"నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే ముంబై వదిలి వెళ్లిపోతా" అన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. గతంలో చేదు అనుభవాల గురించి మాట్లాడిన వీడియో ఆమెను పెద్ద ఇరకాటంలో పడేసింది. ఈ ఏడాది మార్చిలో కంగనా తన జీవితంలోని చెడు అధ్యాయాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. 15 ఏళ్లకే ఇల్లు విడిచి పారిపోయానన్నారు. ఆ తర్వాత రెండేళ్లకే సినిమా స్టార్‌ను అయ్యానని చెప్పారు. యుక్త వయసు వచ్చేసరికి డ్రగ్స్‌కు కూడా బానిసగా మారిపోయానని చెప్పుకొచ్చారు. అప్పుడు తన జీవితమంతా గందరగోళంగా మారిపోయిందని, తాను తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడ్డానని గ్రహించానని తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. (చదవండి: కంగన వెనుక ఎవరున్నారు?)
కంగనా వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం
కాగా సుశాంత్ ఆత్మహత్య కేసు మొదలు కంగనాకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ క్రమంలో కంగనా ముంబైని పీఓకేతో పోల్చడం, బీఎంసీ అధికారులు కంగనా ఆఫీసును పాక్షికంగా కూల్చివేయడం వంటి ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా వీడియో బయటకు రావడం సంచలనంగా మారింది. అంతేకాకుండా 2016లో కంగనా మాజీ ప్రియుడు అధ్యాయన్ సుమన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. (చదవండి: చిన్నప్పుడే డ్రగ్స్‌కు బానిసగా మారాను: కంగనా)
కంగనా మాజీ ప్రియుడి ఇంటర్వ్యూ వైరల్
కంగనా తనను కొకైన్ తీసుకోవాలని ఒత్తిడి చేసిందని, ఆమె మాదక ద్రవ్యాలను సేవించిందంటూ సుమన్ పలు సంచలన విషయాలను వెల్లడించాడు. దీంతో ఈ వీడియోల ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం కంగనాపై దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు సుశాంత్ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో నటి రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆమె 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించగా.. వారికి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు కూడా వినిపిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: లక్ష్మీభాయ్ పాత్ర చేస్తే లక్ష్మీభాయ్ అయిపోతారా?)
Comments
Please login to add a commentAdd a comment