ తరహా జ్వరాల బారిన పడిన రోగులు జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి సైతం నగరానికి వచ్చి పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకమేనని వైద్యులు చెబుతున్నారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు) : జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వర లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు రావడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది తోట్లవల్లూరు మండలం బొడ్డపాడులో జ్వరాలు విజృంభించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, పలువురికి స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించాయి. ఈ ఏడాది కూడా ఈ తరహా జ్వరంతో కొందరు పలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారని సమాచారం. అంతటి ప్రమాదకరమైన వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సైతం పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. జిల్లాలో సోకుతున్న ఈ వ్యాధిపై ప్రభుత్వ వైద్యులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరంలా కనిపించే స్క్రబ్ టైఫస్‌ను సకాలంలో గుర్తించకుంటే ప్రాణాలు సైతం కోల్పోతారని అంటున్నారు. తొలుత అకస్మిక జ్వరంతో ప్రారంభమై క్రమేణా లివర్, కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపడంతో పాటు, రక్తనాళాలు దెబ్బతినడం, తెల్లరక్తకణాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. వ్యాధి ఎలా సోకుతుందంటే... దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివశించే వారికి ఎక్కువుగా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. చెట్లు, పొలాల్లో ఉండే ‘త్సుట్సుగామూషి ’ అనే కీటకం కుట్టడం ద్వారా జ్వరం వస్తుంది. ఈ కీటకాల్లో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కొందరికి వారం రోజుల వ్యవధిలో వ్యాధి సోకుతుందని, మరికొందరిలో కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పారు. త్సుట్సుగామూషి కీటకం కుట్టిన వారిలో జ్వరం అకస్మాత్తుగా రావడం, తీవ్రమైన తలనొప్పి, చలి, కండరాల నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. కళ్లు తిరగడం, మగత, వాంతులు కూడా అవుతుంటాయి. ఇలాంటి వారి శరీరంపై పరిశీలిస్తే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. ఈ వ్యాధిని నిర్దారించేందుకు ఎలిసా పరీక్షలు సైతం నగరంలో అందుబాటులో ఉన్నాయి. వ్యాధి ప్రభావం.... స్క్రబ్ టైఫస్ సోకిన వారిలో అధిక జ్వరంతో పాటు, న్యూమోనైటీస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యుట్ రెస్పిరేటరీ డిస్ట్సెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతుంటారు. అంతేకాకుండా కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం, హృదయ కండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం , తెల్లరక్తకణాలు తగ్గిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాలేయం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకోవచ్చు. వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యం పొందడం ద్వారా ఎలాంటి ప్రభావం చూపకుండా బయటపడొచ్చు. ఎవరికి ప్రమాదకరం.... స్క్రబ్ టైఫస్ వ్యాధి, మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారికి సోకితే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా హెచ్ఐవీ రోగులకు సోకితే ప్రాణాంతకమే. చిన్న పిల్లలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాధి సోకితే ప్రమాదకరంగా మారుతుంది. స్క్రబ్ టైఫస్ కేసులు వస్తున్నాయి స్క్రబ్ టైఫస్ వ్యాధికి గురైన వారు మూడేళ్లుగా తమ ఆస్పత్రికి వస్తున్నారు. గత ఏడాది కూడా ఇద్దరు చిన్నారులకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది. వ్యాధిని నిర్ధారించేందుకు ఎలీసా పరీక్ష„ý అందుబాటులో ఉంది. స్క్రబ్ టైఫస్ వచ్చిన వారికి కచ్చితమైన యాంటిబయోటిక్ ఇవ్వడం ద్వారా నివారించవచ్చు. వ్యాధిని ఆశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై ప్రభావం చూపి, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ వ్యాది వచ్చిన వారి శరీరంపై నల్లటి మచ్చలు ఉండటాన్ని గుర్తించవచ్చు.డాక్టర్ పాతూరి వెంకట రామారావు,పీడియాట్రిక్ చీఫ్, ఆంధ్రా హాస్పిటల్స్ -
‘ప్రకాశం’లో కొత్తరకం జ్వరం, మహిళ మృతి
స్కబ్టైఫస్తో మహిళ మృతి కందుకూరు, న్యూస్‌లైన్ : ప్రకాశం జిల్లా సింగరాయకొండలో స్క్రబ్ టైఫస్ అనే కొత్తరకం జ్వరంతో మహిళ మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. సింగరాయకొండకు చెందిన ఒక మహిళ అస్వస్థతకు గురై గత శనివారం కందుకూరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. ఆమెకు స్క్రబ్‌టైఫస్ (రికెట్సియల్) అనే కొత్తరకం జ్వరం సోకినట్లు నిర్ధారించి ఒంగోలు వెళ్లాలని డాక్టర్ ఖాదర్‌బాషా సూచించారు. ఒంగోలులో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. తమిళనాడు, కేరళ, జమ్మూకాశ్మీర్, ిహ మాచల్‌ప్రదేశ్, అసోం, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ జ్వరం అధికంగా ఉంటుందని ఆయన చెప్పారు. పేడపురుగును పోలి ఉండే టిక్స్మైట్ అనే పురుగు కుట్టడంవల్ల ఈ జ్వరం వస్తుందని తెలిపారు. ఆ పురుగు కుట్టిన ప్రాంతంలో ఎర్రగా కమిలి మధ్యలో నల్లగా కనిపిస్తుందని చెప్పారు. ఈ జ్వరం డెంగీకన్నా ప్రమాదకరమన్నారు. లక్షణాలు.. : ముందుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం ఉంటాయి. వ్యాధి ముదిరితే కామెర్లు, ఫిట్స్, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.