sekhar suman
-
ఒక్క హిట్టు.. 12 సినిమాలకు సంతకం చేశా.. చివరికి!
ఫెయిల్యూర్ వస్తే ఎవరూ పట్టించుకోరు.. అదే సక్సెస్ వస్తే వారి పేర్లు మార్మోగిపోతాయి. అవకాశాలు క్యూ కడతాయి. కానీ ఆ ఫేమ్ సరిగా వాడుకుంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు. ఏమాత్రం తప్పటడుగులు వేసినా మొదటికే మోసం వస్తుంది. బాలీవుడ్ నటుడు అధ్యాయన్ సుమన్ విషయంలో ఇదే జరిగింది. నటుడు శేఖర్ సుమన్ తనయుడిగా 'హాల్ ఇ దిల్' అనే సినిమాతో 2008లో వెండితెరపై అడుగుపెట్టాడు. రెండో చిత్రం రాజ్ 2తో సక్సెస్ కొట్టాడు.ఒకేసారి 12 సినిమాలకు సంతకంసక్సెస్ రావడంతో బోలెడన్ని ఆఫర్లు రాగా అన్నింటికీ ఓకే చెప్పాడట. దాని గురించి అధ్యాయన్ మాట్లాడుతూ.. 'రాజ్ 2 తర్వాత నేను ఒకేసారి 12 సినిమాలకు సంతకం చేశాను. ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాను, మంచి పేరొచ్చేసిందని ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఫీలయ్యాను. ఓ వార్తా పత్రిక సైతం టాప్ 5 న్యూకమర్స్ అంటూ రణ్‌బీర్ కపూర్, ఇమ్రాన్ ఖాన్ సరసన నా ఫోటో కూడా పబ్లిష్ చేసింది. ఇది కదా అసలైన మజా అనుకున్నాను. అప్పుడే నా లైఫ్ యూటర్న్ తీసుకుంది. నా మూడో సినిమా జష్న్ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.మంచి సినిమా.. కానీ!దీంతో నేను సంతకం చేసిన 12 సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నిజానికి అది చాలా మంచి సినిమా.. కానీ ఎందుకో ఆడలేదు. నటుడిగా నాకు పేరు తెచ్చినప్పటికీ తర్వాతి సినిమాలన్నీ ఆపేయడంతో అవి దేనికీ పనికిరాకుండా పోయాయి. నాతో పాటు వచ్చినవాళ్లకు ఫ్లాప్స్ వచ్చినా సినిమాలు చేసుకుంటూ పోయారు. నేను మాత్రం ఒక్క హిట్టు, ఒక్క ఫ్లాప్ అందుకుని అక్కడే ఆగిపోయాను.నాకే ఎందుకిలా..నాకే ఎందుకిలా జరిగిందని కొన్నేళ్లపాటు ఆలోచించాను. చివరకు ఇలా ఆలోచిస్తూ దిగులుగా కూర్చునేకన్నా జీవితంలో ఏది వచ్చినా ముందుకు సాగిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా అధ్యాయన్ సుమన్, తండ్రి శేఖర్ సుమన్ ప్రస్తుతం 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.చదవండి: లావైపోయా.. సడన్‌గా అన్నీ మారిపోయాయి.. బాధేసింది! -
Shekhar Suman: భార్యకు రూ. 2.4 కోట్ల కారు గిఫ్ట్ - కొడుకు ఇన్‌స్టా పోస్ట్ ఇలా..!
ప్రముఖ బాలీవుడ్ యాక్టర్, టెలివిజన్ హోస్ట్ అయిన 'శేఖర్ సుమన్' గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. భూమి, ఘర్ బజార్ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇటీవల తన భార్య 'అల్కా సుమన్'కి తమ పెళ్లి రోజు కానుకగా ఖరీదైన కారుని గిఫ్ట్‌గా అందించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శేఖర్ సుమన్ తన భార్యకిచ్చిన కారు ధర సుమారు రూ. 2.4 కోట్లు. ఇది జర్మన్ బ్రాండ్ BMW కంపెనీకి చెందిన ఐ7 లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్. ఈ కారుని తన కొడుకు అధ్యాయన్ సుమన్‌తో కలిసి డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. ఈ కారు ఆక్సైడ్ గ్రే మెటాలిక్ క్లాసీ కలర్ లో చూడ చక్కగా ఉంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోని అధ్యాయన్ సుమన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ అమ్మ, నాన్న మీ వార్షికోత్సవ సందర్భంగా అభినందనలు, నాన్న నుంచి ఇది నీకు స్పెషల్ గిఫ్ట్ అమ్మా అంటూ.. ఏదో ఒకరోజు ఖరీదైన కారుని గిఫ్ట్‌గా ఇస్తాను, దేవుడు నాకు ఆ శక్తిని ఇవ్వాలని ఆశీర్వదించండి అంటూ రాసాడు. (ఇదీ చదవండి: 47 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్స్ బంద్.. అందులో మీరున్నారా?) ఇక బీఎండబ్ల్యూ ఐ7 విషయానికి వస్తే, ఇది 2023 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో రూ. 1.95 కోట్ల ఎక్స్-షోరూమ్ ధర వద్ద విడుదలైంది. ఈ సెడాన్ xDrive 60 అనే ఒకే వేరియంట్లో లభిస్తుంది. అయితే ఇది CBU మార్గం ద్వారా భారతదేశానికి దిగుమతి అవుతుంది, కావున దీని ధర ఎక్స్-షోరూమ్ ధర కంటే ఎక్కువగా ఉంటుంది. (ఇదీ చదవండి: నిండా పాతికేళ్లు కాలేదు రూ. 100 కోట్లు సంపాదన - అతనేం చేస్తున్నాడో తెలుసా?) బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు చాలా ప్రత్యేకమైన డిజైన్ కలిగి, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 14.9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి అత్యాధునిక ఐడ్రైవ్ 8 ఆపరేటింగ్ సిస్టం కూడా పొందుతుంది. ఇందులో ప్రత్యేకంగా 31.3 ఇంచెస్ సినిమా స్క్రీన్ కూడా లభిస్తుంది. 2023 బీఎండబ్ల్యూ ఐ7 సెడాన్ రెండు మోటార్లను కలిగి 544 hp పవర్, 745 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 101.7 కిలోవాట్ బ్యాటరీ ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 591 కిమీ నుంచి 625 కిమీ రేంజ్ అందింస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ గరిష్ట వేగం గంటకు 239 కిమీ వరకు ఉంటుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. View this post on Instagram A post shared by Addhyayan Summan (@adhyayansuman) -
'శత్రుఘ్న సిన్హా పై పోటీకి దిగడమే నేను చేసిన తప్పు'
పాట్నా: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది కాదనలేని వాస్తవం. ఈ వాస్తవాన్ని మరోసారి నిజం చేశారు బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా. ప్రస్తుతం పాట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి గా బరిలో దిగిన శత్రుఘ్న సిన్హా తన సహచర నటుడు,గత ప్రత్యర్థి శేఖర్ సుమన్ ను కలిశారు. శేఖర్ సుమన్ తల్లి ఉషా ప్రసాద్ 80 వ జన్మదిన వేడుకలకు హాజరైన శత్రుఘ్న సిన్హా ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం శత్రుఘ్న మీడియాతో మాట్లాడుతూ.. 'నాకు తల్లి లేదు. ఉషా ప్రసాద్ ను తల్లిగా భావించి ఆమె దీవెనలు పొందడానికి వెళ్లాను. అయినా మా రెండు కుటుంబాల మధ్య విడదీయరాని బంధం ఉంది' అని తెలిపారు. గత 2009 ఎన్నికల్లో శత్రుఘ్నపై పోటీ చేసి శేఖర్ సుమన్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 'మా కుటుంబాల మధ్య వ్యక్తిగతంగా విభేదాలు ఏమీ లేవని, ఆ ఎన్నికల్లో పోటీ చేయడమే మా కుటుంబాల్ని దూరం చేసిందని, ఆనాటి ఎన్నికల్లో శత్రుఘ్నపై పోటీ చేయడమే ఒక తప్పిదమని' శేఖర్ సుమన్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ మరోమారు తన చాణక్య బుద్ధిని చూపేంచేందుకు యత్నించి శత్రుఘ్నపై పోటీ చేయమని ఆదేశిందన్నారు. కాగా, తాను మాత్రం ఈసారి ఎటువంటి తప్పిదాలు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు.