ఒకరి జీవితంతో ఆడుకోకండి: విశ్వ వార్నింగ్‌ | Bigg Boss Telugu 5: Vishwa Elimination Interview With Ariyana | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఒకరి జీవితంతో ఆడుకోకండి: విశ్వ వార్నింగ్‌

Published Tue, Nov 9 2021 6:51 PM | Last Updated on Tue, Nov 9 2021 7:03 PM

Bigg Boss Telugu 5: Vishwa Elimination Interview With Ariyana - Sakshi

Bigg Boss Buzz Interview With Vishwa: బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి సగర్వంగా వీడ్కోలు తీసుకున్నాడు విశ్వ. ఈ సీజన్‌కే సూపర్‌ హీరో అనిపించుకుని మరీ షో నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ బజ్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు కంటెస్టెంట్ల గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు.

శ్రీరామచంద్రను ఫైటర్‌గా కొనియాడిన విశ్వ.. మానస్‌ ఓటమిని కూడా అంగీకరించాలన్నాడు. గ్రూప్స్‌ వల్ల ఏ కంటెస్టెంట్‌ అయినా సేవ్‌ అయ్యారా? అన్న అరియానా ప్రశ్నకు షణ్ముఖ్‌, జెస్సీ, సిరి అని బదులిచ్చాడు. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ను నామినేట్‌ చేయాలన్న యానీ మాస్టర్‌ స్ట్రాటజీ ఎందుకు నచ్చలేదన్న క్వశ్చన్‌కు ఆమె తన గేమ్‌ ఎలా ఆడాలనే విషయాన్ని పక్కనపెట్టి పక్కవాళ్ల గేమ్‌ ఎలా ఆపాలని చూస్తుంది, అది నచ్చదని చెప్పుకొచ్చాడు.

'షణ్ముఖ్‌.. గెలిచినప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా ఉంటాడు. అతడు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నాడు. మానస్‌కు ఏం జరిగినా వెంటనే పింకీ అక్కడుంటుంది. కానీ ఆమె కింద పడినప్పుడు మానస్‌ వెళ్లలేదు. ఎందుకని అడిగితే పోనని ఆన్సరిచ్చాడు. సిరికి షణ్ముఖ్‌ బయట ఫ్రెండ్‌ కావచ్చు, ఇక్కడ ఫ్రెండ్‌ కావచ్చు. కానీ ఒకరి జీవితంతో ఆడుకోవద్దు' అని హెచ్చరించాడు విశ్వ. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement