బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. వాణిజ్యంపై ప్రభావం | Bangladesh conflicts are unlikely to any meaningful impact on overall india trade | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. వాణిజ్యంపై ప్రభావం

Published Wed, Aug 7 2024 2:31 PM | Last Updated on Wed, Aug 7 2024 3:13 PM

Bangladesh conflicts are unlikely to any meaningful impact on overall india trade

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని షేక్‌ హసీనా దేశం వదిలివెళ్లారు. దాంతో అక్కడి పరిపాలన సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ తెలిపింది. సంస్థ వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  • భారత్‌ బంగ్లాదేశ్‌కు చాలా వస్తువులను ఎగుమతి చేస్తోంది.

  • ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం తగ్గుతుంది. అయితే దీని ప్రభావం పెద్దగా ఉండదు.

  • 2023-24లో బంగ్లాదేశ్‌కు భారత్‌ 11 బిలియన్‌ డాలర్లు(రూ.92 వేలకోట్లు) విలువ చేసే వస్తువులను ఎగుమతి చేసింది. అంతకుముందు ఏడాది నమోదైన 12.21 బిలియన్‌ డాలర్లతో(రూ.1 లక్ష కోట్లు) పోలిస్తే ఇది తక్కువ.

  • గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లా నుంచి భారత్‌కు దిగుమతుల విలువ రెండు బిలియన్‌ డాలర్ల(రూ.16 వేలకోట్లు) నుంచి 1.84 బిలియన్‌ డాలర్లకు(రూ.15 వేలకోట్లు) తగ్గింది.

ఇదీ చదవండి: 16.8 లక్షల కార్లను రీకాల్‌ చేసిన టెస్లా!

  • ఎగుమతులు: కూరగాయలు, కాఫీ, టీ, మసాలాలు, పంచదార, చాక్లెట్లు, శుద్ధిచేసిన పెట్రోలియం, రసాయనాలు, పత్తి, ఇనుము, ఉక్కు, వాహనాలు.

  • దిగుమతులు: చేపలు, ప్లాస్టిక్‌, తోలు ఉత్పత్తులు, దుస్తులు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement