Bangladesh Army
-
Bangladesh: దుర్గాపూజలకు మరింత బందోబస్తు
ఢాకా: భారత్‌లోని పశ్చిమ బెంగాల్లో దసరా సందర్భంగా జరిగే దుర్గా పూజలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అయితే ఈ రాష్ట్రానికి ఆనుకున్న ఉన్న బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్న దరిమిలా, అక్కడ దుర్గాపూజలు ఎలా జరగనున్నాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత, కొత్తగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం దుర్గా పూజల నిర్వహణకు పలు నియమనిబంధనలను రూపొందించింది. బంగ్లాదేశ్‌లో దుర్గాపూజల కోసం 32,666 వేదికలను ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహ్మద్ మొయినుల్ ఇస్లాం మాట్లాడుతూ గత కొంతకాలంగా జరుగుతున్న మత అల్లర్ల దృష్ట్యా, దేశంలో మరింత కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దుర్గాపూజలు మొదలుకొని, విగ్రహ నిమజ్జనం వరకు మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సైబర్ నిఘా ఏర్పాటు చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా నేషనల్ ఎమర్జెన్సీ సర్వీస్ 999కి డయల్ చేసి సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ సలహాదారు మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ దుర్గాపూజ వేదికల కారణంగా ముస్లిం అనుచరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వారి నమాజ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు లౌడ్స్పీకర్లు నిలిపివేయాలని కోరారు. బంగ్లాదేశ్ మత వ్యవహారాల సలహాదారు అబుల్ ఫైజ్ ముహమ్మద్ ఖలీద్ హుస్సేన్ మాట్లాడుతూ హిందువుల భద్రతకు తాము హామీనిస్తున్నామని అన్నారు. అక్టోబరు 3 నుంచి దుర్గాపూజలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12న ముగియనున్నాయి. అక్టోబర్ 8, 9 తేదీలలో పెద్ద సంఖ్యలో భక్తులు దుర్గాపూజలకు హాజరవుతారు.ఇది కూడా చదవండి: మహాకాళేశ్వరం గోడ కూలి ఇద్దరు మృతి -
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. వాణిజ్యంపై ప్రభావం
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రధాని షేక్ హసీనా దేశం వదిలివెళ్లారు. దాంతో అక్కడి పరిపాలన సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ తెలిపింది. సంస్థ వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.భారత్ బంగ్లాదేశ్‌కు చాలా వస్తువులను ఎగుమతి చేస్తోంది.ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం తగ్గుతుంది. అయితే దీని ప్రభావం పెద్దగా ఉండదు.2023-24లో బంగ్లాదేశ్‌కు భారత్ 11 బిలియన్ డాలర్లు(రూ.92 వేలకోట్లు) విలువ చేసే వస్తువులను ఎగుమతి చేసింది. అంతకుముందు ఏడాది నమోదైన 12.21 బిలియన్ డాలర్లతో(రూ.1 లక్ష కోట్లు) పోలిస్తే ఇది తక్కువ.గత ఆర్థిక సంవత్సరంలో బంగ్లా నుంచి భారత్‌కు దిగుమతుల విలువ రెండు బిలియన్ డాలర్ల(రూ.16 వేలకోట్లు) నుంచి 1.84 బిలియన్ డాలర్లకు(రూ.15 వేలకోట్లు) తగ్గింది.ఇదీ చదవండి: 16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!ఎగుమతులు: కూరగాయలు, కాఫీ, టీ, మసాలాలు, పంచదార, చాక్లెట్లు, శుద్ధిచేసిన పెట్రోలియం, రసాయనాలు, పత్తి, ఇనుము, ఉక్కు, వాహనాలు.దిగుమతులు: చేపలు, ప్లాస్టిక్, తోలు ఉత్పత్తులు, దుస్తులు. -
బందీలుగా చిక్కిన వారిని కిరాతకంగా నరికేశారు
20 మందిని హతమార్చిన ముష్కరులు మృతులంతా విదేశీయులే 10 గంటల అనంతరం ముగిసిన ఢాకా ఆపరేషన్ ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 20మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. ఢాకాలోని ఓ రెస్టారెంట్లో చొరబడిన ముష్కరులు అందులోని వారిని బందీలుగా తీసుకున్న సంగతి తెలిసిందే. 10 గంటలపాటు కొనసాగిన ఆపరేషన్‌లో భాగంగా ఆరుగురు ఉగ్రవాదులను బంగ్లా భద్రతా దళాలు హతమార్చాయి. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నాయి. ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఉన్న 13మందిని సురక్షితంగా రక్షించాయి. కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. ఆపరేషన్ ముగించి.. రెస్టారెంట్లోకి ప్రవేశించిన భద్రతా దళాలకు 20 మంది మృతదేహాలు లభించాయి. వారిని అత్యంత కిరాతకంగా ఉగ్రవాదులు పదునైన ఆయుధాలతో నరికి చంపారని ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ నయీమ్ అష్షాక్ చౌదరి తెలిపారు. ఉగ్రవాదులు చంపిన వారంతా విదేశీయులేనని తెలుస్తోందని రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కి సురక్షితంగా బయటపడిన 13మందిలో ముగ్గురు విదేశీయులు ఉన్నారు. అందులో ఒకరు జపనీస్ కాగా, మరో ఇద్దరు శ్రీలంక వాసులు. ఐఎస్ఐఎస్ అనుబంధ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బంగ్లాదేశ్ పోలీసులు భావిస్తున్నారు.