- టీబీజీకేఎస్ ఉత్తర
- ప్రత్యుత్తరాలు ఆయన ద్వారానే
- ‘గుర్తింపు’ ఎన్నికలయ్యేవరకూ పాత కమిటీల కొనసాగింపు
సర్వాధికారాలు వెంకట్రావుకే..!
Published Sat, Aug 20 2016 11:45 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
గోదావరిఖని : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)కు నూతనంగా అధ్యక్షుడిగా నియమితులైన బి.వెంకట్రావుకే సర్వాధికారాలను కట్టబెట్టారు. సింగరేణి యాజమాన్యంతో యూనియన్ పరంగా జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆయన ద్వారానే జరపాలని శనివారం టీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణ యం తీసుకున్నట్టు సమాచారం. అయితే యూనియన్ బైలాస్ ప్రకారం ప్రధాన కార్యదర్శికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే(లెటర్ కరస్పాండింగ్ అథారిటీ) అవకాశం ఉంది. గతంలోనూ ప్రధాన కార్యదర్శులుగా చేసిన వారే ఆ పనిని కొనసాగించారు. తాజాగా ప్రకటించిన కొత్త కమిటీలో వెంకట్రావును అధ్యక్షుడిగా, కెంగెర్ల మల్లయ్యను ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పటికీ వెంకట్రావుకే అధికారాలను కట్టబెట్టినట్టు తెలిసింది. తాజా పరిస్థితు ల నేపథ్యంలో త్వరలో జరిగే గుర్తింపు సం ఘం ఎన్నికల వరకూ యూనియన్ పాత కమిటీలు యథాతథంగా ఉండనున్నాయి. ఎన్నిక ల సమయంలో డివిజన్ల ఉపాధ్యక్షులను మార్చితే ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించిన అధిష్టానం మార్పులు చేయవద్దని సూచించినట్టు సమాచారం.
‘మిర్యాల’కు సముచిత స్థానం ?
ఇటీవలి వరకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగి న మిర్యాల రాజిరెడ్డికి నూతన కమిటీలో స్థానం కల్పించకపోవడంపై ఆయన కినుక వహించారు. అయితే త్వరలోనే తిరిగి సముచి త స్థానం కల్పించేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రాజ స్థాన్ రాష్ట్రం జైపూర్‌లో కాన్ఫరెన్స్‌కు వెళ్లిన యూనియన్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత ఈనెల 24న తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాతనే ఈ విషయమై నిర్ణయం తీసుకుం టారని సమాచారం.
Advertisement