ఆమెతో విడిపోయాక సంతోషంగా ఉన్నా: హీరో | Adhyayan Suman Again Reacts Break Up With Kangana Ranaut | Sakshi
Sakshi News home page

అప్పుడు కఠిన పరిస్థితులు చుశా: అధ్యాయన్‌ సుమన్‌

Published Tue, Apr 28 2020 7:00 PM | Last Updated on Tue, Apr 28 2020 11:39 PM

Adhyayan Suman Again Reacts Break Up With Kangana Ranaut - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌, అధ్యాయన్‌ సుమన్‌ బ్రేకప్‌ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కంగనాతో విడిపోవడంపై మరోసారి సుమన్‌ స్పందిస్తూ.. ‘కంగనాతో విడిపోయాక చాలా సంతోషం‍గా ఉన్నాను. నా జీవితంలో ఆ ఘట్టం దాటి చాలా మైళ్లు ముందుకు వెళ్లాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఇప్పడు మొరదాబాద్‌ ఘటనపై కంగనా సోదరి రంగోలీ చందేల్‌ చేసిన వివాదస్పద ట్వీట్‌ అనంతరం ఆమె ట్విటర్‌ ఖాతా రద్దయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి దీనిపై బాలీవుడ్‌ నటులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో కంగనా, సుమన్‌ బ్రేకప్‌ విషయం మరోసారి వార్తల్లోకెక్కింది. (రంగోలికి మద్దతు.. కంగనా రనౌత్‌పై కేసు)

కంగనా, సుమన్‌ల బ్రేకప్‌పై ఇటీవలనటి కవితా కౌశిక్‌ స్పందించారు. కంగనా, సుమన్‌తో విడిపోయిన సమయంలో అతడిని ఆమె విమర్శించిన తీరు చాలా బాధాకరం అన్నారు. సుమన్‌‌, అతని తండ్రి శేఖర్‌ సుమన్‌లు కంగనా క్షమాపణలకు అర్హులని కూడా పేర్కొన్నారు. సుమన్‌తో బ్రేకప్‌ సమయంలో అతని కుటుంబంపై కంగనా ఆమె సోదరి రంగోలీలు తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా అతని కుటుంబాన్ని ఎన్నో రకాలుగా బాధపెట్టిన తీరు ‘హృదయ విధారకం’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇక దీనిపై సుమన్ స్పందిస్తూ.. కవిత మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేగాక అప్పట్లో తనని విమర్శిస్తూ వచ్చిన వార్తలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

సుమన్‌ దీనిపై ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘కంగనాతో విడిపోయే సయంలో తనకు ఎవరూ మద్దతుగా లేరు. అప్పుడు నేను కఠిన పరిస్థితులను చుశాను. తను నన్ను నా కుటుంబాన్ని చాలా బాధపెట్టింది. ఆమెతో విడిపోయాక నా జీవితం చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు జీవితంలో చాలా ముందుకు వెళ్లాను. అప్పుడు నేను ఎదుర్కొన్న విమర్శలకు కారణమైనవారు నాకు క్షమాపణలు చెప్పారా లేదా అన్నది నాకు అవసరం లేదు’’ అని వెల్లడించాడు. కాగా ‘రాజ్: ది మిస్టరీ కంటీన్యూస్’‌ సినిమా షూటింగ్‌లో సుమన్‌, కంగనాలు ప్రేమలో పడ్డారు. కంగనాతో విడిపోయే సమయంలో ఆమె తనపై తీవ్ర విమర్శలు చేశారని అంతేగాక తనకు చేతబడి కూడా చేయించిందంటూ చేసిన సుమన్‌ వ్యాఖ్యలు అప్పట్లో విపరితంగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement