న్యూఢిల్లీ: భారత్ బంగారం దిగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23) ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 30 శాతం పడిపోయాయి. దిగుమతులుమొత్తం విలువ 31.8 బిలియన్ డాలర్లుగా నమోదైంది యల్లో మెటల్ దిగుమతుల విలువ 2021-22 ఇదే కాలంలో 45.2 బిలియన్ డాలర్లుగా ఉంది. 2022 ఆగస్టు నుంచి దిగుమతుల్లో పెరుగుదల లేకపోగా, క్షీణత నమోదుకావడం దీనికి నేపథ్యం. బంగారంపై అధిక దిగుమతి సుంకం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు విలువైన లోహం దిగుమతులు తగ్గడానికి కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
గత ఏడాది కేంద్రం పసిడిపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. పసిడి దిగుమతులను నిరుత్సాహ పరచడం, తద్వారా ఈ బిల్లును తగ్గించడం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరక్కుండా కట్టడి చేయడం ఈ నిర్ణయం లక్ష్యం.
వెండి వెలుగులు.. కాగా, వెండి దిగుమతులు మాత్రం 2022-23 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 66 శాతం పెరిగి 5.3 బిలియన్ డాలర్లుగా నమోదుకావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment