Bigg Boss 5 Vishwa Buys Luxurious BMW Car, Video And Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Bigg Boss Vishwa BMW Car: లగ్జరీ కారు కొన్న విశ్వ, నెటిజన్ల సెటైర్లు

Published Fri, Nov 26 2021 4:46 PM | Last Updated on Sat, Nov 27 2021 9:15 PM

Bigg Boss Telugu 5: Vishwa Buys His Dream Car BMW - Sakshi

Bigg Boss Contestants Owns BMW Car: బిగ్‌బాస్‌ షో అందరికీ కలిసిరాకపోయినా కొందరికి బాగా కలిసొస్తుంది. అందులో విశ్వ ఒకరు. లాక్‌డౌన్‌లో కూతురు చదువు ఫీజు కట్టడానికి కూడా డబ్బుల్లేవని ఏడ్చిన అతడికి బిగ్‌బాస్‌ షోతో దశ తిరిగిపోయినట్లు కనిపిస్తుంది. తాజాగా అతడు లగ్జరీ కారు కొన్నాడు. లక్షలు విలువ చేసే బీఎండబ్ల్యూ కారును తన సొంతం చేసుకున్నాడు. తాజాగా ఈ శుభవార్తను అతడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

'నా జీవితంలోకి కొత్త ఫ్యామిలీ మెంబర్‌ వచ్చింది. కలలు కన్న కారును కొంటే ఆ ఆనందమే వేరు. మొత్తానికి నేను ఎంతగానో ఇష్టపడే కారును కొని కల నెరవేర్చుకున్నాను. దీనికి కారణమైన ఆ దేవుడికి, బిగ్‌బాస్‌కు ఇదే నా కృతజ్ఞతలు. అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టాడు. బ్లాక్‌ బీఎండబ్ల్యూ కారు ముందు ఫొటోలకు పోజిచ్చాడు. దీంతో చాలామంది విశ్వకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బిగ్‌బాస్‌తో విశ్వ రేంజ్‌ మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం షోలో స్కూలు ఫీజుకు కూడా డబ్బుల్లేవని చెప్పాలి, బయటకు వచ్చాక బీఎండబ్ల్యూ కారులో తిరగాలి అని సెటైర్లు వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement