లోకేష్‌కు శాపంగా మారనున్న రెడ్‌బుక్‌: అంబటి రాంబాబు | Ysrcp Leader Ambati Rambabu Comments On Social Media Activists Cases | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తల అరెస్టులేవి?: అంబటి రాంబాబు

Published Mon, Nov 25 2024 12:42 PM | Last Updated on Mon, Nov 25 2024 3:07 PM

Ysrcp Leader Ambati Rambabu Comments On Social Media Activists Cases

సాక్షి,గుంటూరు: సోషల్‌మీడియాలో పోస్టులపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులో సోమవారం(నవంబర్‌ 25)అంబటి మీడియాతో మాట్లాడారు.

‘వైఎస్సార్‌సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పెద్ద ఎత్తున అరెస్టు చేస్తున్నారు. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడితే టీడీపీ వాళ్లను కూడా అరెస్ట్ చేస్తామని చంద్రబాబు నీతి వ్యాక్యాలు చెప్పారు.అయితే వైఎస్సార్‌సీపీ నేతలపై అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం లేవు.

ఇప్పటికే ఈ నెల 17,18,19 తేదీల్లో వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మా కుటుంబ సభ్యులపైన టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశాం.నిన్న అన్ని పీఎస్‌లకు వెళ్ళి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించాం. స్పష్టమైన సమాధానం మాకు రాలేదు. ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న వ్యక్తి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ కూడా వైఎస్ జగన్‌పై అసభ్యకరమైన పోస్టు పెట్టారు. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం. స్పీకరైనా,మంత్రైనా చట్టం దృష్టిలో ఒకటే. ఇది అంతం కాదు ఆరంభమే. జమిలి ఎన్నికలొస్తాయన్న ప్రచారం జరుగుతోంది.

డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైన కూడా కేసులు పెట్టారు. పోసాని మురళీకృష్ణ వైఎస్ జగన్‌ అభిమాని. ఆయనపై కేసులు పెట్టి భయపెట్టొచ్చేమో కానీ వైఎస్‌ జగన్‌పై ఆయనకున్న ప్రేమను మాత్రం తొలగించలేరు. రెడ్‌బుక్‌ లోకేష్ రాశాడు. రెడ్‌బుక్‌ లోకేష్‌కు శాపంగా మారుతోంది. రెడ్‌బుక్‌ రచయితగా లోకేష్ చరిత్రలో నిలిచిపోతాడు’అని అంబటి ఎద్దేవా చేశారు.

Ambati: సోషల్ మీడియా కార్యకర్తలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement