ఫెయిల్యూర్ వస్తే ఎవరూ పట్టించుకోరు.. అదే సక్సెస్ వస్తే వారి పేర్లు మార్మోగిపోతాయి. అవకాశాలు క్యూ కడతాయి. కానీ ఆ ఫేమ్ సరిగా వాడుకుంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు. ఏమాత్రం తప్పటడుగులు వేసినా మొదటికే మోసం వస్తుంది. బాలీవుడ్ నటుడు అధ్యాయన్ సుమన్ విషయంలో ఇదే జరిగింది. నటుడు శేఖర్ సుమన్ తనయుడిగా 'హాల్ ఇ దిల్' అనే సినిమాతో 2008లో వెండితెరపై అడుగుపెట్టాడు. రెండో చిత్రం రాజ్ 2తో సక్సెస్ కొట్టాడు.
ఒకేసారి 12 సినిమాలకు సంతకం
సక్సెస్ రావడంతో బోలెడన్ని ఆఫర్లు రాగా అన్నింటికీ ఓకే చెప్పాడట. దాని గురించి అధ్యాయన్ మాట్లాడుతూ.. 'రాజ్ 2 తర్వాత నేను ఒకేసారి 12 సినిమాలకు సంతకం చేశాను. ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాను, మంచి పేరొచ్చేసిందని ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఫీలయ్యాను. ఓ వార్తా పత్రిక సైతం టాప్ 5 న్యూకమర్స్ అంటూ రణ్‌బీర్ కపూర్, ఇమ్రాన్ ఖాన్ సరసన నా ఫోటో కూడా పబ్లిష్ చేసింది. ఇది కదా అసలైన మజా అనుకున్నాను. అప్పుడే నా లైఫ్ యూటర్న్ తీసుకుంది. నా మూడో సినిమా జష్న్ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.
మంచి సినిమా.. కానీ!
దీంతో నేను సంతకం చేసిన 12 సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నిజానికి అది చాలా మంచి సినిమా.. కానీ ఎందుకో ఆడలేదు. నటుడిగా నాకు పేరు తెచ్చినప్పటికీ తర్వాతి సినిమాలన్నీ ఆపేయడంతో అవి దేనికీ పనికిరాకుండా పోయాయి. నాతో పాటు వచ్చినవాళ్లకు ఫ్లాప్స్ వచ్చినా సినిమాలు చేసుకుంటూ పోయారు. నేను మాత్రం ఒక్క హిట్టు, ఒక్క ఫ్లాప్ అందుకుని అక్కడే ఆగిపోయాను.
నాకే ఎందుకిలా..
నాకే ఎందుకిలా జరిగిందని కొన్నేళ్లపాటు ఆలోచించాను. చివరకు ఇలా ఆలోచిస్తూ దిగులుగా కూర్చునేకన్నా జీవితంలో ఏది వచ్చినా ముందుకు సాగిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా అధ్యాయన్ సుమన్, తండ్రి శేఖర్ సుమన్ ప్రస్తుతం 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment