బీజింగ్ : భారత్‌లో తయారయ్యే ఆప్టికల్ ఫైబర్‌పై యాంటీ డంపింగ్ టారిఫ్‌ను చైనా పొడిగించినట్టు విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఈ సుంకాలు మరో ఐదేళ్ల పాటు అమల్లో ఉంటాయి. భారత్‌లో ఉత్పత్తయ్యే ఆప్టికల్ ఫైబర్‌పై ఆగస్ట్ 14 నుంచి ఐదేళ్ల పాటు యాంటీ డంపింగ్ డ్యూటీలు వర్తిస్తాయని బీజింగ్ పేర్కొంది. ఈ ప్రకటనలో పలు భారతీయ కంపెనీల పేర్లను డ్రాగన్ ప్రస్తావించింది. భారత తయారీదారులకు అనుగుణంగా ఈ సుంకాలు 7.4 శాతం నుంచి 30.6 శాతం దాకా ఉంటాయని చైనా పేర్కొంది.
ఇండో-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో యాంటీ డంపింగ్ డ్యూటీల పొడిగింపుపై డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. యాంటీ డంపింగ్ సుంకాలను తొలగిస్తే చైనా పరిశ్రమలకు కలిగే నష్టాన్ని అంచనా వేసి విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. చైనా, మలేషియా, తైవాన్‌ల నుంచి బ్లాక్‌టోనర్ దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ విధించాలని భారత్ ప్రతిపాదించిన నేపథ్యంలో చైనా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23న చైనా, దక్షిణ కొరియా, వియత్నాం నుంచి దిగుమతయ్యే కొన్ని ఉక్కు ఉత్పత్తుల దిగమతులపైనా భారత్ యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది. చదవండి : చైనా కంపెనీల మనీలాండరింగ్ రాకెట్
Comments
Please login to add a commentAdd a comment