సాక్షి, కోల్‌కతా : అమెరికన్ యాపిల్స్ దేశీయ మార్కెట్లో రుచులను పంచబోతున్నాయి. భారత్ మార్కెట్‌లో తొలిసారిగా అమెరికాలోని వెనాచీ నుంచి ఆర్గానిక్ యాపిల్స్‌ను ప్రవేశపెట్టామని పండ్ల దిగుమతి సంస్థ ఐజీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. దేశంలో సహజమైన పండ్లు, కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విదేశీ సంస్థ స్టెమిల్ట్ గ్రోయర్స్‌తో ఒప్పందం ద్వారా ఆర్గానిక్ యాపిల్స్‌ను దిగుమతి చేస్తున్నామని తెలిపింది.
ఆరోగ్య స్పృహ పెరుగుతున్న క్రమంలో సహజమైన తాజా యాపిల్స్‌ను ప్రజలకు అందించే ఉద్దేశంతో అమెరికా నుంచి ఆర్గానిక్ యాపిల్స్‌ను తొలిసారిగా భారత మార్కెట్‌కు పరిచయం చేస్తున్నామని ఐజీ ఇంటర్నేషనల్ తెలిపింది. దేశంలో పండ్లను ఇష్టంగా తినే వారిలో ఆర్గానిక్ పండ్లపై ఆసక్తి కనబరుస్తారని పేర్కొంది. భారత్‌లో అరటి పండ్ల తర్వాత అత్యధికంగా యాపిల్స్‌ను ఎక్కువగా వాడతారు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల పైగా యాపిల్స్ వినియోగం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment