పసిడికి ఏమైంది?? వెండి వెలుగులు | Gold imports fall 17pc in April October to usd 24 billion | Sakshi
Sakshi News home page

పసిడికి ఏమైంది?? వెండి వెలుగులు

Published Tue, Nov 29 2022 12:33 PM | Last Updated on Tue, Nov 29 2022 12:38 PM

Gold imports fall 17pc in April October to usd 24 billion - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (2022-23, ఏప్రిల్‌-అక్టోబర్‌) 17.38 శాతం తగ్గి 24 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో ఈ విలువ 29 బిలియన్‌ డాలర్లు. దేశీయంగా డిమాండ్‌ తగ్గడం దీనికి కారణం.  ఒక్క అక్టోబర్‌ నెలను తీసుకున్నా, దిగు­మతులు 27.47 శాతం పడిపోయి 3.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్‌ దాదాపు వార్షి­కం 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. కాగా, దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్‌-అక్టో­బర్‌ మధ్య 1.81 శాతం పెరిగి 24 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. జనవరి నుంచి ఎగుమతు­లు మరింత ఊపందుకుంటాని పరిశ్రమ భావిస్తోంది.  

వెండి దిగుమతులు అప్‌... 
ఇక వెండి దిగుమతులు  అక్టోబర్‌లో 34.80 శాతం తగ్గి 585 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యితే, ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో మాత్రం భారీగా పెరిగాయి. 2021-22 ఏడు నెలల్లో ఈ విలువ 1.52 బిలియన్‌ డాలర్లయితే, తాజా సమీక్షా నెల్లో ఈ విలువ ఏకంగా 4.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. పసిడి, వెండి దిగుమతుల విలువ కలిపిచూస్తే, కరెంట్‌ అకౌంట్‌కు దాదాపు మిశ్రమ ఫలితంగానే ఉండడం గమనార్హం. దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం లెక్కలను ‘కరెంట్‌ అకౌంట్‌’ (లోటు లేదా మిగులు రూపంలో) ప్రతిబింబిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement