recognizetion
-
సర్వాధికారాలు వెంకట్రావుకే..!
టీబీజీకేఎస్ ఉత్తర ప్రత్యుత్తరాలు ఆయన ద్వారానే ‘గుర్తింపు’ ఎన్నికలయ్యేవరకూ పాత కమిటీల కొనసాగింపు గోదావరిఖని : తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)కు నూతనంగా అధ్యక్షుడిగా నియమితులైన బి.వెంకట్రావుకే సర్వాధికారాలను కట్టబెట్టారు. సింగరేణి యాజమాన్యంతో యూనియన్ పరంగా జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆయన ద్వారానే జరపాలని శనివారం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణ యం తీసుకున్నట్టు సమాచారం. అయితే యూనియన్ బైలాస్ ప్రకారం ప్రధాన కార్యదర్శికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే(లెటర్ కరస్పాండింగ్ అథారిటీ) అవకాశం ఉంది. గతంలోనూ ప్రధాన కార్యదర్శులుగా చేసిన వారే ఆ పనిని కొనసాగించారు. తాజాగా ప్రకటించిన కొత్త కమిటీలో వెంకట్రావును అధ్యక్షుడిగా, కెంగెర్ల మల్లయ్యను ప్రధాన కార్యదర్శిగా నియమించినప్పటికీ వెంకట్రావుకే అధికారాలను కట్టబెట్టినట్టు తెలిసింది. తాజా పరిస్థితు ల నేపథ్యంలో త్వరలో జరిగే గుర్తింపు సం ఘం ఎన్నికల వరకూ యూనియన్ పాత కమిటీలు యథాతథంగా ఉండనున్నాయి. ఎన్నిక ల సమయంలో డివిజన్ల ఉపాధ్యక్షులను మార్చితే ప్రతికూల ప్రభావం చూపుతుందని భావించిన అధిష్టానం మార్పులు చేయవద్దని సూచించినట్టు సమాచారం. ‘మిర్యాల’కు సముచిత స్థానం ? ఇటీవలి వరకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగి న మిర్యాల రాజిరెడ్డికి నూతన కమిటీలో స్థానం కల్పించకపోవడంపై ఆయన కినుక వహించారు. అయితే త్వరలోనే తిరిగి సముచి త స్థానం కల్పించేలా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. ప్రస్తుతం రాజ స్థాన్ రాష్ట్రం జైపూర్‌లో కాన్ఫరెన్స్‌కు వెళ్లిన యూనియన్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత ఈనెల 24న తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాతనే ఈ విషయమై నిర్ణయం తీసుకుం టారని సమాచారం. -
ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్
జ్యోతినగర్ : ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. ప్రస్తుత గుర్తింపు యూనియన్ కాలపరిమితి గత సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసింది. అయినా గుర్తింపు ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. ఎన్నికల నిర్వహణకు ఆలస్యం కావడంతో వివిధ యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్మిక శాఖ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ క్రమంలో కేంద్ర కార్మిక శాఖ డెప్యూటీ చీఫ్ లేబర్‡ కమిషనర్ ఎన్నికల విషయంలో స్థానిక యాజమాన్యానికి లేఖ రాశారు. అన్ని యూనియన్లు, యాజమాన్య ప్రతినిధులతో ఎన్నికల తేదీ ఖరారుపై సమావేశం కూడా నిర్వహించారు. రామగుండం ఎన్టీపీసీ సంస్థ విస్తరణ నేపథ్యంలో వీఐపీల తాకిడి ఉంటుందని కొంత వ్యవధి కావాలని యాజమాన్యం కార్మిక శాఖ అధికారిని కోరింది. ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఎన్నికల సరళిని మార్పు చేసేందుకు కార్పొరేట్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని అన్ని ఎన్టీపీసీ సంస్థలలో ఒకేసారి గుర్తింపు సంఘాల ఎన్నికలు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. మెజారిటీ సాధించిన యూనియన్‌తోపాటు రెండో స్థానంలో ఉన్న యూనియన్‌కు ప్రాతినిధ్యం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన అపెక్స్ సమావేశంలో కొన్ని జాతీయ కార్మిక సంఘాల నాయకులు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈమేరకు జూన్–19న ఎన్బీసీ సమావేశంలో యూనియన్ ఎన్నికలపై అన్ని జాతీయ సంఘాలు ఏకాభిప్రాయానికి వచ్చి సంతకాలు చేశారు. దీంతో రామగుండం ఎన్టీపీసీ సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ కార్పొరేట్ సెంటర్ న్యూఢిల్లీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.