ఢిల్లీ: దేశ రాజధానిలో డెంగ్యూ విజృంభిస్తోంది. ఒక్క జులై నెలలోనే దాదాపు 121 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఎడతెరిపిన లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇటీవల వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ వరదల కారణంగానే డెంగ్యూ వ్యాపిస్తోందని వైద్యులు తెలిపారు. ఆగష్టు నెలలో డెంగ్యూతో పాటు మలేరియా, చికన్ గున్యా వంటి ఇతర వ్యాధులు కూడా విజృంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది ఆరంభం నుంచి జులై వరకు మొత్తం 243 డెంగ్యూ కేసులు నమోదైతే.. ఒక్క జులై నెలలోనే దాదాపు సగంపైనే కేసులు నమోదయ్యాయని వైద్యులు తెలిపారు. ఇటీవల నగరంలో 72 మలేరియా కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. జులై చివరి వారంలోనే 34 కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. జినోమ్ సీక్వెన్సింగ్‌కి 20 షాంపిల్స్ పంపించగా.. అందులో 19 కేసులు టైప్ 2 డెంగ్యూగా నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు.
డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 3 నుంచి 5 రోజుల వరకు జ్వరం తగ్గకపోవడం, శరీరంపై ఎర్రని చారలు, ప్లేట్‌లెట్స్ తగ్గడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వెన్ను నొప్పులు ఉంటాయని వైద్యులు సూచించారు. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. రానున్న వర్షాకాలం కావునా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి: విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం..
Comments
Please login to add a commentAdd a comment