భారీ సామర్థ్యంతో ఏర్పాటు చేయాలి
నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్
న్యూఢిల్లీ: భారీ పరిమాణంలో మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుతో శిలాజ ఇంధనాలైన పెట్రోలియం తదితర ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవచ్చని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సూచించారు. థర్మల్ ప్లాంట్లపై ఆధారపడడం భవిష్యత్తులో తగ్గుతుందంటూ.. మెథనాల్ తయారీకి పరిశ్రమ ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మెథనాల్‌ను శుద్ధ ఇంధనంగా పేర్కొంటూ, భారీ వాణిజ్య వాహనాల్లోనూ దీన్ని వినియోగించొచ్చన్నారు.
మెథనాల్‌తో నడిచే ఓడను నిర్మించాలంటూ ఓ విదేశీ కంపెనీ కోచి్చన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు ఆర్డర్ ఇచి్చనట్టు చెప్పారు. ఈ నెల 17, 18 తేదీల్లో ఢిల్లీలోని మనేక్‌షా కేంద్రంలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ మెథనాల్ సెమినార్, ఎక్స్‌పోను నీతి ఆయోగ్ నిర్వహిస్తున్నట్టు సారస్వత్ ప్రకటించారు.
2016లో అమెరికాకు చెందిన మెథనాల్ ఇనిస్టిట్యూట్‌తో నీతిఆయోగ్ భాగస్వామ్యం కుదుర్చుకోగా.. ఈ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టులు, ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధికి సంబంధించి సాధించిన పురోగతిని సెమినార్‌లో తెలియజేస్తామని చెప్పారు. ఉత్పత్తులు, టెక్నాలజీలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శిస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెథనాల్ తయారీ, వినియోగానికి వీలుగా ప్రభుత్వం ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోందని, ఆ తర్వాత పెద్ద స్థాయి మెథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలతో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తుందని చెప్పారు. ప్రస్తుతం దేశంలో 0.7 మిలియన్ మెట్రిక్ టన్నుల మెథనాల్ తయారీ సామర్థ్యం ఉండగా.. డిమాండ్ 4 మిలియన్ టన్నులు మేర ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment