Organic fruits
-
క్రమంగా సేంద్రియ సాగుబాట పడుతున్న రైతన్నలు
-
బెస్ట్ స్టూడెంట్.. జామకాయలు అమ్ముతూ..
సాక్షి, సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): ఆమె ఉన్నతమైన కుటుంబంలో పుట్టింది. నీట్లో మంచి ర్యాంక్ సాధించింది. అయినా... తమ తోటలో పండే ఆర్గానిక్ జామకాయలను విక్రయిస్తూ ఆదర్శంగా నిలిచింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మాచర్ల రామన్న బర్కత్‌పురలో నివాసముంటున్నారు. ఈయన కూతురు అశ్రిత. తల్లి టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు లేదు అయినప్పటికి అశ్రిత ఏ విధమైన బిడియం లేకుండా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యపార్కు ముందు ఆర్గానిక్ జామకాయలు విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తుంది. అశ్రిత ఇటీవల వెలుపడ్డ నీట్ పరీక్షా ఫలితాల్లో 843వ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకుంది. ఎటువంటి బిడియం లేకుండా పార్కుల ముందు తమతోటలో కాసే జామకాయలను విక్రయిస్తూ మన్నన పొందుతోంది. రోజూ ఏదో ఒక పార్కు ముందు జామకాయలను విక్రయిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అశ్రితకు ప్రత్యేకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. చదవండి: నీట్ స్టేట్ ర్యాంకులు విడుదల -
దేశీ మార్కెట్లో అమెరికన్ ఆర్గానిక్ యాపిల్స్
సాక్షి, కోల్‌కతా : అమెరికన్ యాపిల్స్ దేశీయ మార్కెట్లో రుచులను పంచబోతున్నాయి. భారత్ మార్కెట్లో తొలిసారిగా అమెరికాలోని వెనాచీ నుంచి ఆర్గానిక్ యాపిల్స్‌ను ప్రవేశపెట్టామని పండ్ల దిగుమతి సంస్థ ఐజీ ఇంటర్నేషనల్ వెల్లడించింది. దేశంలో సహజమైన పండ్లు, కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విదేశీ సంస్థ స్టెమిల్ట్ గ్రోయర్స్తో ఒప్పందం ద్వారా ఆర్గానిక్ యాపిల్స్‌ను దిగుమతి చేస్తున్నామని తెలిపింది. ఆరోగ్య స్పృహ పెరుగుతున్న క్రమంలో సహజమైన తాజా యాపిల్స్‌ను ప్రజలకు అందించే ఉద్దేశంతో అమెరికా నుంచి ఆర్గానిక్ యాపిల్స్‌ను తొలిసారిగా భారత మార్కెట్‌కు పరిచయం చేస్తున్నామని ఐజీ ఇంటర్నేషనల్ తెలిపింది. దేశంలో పండ్లను ఇష్టంగా తినే వారిలో ఆర్గానిక్ పండ్లపై ఆసక్తి కనబరుస్తారని పేర్కొంది. భారత్‌లో అరటి పండ్ల తర్వాత అత్యధికంగా యాపిల్స్‌ను ఎక్కువగా వాడతారు. దేశంలో ఏటా 20 లక్షల టన్నుల పైగా యాపిల్స్ వినియోగం జరుగుతుంది. -
బ్రాండ్ తెలంగాణ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక బ్రాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా సేంద్రియ పండ్లు, కూరగాయలు, అల్లం, కల్తీలేని కారం, పసుపు తదితరాలను ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ (టీహెచ్‌డీసీ)ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అధికారులు త్వరలో ఈ కార్పొరేషన్‌కు సంబంధించి విధివిధానాలు ఖరారు చేసి ఫైలును సీఎం ఆమోదానికి పంపించనున్నారు. ఈ బాధ్యతను ఆయిల్‌ఫెడ్ ఎండీ ఎ.మురళికి అప్పగించారు. ఉద్యానశాఖ చేసిన ప్రతిపాదనల ప్రకారం 2016-17 ఏడాదిలో కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ. 250 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. ఈ కార్పొరేషన్ ద్వారా రైతులు పండించిన పండ్లు, కూరగాయలు, కారం, అల్లం, పసుపు సహా ఇతర పదార్థాలను సేకరించేందుకు మండలాల్లో రూ.100 కోట్లతో కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. మరో రూ. 100 కోట్లతో మెదక్ జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం గ్రామంలో ఫుడ్ పార్కును, ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. సేంద్రియ పద్ధతిలో పండించిన మేలురకం పండ్లు, కూరగాయలు సహా ఇతర ఆహార ఉత్పత్తులను విక్రయిస్తారు. ఈ విక్రయ కేంద్రాల్లో విజయ నూనె, పాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచే అంశం కూడా సర్కారు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. కార్పొరేషన్ చైర్మన్‌గా సీఎం! కొత్తగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించాలని ఉద్యానశాఖ ప్రతిపాదించింది. వైస్ చైర్మన్‌గా వ్యవసాయశాఖ మంత్రి వ్యవహరిస్తారు. వీరితోపాటు మరో 9 మంది డెరైక్టర్లు ఉంటారు. సేంద్రియ పద్ధతిలో రైతులు పండించే కూరగాయలు, పండ్లు, అల్లం, కారం, ఇతర సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్, రవాణా, ప్రాసెసింగ్, అదనపు ఉత్పత్తుల బాధ్యతను కార్పొరేషన్ తీసుకుంటుంది. కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, రాష్ట్ర అవసరాలకు పోను దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతులు చేసే లక్ష్యంతో కార్పొరేషన్ పనిచేస్తుంది.