Adhyayan Suman
-
ఒక్క హిట్టు.. 12 సినిమాలకు సంతకం చేశా.. చివరికి!
ఫెయిల్యూర్ వస్తే ఎవరూ పట్టించుకోరు.. అదే సక్సెస్ వస్తే వారి పేర్లు మార్మోగిపోతాయి. అవకాశాలు క్యూ కడతాయి. కానీ ఆ ఫేమ్ సరిగా వాడుకుంటేనే ఇండస్ట్రీలో రాణించగలరు. ఏమాత్రం తప్పటడుగులు వేసినా మొదటికే మోసం వస్తుంది. బాలీవుడ్ నటుడు అధ్యాయన్ సుమన్ విషయంలో ఇదే జరిగింది. నటుడు శేఖర్ సుమన్ తనయుడిగా 'హాల్ ఇ దిల్' అనే సినిమాతో 2008లో వెండితెరపై అడుగుపెట్టాడు. రెండో చిత్రం రాజ్ 2తో సక్సెస్ కొట్టాడు.ఒకేసారి 12 సినిమాలకు సంతకంసక్సెస్ రావడంతో బోలెడన్ని ఆఫర్లు రాగా అన్నింటికీ ఓకే చెప్పాడట. దాని గురించి అధ్యాయన్ మాట్లాడుతూ.. 'రాజ్ 2 తర్వాత నేను ఒకేసారి 12 సినిమాలకు సంతకం చేశాను. ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాను, మంచి పేరొచ్చేసిందని ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఫీలయ్యాను. ఓ వార్తా పత్రిక సైతం టాప్ 5 న్యూకమర్స్ అంటూ రణ్‌బీర్ కపూర్, ఇమ్రాన్ ఖాన్ సరసన నా ఫోటో కూడా పబ్లిష్ చేసింది. ఇది కదా అసలైన మజా అనుకున్నాను. అప్పుడే నా లైఫ్ యూటర్న్ తీసుకుంది. నా మూడో సినిమా జష్న్ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు.మంచి సినిమా.. కానీ!దీంతో నేను సంతకం చేసిన 12 సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. నిజానికి అది చాలా మంచి సినిమా.. కానీ ఎందుకో ఆడలేదు. నటుడిగా నాకు పేరు తెచ్చినప్పటికీ తర్వాతి సినిమాలన్నీ ఆపేయడంతో అవి దేనికీ పనికిరాకుండా పోయాయి. నాతో పాటు వచ్చినవాళ్లకు ఫ్లాప్స్ వచ్చినా సినిమాలు చేసుకుంటూ పోయారు. నేను మాత్రం ఒక్క హిట్టు, ఒక్క ఫ్లాప్ అందుకుని అక్కడే ఆగిపోయాను.నాకే ఎందుకిలా..నాకే ఎందుకిలా జరిగిందని కొన్నేళ్లపాటు ఆలోచించాను. చివరకు ఇలా ఆలోచిస్తూ దిగులుగా కూర్చునేకన్నా జీవితంలో ఏది వచ్చినా ముందుకు సాగిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా అధ్యాయన్ సుమన్, తండ్రి శేఖర్ సుమన్ ప్రస్తుతం 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.చదవండి: లావైపోయా.. సడన్‌గా అన్నీ మారిపోయాయి.. బాధేసింది! -
కంగనా చేతబడి చేసిందన్నాడు, ఇప్పుడేమో డేటింగ్‌కు అడ్డు చెప్పలేదంటూ..
సెలబ్రిటీలకు ప్రేమకహానీలుండటం మామూలే, అందుకు కంగనా రనౌత్ కూడా అతీతురాలు కాదు. 'రాజ్: ద మిస్టరీ కంటిన్యూస్' సినిమా షూటింగ్ సమయంలో కంగనా రనౌత్, అధ్యాయన్ సుమన్ ప్రేమలో పడ్డారు. కానీ ఈ ప్రేమకథ సజావుగా సాగలేదు. ఎన్నో ట్విస్టుల మధ్య అర్ధాంతరంగా ముగిసింది. ఆ తర్వాత దీని గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అధ్యాయన్, అతడి తండ్రి శేఖర్ సుమన్ కంగనాను విమర్శిస్తూ ఆమె మీద నోరు పారేసుకునేవాళ్లు! కానీ చాలాకాలం తర్వాత కంగనా- అధ్యాయన్‌ల ప్రేమ, పోట్లాటల గురించి పాజిటివ్‌గా స్పందించాడు శేఖర్ సుమన్. 'ఏం జరుగుతుందో అంతా చూస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడూ కంగనాతో మాట్లాడలేదు. ఎందుకంటే అది నా కొడుకు చేస్తున్న పోరాటం. నా కొడుకు తప్పు చేశాడని అనుమానించను, అతడు చేస్తున్న పోరాటంలో అండగా నిలబడ్డాను. నిజానికి ఎవరి ప్రేమకీ నేను అడ్డు రాను. కంగనా, అధ్యాయన్‌ల ప్రేమను నేనేమీ వ్యతిరేకించలేదు. కాకపోతే జీవితంలో ఒక దశ ఉంటుంది. తొలిచూపులోనే ప్రేమలో పడ్డవారితో జీవితం ముందుకు సాగచ్చు, లేదంటే ఆ ప్రేమ అర్ధాంతరంగానే ఆగిపోవచ్చు. నా కొడుకు జీవితంలో రెండవది జరిగింది. ఎవరూ ఫస్ట్ రిలేషన్‌షిప్‌ను తెంచేయాలనుకోరు. కానీ అది మన చేతుల్లో ఉండదు కదా! ఈ సొసైటీ డ్రామానే ఎక్కువ ఇష్టపడుతుంది. పక్కన ఉండే స్నేహితులు కూడా మన సంతోషాన్ని చూడాలనుకోరు. చాలామంది కంగనా- అధ్యాయన్‌ల బంధం ముగిసిపోవాలని కోరుకున్నారేమో! వారి బ్రేకప్‌కు కారణం అధ్యాయనో, కంగనానో కాదు. ఇందులో ఎవరి తప్పూ లేదు. పరిస్థితులు వారితో ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఆ తర్వాత ఏదో ఆవేశంలో నా కొడుకు పొరపాటున ఏదేదో వాగినా తర్వాత దాని గురించి క్షమాపణలు చెప్పాడు. అతడికి ఎవరిపైనా కోపం లేదు' అని చెప్పుకొచ్చాడు శేఖర్ సుమన్. కాగా మహేశ్ భట్ డైరెక్ట్ చేసిన రాజ్ సినిమాలో కంగనా, అధ్యాన్ కలిసి నటించారు. కొంతకాలంపాటు డేటింగ్ చేసిన వీరిద్దరూ తర్వాత సడన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. కంగనా.. హృతిక్ రోషన్‌తో రిలేషన్లో ఉండటం వల్లే తనతో విడిపోయానని గతంలో వెల్లడించాడు అధ్యాయన్. అటు శేఖర్ సుమన్ కూడా తన కొడుకును కంగనా అర్ధరాత్రి ఇంటికి పిలిపించుకుని చేతబడి చేసిందని ఆరోపించాడు. చదవండి: శర్వానంద్ పెళ్లి ముహూర్తం ఫిక్స్, వేదిక ఎక్కడంటే? -
నన్ను, నా కొడుకును ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూశారు: నటుడు
బాలీవుడ్లో కొందరి రాజకీయాలను తట్టుకోలేకే హాలీవుడ్‌కు షిఫ్ట్ అయ్యానంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రియాంక చోప్రా. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలో తనకు అవకాశాలు రాకుండా చేసి ఓ మూలకు నెట్టేయడానికి ఓ గ్రూప్ ఏర్పాటైందని పేర్కొంది. ఈ పొలిటికల్ గేమ్స్ ఆడలేకే హాలీవుడ్‌కు మకాం మార్చానంది. ఈ వ్యాఖ్యలు బీటౌన్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో నటుడు శేఖర్ సుమన్ సైతం బాలీవుడ్లో రాజకీయాలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రియాంక వ్యాఖ్యలు నన్నేమీ షాక్‌కు గురి చేయలేదు. ఇండస్ట్రీలో ఎలాంటి కుళ్లు రాజకీయాలుంటాయో అందరికీ తెలుసు. మిమ్మల్ని అణిచివేసి, అంతం చేసేవరకు వదలరు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విషయంలో జరిగింది ఇదే! ఇంకా చాలామందికి జరిగింది. దాన్ని తట్టుకోవాలి, లేదంటే వదిలేయాలి. ప్రియాంక బాలీవుడ్‌ను వదిలి వెళ్లిపోవాలనుకుంది. నిజంగా తను మంచి పని చేసింది. హాలీవుడ్లో భారత్ తరపునుంచి గ్లోబల్ ఐకాన్‌గా నిలబడింది' అని ట్వీట్ చేశాడు. మరో ట్వీట్లో.. 'సినీ ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు వ్యక్తులు నాకు, నా కొడుకు అధ్యాయన్‌కు అవకాశాలు రాకుండా చేశారు. మాకు వ్యతిరేకంగా పని చేసి ఎన్నో ప్రాజెక్టుల నుంచి తప్పించారు. మమ్మల్ని ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూశారు. ఈ గ్యాంగ్స్టర్లు తాచుపాము కంటే కూడా ప్రమాదకరమైనవాళ్లు. కానీ అసలు నిజమేంటంటే.. వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మమ్మల్ని ఆపలేరు' అని రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'అధ్యాయన్ మంచి నటుడు.. ఓటీటీ మాధ్యమాల ద్వారా అయినా తన ప్రతిభ నిరూపించుకోగలడు.. కానీ శేఖర్ సర్ చాలా గ్రేట్. ఆ రోజుల్లో ఓటీటీ వంటి మాధ్యమాలు లేవు. అయినా కష్టపడి తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు', 'మీలాంటి లెజెండ్ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే బాధగా ఉంది' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శేఖర్ సుమన్.. భూమి, హార్ట్లెస్, చలో, రణ్‌భూమి, తేరే బినా క్యా జీనా, వో ఫిర్ ఆయేగి, సంసార్, ఉత్సవ్, నాచే మయూరి వంటి సినిమాల్లో నటించాడు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా, వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు. I know of atleast 4ppl in the industry who have ganged up to have me n adhyayan removed from many projects.i know it for sure.These 'gangsters' have a lot of clout and they are more dangerous than a rattle snake.But the truth is they can create hurdles but they cannot stop us. — Shekhar Suman (@shekharsuman7) March 30, 2023 It will happen to others too.That's the way the cookie crumbles in the industry.Take it or leave it.and Priyanka decided to leave.and thank God she did.for now we have a true-blue global icon representing India in https://t.co/cleRR7DGsL they say every cloud has a silver lining. — Shekhar Suman (@shekharsuman7) March 30, 2023 -
కంగనా తిట్టినా..చేయి చేసుకున్నా తట్టుకున్నా కానీ...
త్యాగం.. ప్రేను ఓడిస్తుంది.. స్వార్థం.. మనిషిని గెలిపిస్తుంది.. చిత్రంగా రెండూ ప్రేమకు విషాదాంతాలిచ్చేవే! స్వార్థం, త్యాగం పోరులో కంగనా రనౌత్, అధ్యయన్ సుమన్ ప్రేమ కూడా ఓడిపోయింది. చాలా మంది సినిమా వాళ్ల ప్రేమ కథల్లాగే వీళ్ల కథకూ స్టార్టింగ్ పాయింట్ షూటింగ్ స్పాటే. కంగనా, అధ్యయన్ కలిసి నటించిన ‘రాజ్.. ది మిస్టరీ కంటిన్యూస్’ సెట్స్. ఆ సినిమాలోని ‘ఓ జానా.. ’ పాట చిత్రీకరణ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. షూటింగ్ అయిపోయాక లాంగ్ డ్రైవ్స్, డిన్నర్లు సాధరణమయ్యాయి వాళ్ల షెడ్యూల్లో. సినిమా పూర్తయ్యేలోపే అధ్యయన్కు ‘ఐ లవ్ యూ’ చెప్పింది కంగనా. ‘మై భీ’ అన్నాడు. అది ఎన్నాళ్లుంది? ఎందుకు ఎండ్ అయింది? అధ్యయన్ మాటల్లోనే తెలుసుకుందాం (‘డీఎన్ఏ’కు అతను ఇచ్చిన ఇంటర్వ్యూ నుంచి)... నాకొక రోజు మహేశ్ భట్ నుంచి ఫోన్ వచ్చింది. ‘రాజ్ 2 రషెస్ చూసి ఫోన్ చేస్తున్నా.. నీ వర్క్ చాలా నచ్చింది. నీతో సినిమా చేయాలనుకుంటున్నా’ అంటూ. నా ఫోన్ స్పీకర్ ఆన్‌లోనే ఉండడంతో కంగనా కూడా విన్నది. నిజానికి నా కెరీర్‌ను మలిచే గుడ్ న్యూస్ అది. కానీ ఆమెకు నచ్చలేదు. ‘నాకెందుకు ఎవ్వరు ఫోన్ చేయరు? ఏం చూసి నీకు చాన్స్ ఇస్తామంటున్నారు?’ అని చిటపటలాడింది. ఆ రియాక్షన్‌కు ఫీలయ్యా. ఫ్యాషన్ మూవీ తర్వాత కొన్నాళ్ల దాకా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్‌తోనే అలా అంటుందని సరిపెట్టుకున్నా. నా బర్త్‌డేకు ఒకసారి మా నాన్న (శేఖర్ సుమన్) బీఎమ్‌డబ్ల్యూ సెవెన్ సిరీస్ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ గుడ్‌న్యూస్‌ను కంగనాతో షేర్ చేసుకుంటే బదులుగా వెటకారమే. ‘ఏం సాధించావని కోటి రూపాయల గిఫ్ట్ కొనిచ్చాడు మీ నాన్న?’ అంటూ. ఆ సంఘటన తర్వాత కంగనా హైదరాబాద్ వెళ్లింది. అక్కడి నుంచి కాల్ చేసింది ‘నేను తెలుగు మూవీ ఒకటి సైన్ చేశా. ప్రభాస్ హీరో. ఇంకో సంగతి బీఎమ్‌డబ్ల్యూ సెవెన్ సిరీస్ బుక్ చేశా’ అని చెప్పింది. అంత పోటీ తనకు. లూజర్ అనే మాట వినీవినీ.. కంగనా తీరేంటో అర్థమయ్యేది కాదు. ఆమెకెప్పుడు ప్రేమ పుడుతుందో.. ఎప్పుడు కోపం వస్తుందో.. దేనికి సంతోషంగా ఉంటుందో.. దేనికి హర్ట్ అవుతుందో తెలిసేది కాదు. ఆ రిలేషనే కన్ఫ్యూజన్. ఇంకా చెప్పాలంటే ప్రేమ కన్నా అవమానాన్నే ఇచ్చింది. అన్నిటినీ భరించాను. నోటికొచ్చినట్టు తిట్టినా.. నా మీద చేయి చేసుకున్నా తట్టుకున్నాను. ఆఖరికు నా కళ్లముందే మా నాన్నను ఇన్సల్ట్ చేసినా తన వైపే ఉన్నా. ఫిలిం జర్నలిస్ట్‌లతో నాకు ఫోన్లు చేయించి ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాననే స్టేట్మెంట్స్ ఇప్పించింది. బేషరతుగా ఇచ్చాను. నా కెరీర్ కన్నా తనే ముఖ్యమనుకొని. కానీ అదే స్టేట్మెంట్ తనను ఇవ్వమంటే ఇవ్వకుండా దాటవేసింది. అయినా నేను ప్రశ్నించలేదు. ఆమె ఎక్సెంట్రిక్ బిహేవియర్‌ను ఆడవాళ్ల భావోద్వేగాల కోణంలోంచే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. కానీ దాన్ని ఆమె అడ్వాంటేజ్‌గా తీసుకుంది. దాంతో కంగనాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. పసిగట్టింది తను. వెంటనే నన్ను సునీత మీనన్ అనే జ్యోతిష్యురాలి దగ్గరకు పట్టుకెళ్లింది. మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, మా ఇద్దరి బంధం ఇద్దరికీ కలిసి వస్తుందని చెప్పించింది. ఆ మాటలు నమ్మి నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా. షరా మామూలే. పొంతన కుదరని ఆమె ప్రవర్తనతో నాకు కన్ఫ్యూజనూ మామూలే. ఈసారి నావల్ల కాలేదు. నాతో డేటింగ్ చేస్తూనే హృతిక్ రోషన్ మీద మనసు పెట్టుకుంది. ఆమె అతనికి రాసిన మెయిల్స్ నా కంటబడ్డాయి. ఆమె ఆసక్తులు, లక్ష్యాలు వేరని, మాది నిలబడే రిలేషన్ కాదనీ స్పష్టమైంది. ఆ ఇంట్లోంచి వచ్చేశా. దాన్నీ తనకు అనుకూలంగానే మలచుకుంది కంగనా. చెప్పాపెట్టకుండా ఆమెను వదిలేసి వెళ్లిపోయానని ప్రచారం చేసి సింపతీ పొందింది. సినిమా చాన్స్‌ల కోసం నేను తనను వాడుకున్నాననీ కామెంట్ చేసింది. బ్రేకప్‌తో ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్లిపోయిన నాకు ఆమె మాటలతో మరింత నిస్పృహ ఆవహించింది. తిప్పికొట్టే ఓపిక, సమర్థించుకునే శక్తీ అడుగంటిపోయాయి. ‘లూజర్’ అనే మాట వినీవినీ నా మీద నేనే నమ్మకం కోల్పోయా. తర్వాత ఆలోచిస్తే అనిపించింది.. ఎవరు ఎవరిని వాడుకున్నారు అని. తను నాకు పరిచయం అయ్యేనాటికి ఆమె స్టారేం కాదు. కానీ నాకు స్టార్డమ్ బ్యాక్‌గ్రౌండ్ అయినా ఉంది కదా ( తండ్రి శేఖర్ సుమన్ పేరున్న నటుడు) వాడుకోవాలనుకుంటే’ అంటాడు అధ్యయన్ సుమన్. లవ్ ఫెయిల్యూర్‌తో మందుకు, సిగరెట్‌కు బానిసయ్యాడు అధ్యయన్. తల్లిదండ్రుల సహాయంతో బయటపడ్డాడు. కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ అధ్యాయం తర్వాత కంగనా ప్రయాణమూ ఆగలేదు. ‘జీవితంలో ప్రేమతో నాకు చేదు అనుభవాలే ఉన్నప్పటికీ ప్రేమలో పడని రోజులు నాకు గుర్తులేవు. ప్రేమిస్తూనే ఉంటాను.. దెబ్బతింటూనే ఉంటాను.. నిలబడ్తాను .. మళ్లీ ప్రేమలో పడ్తాను. ప్రేమ జీవితేచ్ఛను కలిగిస్తుంది ’ అంటుంది కంగనా రనౌత్. -ఎస్సార్ -
డ్రగ్స్‌కు బానిసగా మారాను: కంగనా
"నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే ముంబై వదిలి వెళ్లిపోతా" అన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. గతంలో చేదు అనుభవాల గురించి మాట్లాడిన వీడియో ఆమెను పెద్ద ఇరకాటంలో పడేసింది. ఈ ఏడాది మార్చిలో కంగనా తన జీవితంలోని చెడు అధ్యాయాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. 15 ఏళ్లకే ఇల్లు విడిచి పారిపోయానన్నారు. ఆ తర్వాత రెండేళ్లకే సినిమా స్టార్‌ను అయ్యానని చెప్పారు. యుక్త వయసు వచ్చేసరికి డ్రగ్స్‌కు కూడా బానిసగా మారిపోయానని చెప్పుకొచ్చారు. అప్పుడు తన జీవితమంతా గందరగోళంగా మారిపోయిందని, తాను తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడ్డానని గ్రహించానని తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. (చదవండి: కంగన వెనుక ఎవరున్నారు?) కంగనా వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కాగా సుశాంత్ ఆత్మహత్య కేసు మొదలు కంగనాకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలో కంగనా ముంబైని పీఓకేతో పోల్చడం, బీఎంసీ అధికారులు కంగనా ఆఫీసును పాక్షికంగా కూల్చివేయడం వంటి ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. అంతేకాకుండా 2016లో కంగనా మాజీ ప్రియుడు అధ్యాయన్ సుమన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. (చదవండి: చిన్నప్పుడే డ్రగ్స్‌కు బానిసగా మారాను: కంగనా) కంగనా మాజీ ప్రియుడి ఇంటర్వ్యూ వైరల్ కంగనా తనను కొకైన్ తీసుకోవాలని ఒత్తిడి చేసిందని, ఆమె మాదక ద్రవ్యాలను సేవించిందంటూ సుమన్ పలు సంచలన విషయాలను వెల్లడించాడు. దీంతో ఈ వీడియోల ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం కంగనాపై దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు సుశాంత్ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో నటి రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆమె 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించగా.. వారికి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు కూడా వినిపిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: లక్ష్మీభాయ్ పాత్ర చేస్తే లక్ష్మీభాయ్ అయిపోతారా?) View this post on Instagram #KanganaRanaut talks about the time when she couldn’t close her eyes because tears won’t stop. 🙏🙏 A post shared by Kangana Ranaut (@kanganaranaut) on Mar 29, 2020 at 1:27am PDT -
ఆమెతో విడిపోయాక సంతోషంగా ఉన్నా: హీరో
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, అధ్యాయన్ సుమన్ బ్రేకప్ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కంగనాతో విడిపోవడంపై మరోసారి సుమన్ స్పందిస్తూ.. ‘కంగనాతో విడిపోయాక చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో ఆ ఘట్టం దాటి చాలా మైళ్లు ముందుకు వెళ్లాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఇప్పడు మొరదాబాద్ ఘటనపై కంగనా సోదరి రంగోలీ చందేల్ చేసిన వివాదస్పద ట్వీట్ అనంతరం ఆమె ట్విటర్ ఖాతా రద్దయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి దీనిపై బాలీవుడ్ నటులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో కంగనా, సుమన్ బ్రేకప్ విషయం మరోసారి వార్తల్లోకెక్కింది. (రంగోలికి మద్దతు.. కంగనా రనౌత్‌పై కేసు) కంగనా, సుమన్‌ల బ్రేకప్‌పై ఇటీవలనటి కవితా కౌశిక్ స్పందించారు. కంగనా, సుమన్‌తో విడిపోయిన సమయంలో అతడిని ఆమె విమర్శించిన తీరు చాలా బాధాకరం అన్నారు. సుమన్, అతని తండ్రి శేఖర్ సుమన్‌లు కంగనా క్షమాపణలకు అర్హులని కూడా పేర్కొన్నారు. సుమన్‌తో బ్రేకప్ సమయంలో అతని కుటుంబంపై కంగనా ఆమె సోదరి రంగోలీలు తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా అతని కుటుంబాన్ని ఎన్నో రకాలుగా బాధపెట్టిన తీరు ‘హృదయ విధారకం’ అంటూ ట్వీట్ చేశారు. ఇక దీనిపై సుమన్ స్పందిస్తూ.. కవిత మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేగాక అప్పట్లో తనని విమర్శిస్తూ వచ్చిన వార్తలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుమన్ దీనిపై ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘కంగనాతో విడిపోయే సయంలో తనకు ఎవరూ మద్దతుగా లేరు. అప్పుడు నేను కఠిన పరిస్థితులను చుశాను. తను నన్ను నా కుటుంబాన్ని చాలా బాధపెట్టింది. ఆమెతో విడిపోయాక నా జీవితం చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు జీవితంలో చాలా ముందుకు వెళ్లాను. అప్పుడు నేను ఎదుర్కొన్న విమర్శలకు కారణమైనవారు నాకు క్షమాపణలు చెప్పారా లేదా అన్నది నాకు అవసరం లేదు’’ అని వెల్లడించాడు. కాగా ‘రాజ్: ది మిస్టరీ కంటీన్యూస్’ సినిమా షూటింగ్లో సుమన్, కంగనాలు ప్రేమలో పడ్డారు. కంగనాతో విడిపోయే సమయంలో ఆమె తనపై తీవ్ర విమర్శలు చేశారని అంతేగాక తనకు చేతబడి కూడా చేయించిందంటూ చేసిన సుమన్ వ్యాఖ్యలు అప్పట్లో విపరితంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. -
చేతబడి ప్రాక్టీస్ చేసిన హీరోయిన్!
చేతబడి, క్షుద్రవిద్యలాంటి మూఢనమ్మకాలను మారుమూల గ్రామాల్లో చదువుకోని ప్రజలే కాదు.. సినిమాల్లో అత్యద్భుతమైన పాత్రలు చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్న హీరోయిన్ సైతం నమ్ముతోందా? ఏకంగా ఇంట్లోనే చేతబడి లాంటి క్షుద్రవిద్యల్ని ఔపోసన పడుతోందా? అంటే తాజాగా అవునని అంటున్నాడు బాలీవుడ్ హీరో అధ్యాయన్ సుమన్. కంగన తన ఇంట్లోనే చేతబడిలాంటి క్షుద్రపూజలు చేసేదని అతను తాజాగా వెల్లడించాడు. క్షుద్రపూజల కోసం ఆమె తన అపార్ట్మెంట్లో ఓ గది కూడా ఉందని చెప్పాడు. కంగనా రనౌత్‌కు ఈ మధ్య కాలం కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే హీరో హృతిక్ రోషన్‌తో ఆమె గొడవ రోజూ మీడియాలో రచ్చ చేస్తుండగా తాజాగా ఆ మాజీ ప్రియుడు అధ్యాయన్ సుమన్ సంచలన విషయాలు వెల్లడించాడు. 2008లో 'రాజ్: ద మిస్టరీ కంటిన్యూస్' సినిమా సందర్భంగా సుమన్, కంగన ఏడాది పాటు డేటింగ్ చేశారు. కంగన మాజీ లవర్ ఆదిత్య పంచోలీ సూచనలు పెడచెవిన పెట్టి తాను కంగనాను ప్రేమించానని, కానీ ఒక రోజు తను ఇంటికి పిలిచి క్షుద్రపూజల్లో పాల్గొనేలా చేసిందని వివరించాడు. 'ఓరోజు రాత్రి కొన్ని పూజలు చేసేందుకు కంగన తన ఇంటికి పిలిచింది. రాత్రి 11.30 గంటలకు నేను వెళ్లాను. అర్ధరాత్రి 12 గంటలకు పూజ ప్రారంభమైంది. తన అపార్ట్మెంట్లో ఆమెకు ఒక చిన్న గెస్ట్ రూమ్ ఉంది. ఆ గది పూర్తిగా నల్లరంగుతో ఉంటుంది. కర్టెన్లు కూడా నల్లరంగులోనే ఉంటాయి. అక్కడ కొన్ని దేవుళ్ల బొమ్మలు ఉన్నాయి. వాటిచుట్టూ మంటలు ఎగుస్తున్నాయి. పూజలో కొన్ని భయంకరమైనవి చేసింది. నేను చాలా భయపడిపోయాను. నేనేమీ చేయలేకపోయాను. వెంటనే బయటకు వచ్చి చేసిన పూజ చాలు అని చెప్పాను. దాంతో తను పల్లవితో మాట్లాడటం ప్రారంభించింది. పల్లవి ఓ రోజు రాత్రి 12 గంటలకు శ్మశానానికి వెళ్లాల్సిందిగా నన్ను కోరింది. నేను వణికిపోయాను. ఇక ఎప్పుడు అక్కడికి వెళ్లలేదు' అని సుమన్ వివరించాడు. ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిసి ఎంతో ఆందోళన చెందారని, కుటుంబ పూజారిని పిలిచి, ఆయనకు ఈ విషయం చెప్పారని సుమన్ చెప్పుకొచ్చాడు. 'నీ కోసం ఆమె అన్నం వండుతుందా? అని పూజారి అడిగాడు. అవును అని చెప్పాను. ఆ అన్నంలో ఆమె తన మలినమైన రక్తం కలిపి క్షుద్రపూజల కోసం వండేదని పూజారి చెప్పాడు. లండన్, న్యూయార్క్లాంటి దేశాల్లో చదివి, మెట్రోపాలిటన్ కిడ్ అయిన తాను ఇవన్ని విశ్వసించలేదు. కానీ రాశిఫలాలు చూసే ఓ మహిళ నీపై చేతబడి జరిగిందని, పహడి ప్రాంతానికి చెందిన ఓ మహిళ చేతబడి చేస్తున్నదని తెలిపింది. వెంటనే ఆ అనుబంధం నుంచి బయటపడాలని సూచించింది. అప్పట్లో నాకు తెలిసి హిమాచల్ ప్రదేశ్‌కు తరచూ వెళ్లే వ్యక్తి నా గర్ల్‌ఫ్రెండ్ కంగనానే. అప్పటినుంచి తనతో అనుబంధం నుంచి బయటపడాలని చాలా ప్రయత్నించాను. ఆ క్రమంలో ఎంతో మానసిక, శరీరక క్షోభ అనుభవించాను' అంటూ సమన్ డీఎన్ఏ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 'రాజ్ 2' సినిమా తర్వాత తన కెరీర్ పూర్తిగా పతనమవ్వగా, అదే సమయంలో కంగన సినిమాలు మాత్రం విజయవంతమయ్యాయని, వాటి గురించి మాట్లాడలంటేనే తనకు భయం అవుతున్నదని అతను చెప్పుకొచ్చాడు.