ఓ అధికార పార్టీకి చెందిన నేత కుమారుడి నిర్వాకంతో మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు తన లగ్జరీ బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారుతో మహిళ, ఆమె భర్త ప్రయాణిస్తున్న స్కూటీని అతివేగంతో ఢీకొట్టాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితురాలు గాల్లోంచి ఎగిరి దూసుకెళ్లింది. 100 మీటర్ల అవతల పడిపోయింది. చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇంతకీ ఆ రాజకీయ నేత ఎవరు?
ముంబై వర్లిలోని అట్రియా మాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 5.30గంటల సమీపంలో బీఎండబ్ల్యూ కారు దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య కావేరీ నక్వా దుర్మరణం చెందగా.. భర్త పార్థిక్ నక్వా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే ఆ బీఎండబ్ల్యూ కారు ముంబై అధికార ఏక్ నాథ్ షిండ్ నేతృత్వంలోని శివసేన పార్టీ నేత రాజేష్ షాకి చెందినదిగా పోలీసులు గుర్తించారు.
Hit and run case in Mumbai.
A BMW car hit a scooty in the Worli area.
One female dead.#Mumbai pic.twitter.com/rFdfir4pjF— Vivek Gupta (@imvivekgupta) July 7, 2024
ప్రమాద సమయంలో మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా శివసేన నేత రాజేష్ షా బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారును ఆయన కుమారుడు మిహిర్ షా డ్రైవ్ చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. ఆదివారం ఉదయం 5.30గంటల సమయంలో మిహిర్ షా తన బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారుతో వ్రోలి ప్రాంతానికి వెళుతున్నాడు. అదే సమయంలో సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న దంపతులు ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టారు.
ఈ కారు ప్రమాదంతో బాధితురాలు గాల్లోకి దూసుకెళ్లింది. సుమారు 100 మీటర్ల అవతల పడిపోవడంతో తీవ్రగాయాల పాలైంది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు బాధితుల్ని అత్యవసర చికిత్స కోసం నాయర్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న భార్య మరణించగా.. భర్తకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.
కారు ఎవరిదో.. నిర్ధారించే పనిలో పోలీసులు
మరోవైపు రోడ్డు ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును వ్రోలీ పోలీసులు సీజ్ చేశారు. ఈ కారు ఎవరిది? శివసేన పార్టీ నేత రాజేష్ షాకి చెందినదేనా? ప్రమాదానికి కారకులు ఎవరనేది త్వరలో నిర్ధారిస్తామన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
సీఎం షిండే ఆగ్రహం.. పోలీస్ శాఖకు ఆదేశాలు
తన పార్టీకి చెందిన నేత కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో ఓ మహిళ ప్రాణాలు పోయిందంటూ అటు జాతీయ మీడియా, ఇటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో ముంబై సీఎం ఏక్‌నాథ్ షిండ్ స్పందించారు. ప్రమాదానికి కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వ్రోలీ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment