న్యూఢిల్లీ: కొన్ని రకాల బంగారం ఆభరణాలు, వస్తువుల దిగుమతులపై కేంద్ర సర్కారు ఆంక్షలు విధించింది. అత్యవసరం కాని దిగుమతులను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్పత్తుల దిగుమతి విధానం తక్షణమే అమలులోకి వచ్చేలా ఉచిత నుంచి పరిమితంగా సవరించామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) ఒక ప్రకటనలో పేర్కొంది.
బంగారం ఆభరణాలు, వస్తువుల దిగుమతి కోసం దిగుమతిదారు ఇకపై లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉండగా, దీన్ని ఆంక్షల పరిధిలోకి తీసుకొచ్చింది. అయితే భారత్-యూఏఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పరిధిలో చేసుకునే దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించవని డీజీఎఫ్‌టీ స్పష్టం చేసింది.
కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-మే మధ్య కాలంలో ముత్యాలు, విలువైన, పాక్షిక విలువైన రాళ్ల దిగుమతులు 25.36 శాతం తగ్గి 4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే కాలంలో బంగారం దిగుమతులు కూడా దాదాపు 40 శాతం తగ్గి 4.7 బిలియన్ డాలర్లకు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment