ప్రముఖ బాలీవుడ్ యాక్టర్, టెలివిజన్ హోస్ట్ అయిన 'శేఖర్ సుమన్' గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భూమి, ఘర్ బజార్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇటీవల తన భార్య 'అల్కా సుమన్'కి తమ పెళ్లి రోజు కానుకగా ఖరీదైన కారుని గిఫ్ట్‌గా అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శేఖర్ సుమన్ తన భార్యకిచ్చిన కారు ధర సుమారు రూ. 2.4 కోట్లు. ఇది జర్మన్ బ్రాండ్ BMW కంపెనీకి చెందిన ఐ7 లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్. ఈ కారుని తన కొడుకు అధ్యాయన్ సుమన్‌తో కలిసి డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. ఈ కారు ఆక్సైడ్ గ్రే మెటాలిక్ క్లాసీ కలర్ లో చూడ చక్కగా ఉంది.
దీనికి సంబంధించిన ఒక ఫోటోని అధ్యాయన్ సుమన్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ అమ్మ, నాన్న మీ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు, నాన్న నుంచి ఇది నీకు స్పెషల్ గిఫ్ట్ అమ్మా అంటూ.. ఏదో ఒకరోజు ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇస్తాను, దేవుడు నాకు ఆ శక్తిని ఇవ్వాలని ఆశీర్వదించండి అంటూ రాసాడు.
(ఇదీ చదవండి: 47 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్స్ బంద్.. అందులో మీరున్నారా?)
ఇక బీఎండబ్ల్యూ ఐ7 విషయానికి వస్తే, ఇది 2023 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో రూ. 1.95 కోట్ల ఎక్స్-షోరూమ్ ధర వద్ద విడుదలైంది. ఈ సెడాన్ xDrive 60 అనే ఒకే వేరియంట్లో లభిస్తుంది. అయితే ఇది CBU మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి అవుతుంది, కావున దీని ధర ఎక్స్-షోరూమ్ ధర కంటే ఎక్కువగా ఉంటుంది.
(ఇదీ చదవండి: నిండా పాతికేళ్లు కాలేదు రూ. 100 కోట్లు సంపాదన - అతనేం చేస్తున్నాడో తెలుసా?)
బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు చాలా ప్రత్యేకమైన డిజైన్ కలిగి, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 14.9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి అత్యాధునిక ఐడ్రైవ్ 8 ఆపరేటింగ్ సిస్టం కూడా పొందుతుంది. ఇందులో ప్రత్యేకంగా 31.3 ఇంచెస్ సినిమా స్క్రీన్ కూడా లభిస్తుంది.
2023 బీఎండబ్ల్యూ ఐ7 సెడాన్ రెండు మోటార్లను కలిగి 544 hp పవర్, 745 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 101.7 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 591 కిమీ నుంచి 625 కిమీ రేంజ్ అందింస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ గరిష్ట వేగం గంటకు 239 కిమీ వరకు ఉంటుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment