బాలీవుడ్ బ్యూటీ 'కిమ్ శర్మ' (Kim Sharma) పేరు తెలుగు వారికి పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, కానీ మగధీర సినిమాలో జోర్సే.. జోర్సే పాట గుర్తొస్తే తప్పకుండా ఈమే గుర్తొస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఖడ్గం, ఆంజనేయులు సినిమాల్లో కూడా తనదైన రీతిలో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. ఈ కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
కిమ్ శర్మ కొనుగోలు చేసిన కొత్త కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 (BMW i7) ఎలక్ట్రిక్ సెడాన్. ఇటీవలే ఈ కారుతో ఓ రెస్టారెంట్ వెలుపల కనిపించింది. ఈ సెడాన్ ధర రూ. 1.95 కోట్లు (ఎక్స్-షోరూమ్). దీనికి సంబంధించిన ఒక వీడియోను కార్స్ ఫర్ యు అనే యూట్యూబ్ ఛానల్ అప్‌లోడ్ చేసింది.
ఈ వీడియోలో గమనించినట్లయితే, బీఎండబ్ల్యూ ఐ7 కారు దిగి రెస్టారెంట్ లోపలికి వెళ్లిపోవడం చూడవచ్చు. గతంలో ఈమె భారతదేశంలో అత్యంత సరసమైన కారు 'టాటా నానో' (Tata Nano) ఉపయోగించేది. అయితే దీని స్థానంలో ఖరీదైన బీఎండబ్ల్యూను చేర్చింది.
బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణపొందిన బీఎండబ్ల్యూ కార్లలో ఐ7 ఒకటి. ఇది అద్భుతమై డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో బ్లూ యాక్సెంట్‌లు, కొత్త డైమండ్ అల్లాయ్ వీల్ వంటివి గమనించవచ్చు.
ఇదీ చదవండి: ఎలాన్ మస్క్‌కు షాక్.. ఎక్స్(ట్విటర్)కు రూ.3.21 కోట్లు ఫైన్ - కారణం ఇదే!
ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఈ సెడాన్ 14.9 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ & 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది. అంతే కాకుండా రెండవ వరుస ప్రయాణికుల కోసం ఇందులో 31.3 ఇంచెస్ 8కే సినిమా స్క్రీన్ ఉంటుంది. డోర్స్ వద్ద కూడా 5.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది.
బీఎండబ్ల్యూ ఐ7 రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి 544 హార్స్ పవర్, 745 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులోని 101.7 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 600 కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. దీని టాప్ స్పీడ్ 239 కిమీ/గం.
Comments
Please login to add a commentAdd a comment