Kavita Kaushik
-
సీరియల్స్, రియాలిటీ షో వల్ల రాగద్వేషాలు.. ఇక నా వల్ల కాదు: నటి
నటి కవిత కౌశిక్ బుల్లితెర ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. టీవీ కంటెంట్‌లో కొత్తదనం లోపించిందని, ఇంకా ఇక్కడే ఉండిపోవడం సబబు కాదని అభిప్రాయపడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఒకప్పుడు టీవీ కంటెంట్ ప్రోగ్రెసివ్‌గా ఉండేది. రకరకాల షోలతో, విభిన్న కంటెంట్‌తో అందరికీ వినోదాన్ని పంచింది. క్షమించండికానీ ఇప్పుడు.. యంగ్ జనరేషన్ టీవీ చూడటానికి వీల్లేదన్నట్లుగా చెడు కంటెంట్ ఉంటోంది. టీవీ ఇండస్ట్రీ పురోగమనం నుంచి తిరోగమనం వైపు వెళ్తోంది. రియాలిటీ షో, సీరియల్స్ చూసి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. అందులో నేను కూడా భాగమయ్యాను. అందుకు నన్ను క్షమించండి. ఇప్పుడైతే నేనిక్కడ ఉండలేను. బుల్లితెరను వీడుతున్నాను' అని కవిత చెప్పుకొచ్చింది.మార్పు మొదలైందా?టీవీ ఇండస్ట్రీ పరిస్థితుల గురించి తాజాగా నటి సుంబుల్ టకీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఎప్పుడూ పాతచింతకాయ పచ్చడే అంటే ఎవరు మాత్రం టీవీ చూస్తారు? కాస్త కొత్తదనం ఉండాలి. రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ఇప్పుడిప్పుడే మార్పు మొదలవుతోంది. కొత్త కథలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రచయితలు.. యదార్థ ఘటనలను, నిజ జీవిత సమస్యలపై ఫోకస్ చేయాలి. కాలం మారేకొద్దీ జనాలు రీల్ లైఫ్ కన్నా రియల్ లైఫ్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వారి అభిరుచులకు అనుగుణంగా కంటెంట్‌లో మార్పుచేర్పులు చేయాలి అని పేర్కొంది.నటి కవితా కౌశిక్అది కూడా సమస్యేనటుడు అర్జున్ బిజ్లానీ మాట్లాడుతూ.. ఇక్కడ బడ్జెట్ కూడా ఒక సమస్యే.. నిర్మాతలు తక్కువ బడ్జెట్‌తోనే సీరియల్స్, షో అయిపోవాలని చూస్తారు. దీంతో ఆయా షోలను క్రియేటివ్‌గా ఎలా చేయాలన్నదానికన్నా తక్కువ బడ్జెట్లో ఎలా పూర్తి చేయాలన్నదానిపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఎవరో ఒకరి దగ్గరి నుంచి మార్పు మొదలవుతేనే మంచిరోజులు వస్తాయి అని ఆశిస్తున్నాడు.ఆ సీరియల్‌తో ఫేమస్కాగా కుటుంబ్ సీరియల్‌తో బుల్లితెరపై తన ప్రస్థానం ప్రారంభించిన కవిత ప్రియ కా ఘర్, కుంకుమ్- ఏక్ ప్యారా సా బంధన్, రీమిక్స్.. ఇలా అనేక సీరియల్స్‌లో నటించింది. ఎఫ్ఐఆర్ అనే కామెడీ సీరియల్లో పోషించిన ఎస్ఐ చంద్రముఖి చౌతాలా పాత్రతో బాగా ఫేమస్ అయింది. హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్లోనూ పాల్గొంది. ఏక్ హసీనా తి సినిమాతో వెండితెరపైనా ఎంట్రీ ఇచ్చింది. మ ఉంబై కటింగ్ (హిందీ మూవీ), వదయియాన్ జీవి వదయియాన్, క్యారీ ఆన్ జట్ట 3 వంటి పంజాబీ సినిమాల్లోనూ మెరిసింది. రామ్‌చరణ్ తుఫాన్ సినిమాలో షకీలా సెంటు అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది.చదవండి: పాక్ నటులపై బ్యాన్.. అంతా రాజకీయమే!: బాలీవుడ్ నటుడు -
‘కుక్కలా ఉన్నావ్’ : బిగ్‌బాస్ ఫేమ్‌పై ట్రోలింగ్
ముంబై: ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలు తరచూ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. నెటిజన్లు శ్రుతిమించి మరీ వారిపై కామెంట్లు చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ రియాలిటీ షో ఫేమ్, ఎఫ్ఐఆర్ నటి కవితా కౌశిక్‌ను నెటిజన్లు టార్గెట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమెను కొందరు నెటిజన్లు ‘నువ్వు కుక్కలా ఉన్నావంటూ’ అసభ్య పదజాలంతో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో మనస్తాపానికి గురైన కవితా కౌశిక్ ముంబై పోలీసులు, మహరాష్ట్ర సైబర్ సెల్ అధికారులకు ఆశ్రయించింది. ఆ చాట్లను స్క్రీన్‌షాట్ తీసి వాటిని పోలీసులకు చూపించింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు ట్రోలింగ్‌కు గురవ్వడం కొత్తేం కాదు.. ఇదివరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, పరిణితి చొప్రా, తాప్సీ పన్ను, ఈషాగుప్తా, మల్లికా షెరావత్లు నెటిజన్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. కాగా, కవితా కౌశిక్ బిగ్ బాస్-14 రియాలిటి షోలో రుబినా దిలైక్, అభినవ్ శుక్లాతో తరచు వివాదాలతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఈ సీజన్ రుబీనా దిలైక్ ట్రోఫితో పాటు, 36 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: బిగ్‌బాస్ ఐదో సీజన్: టాప్ కంటెస్టెంట్లు వీళ్లేనా! -
బిగ్‌బాస్: అర్ధాంతరంగా వెళ్లిపోయిన నటి
గొడవలు లేకుండా బిగ్‌బాస్ షోను ఊహించుకోవడం కష్టం. కానీ ఆ గొడవలు శ్రుతిమించితేనే మరీ కష్టం. హిందీ బిగ్‌బాస్ పద్నాలుగో సీజన్ గొడవలకు నిలయంగా మారింది. కంటెస్టెంట్లు చీటికీమాటికీ, అయినదానికీ కానిదానికీ తగవు పడుతూనే ఉన్నారు. తాజాగా నటి కవితా కౌశిక్, రుబీనా మధ్య గొడవ రాజుకుంది. 'నీ భర్త గురించి ఓ నిజం తెలుసా?' అని కవిత రుబీనాను భయపెట్టేందుకు ప్రయత్నించగా.. నీకంత ధైర్యం ఉంటే చెప్పు అని రుబీనా సమాధానం ఇచ్చింది. దీంతో కవితా ఇప్పుడు కాదు, ఈ హౌస్ బయటకు వెళ్లాక గుట్టు విప్పుతానని వార్నింగ్ ఇచ్చింది. (చదవండి: మోనాల్‌తో మాట్లాడమని అభికి చెప్పేవాళ్లం: లాస్య) ఈ క్రమంలో ఇద్దరూ.. నువ్వంటే నువ్వు నోరు మూసుకోమంటూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. రుబీనా భర్త అభినవ్ శుక్లా అక్కడే ఉన్నప్పటికీ వీరి గొడవలో తలదూర్చాలనుకోలేదు. అటు వీరి ప్రవర్తనతో బిగ్‌బాస్‌కు కూడా చిర్రెత్తినట్లుంది. ఇంటి నిబంధనలను పాటించడం ఇష్టం లేకపోతే తక్షణమే వెళ్లిపోవచ్చని హౌస్ గేట్లు తెరిచాడు. దీంతో ఆవేశంతో ఊగిపోతున్న కవిత మరేం ఆలోచించకుండా ప్రధాన ద్వారం నుంచి బయటకు వెళ్లింది. దీంతో హౌస్మేట్లు ఒక్కసారిగా షాకయ్యారు. మరి కవిత తిరిగి లోపలకు వస్తుందా? లేక ఆమె షో నుంచి శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్నట్లేనా అన్నది తెలియాలంటే నేటి హిందీ బిగ్‌బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే! (చదవండి: ఆ బిగ్‌బాస్ కంటెస్టెంటు నా భార్య, మోసం చేసింది) View this post on Instagram A post shared by ColorsTV (@colorstv) -
ఆమెతో విడిపోయాక సంతోషంగా ఉన్నా: హీరో
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్, అధ్యాయన్ సుమన్ బ్రేకప్ విషయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కంగనాతో విడిపోవడంపై మరోసారి సుమన్ స్పందిస్తూ.. ‘కంగనాతో విడిపోయాక చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో ఆ ఘట్టం దాటి చాలా మైళ్లు ముందుకు వెళ్లాను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఇప్పడు మొరదాబాద్ ఘటనపై కంగనా సోదరి రంగోలీ చందేల్ చేసిన వివాదస్పద ట్వీట్ అనంతరం ఆమె ట్విటర్ ఖాతా రద్దయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి దీనిపై బాలీవుడ్ నటులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో కంగనా, సుమన్ బ్రేకప్ విషయం మరోసారి వార్తల్లోకెక్కింది. (రంగోలికి మద్దతు.. కంగనా రనౌత్‌పై కేసు) కంగనా, సుమన్‌ల బ్రేకప్‌పై ఇటీవలనటి కవితా కౌశిక్ స్పందించారు. కంగనా, సుమన్‌తో విడిపోయిన సమయంలో అతడిని ఆమె విమర్శించిన తీరు చాలా బాధాకరం అన్నారు. సుమన్, అతని తండ్రి శేఖర్ సుమన్‌లు కంగనా క్షమాపణలకు అర్హులని కూడా పేర్కొన్నారు. సుమన్‌తో బ్రేకప్ సమయంలో అతని కుటుంబంపై కంగనా ఆమె సోదరి రంగోలీలు తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా అతని కుటుంబాన్ని ఎన్నో రకాలుగా బాధపెట్టిన తీరు ‘హృదయ విధారకం’ అంటూ ట్వీట్ చేశారు. ఇక దీనిపై సుమన్ స్పందిస్తూ.. కవిత మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేగాక అప్పట్లో తనని విమర్శిస్తూ వచ్చిన వార్తలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుమన్ దీనిపై ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘కంగనాతో విడిపోయే సయంలో తనకు ఎవరూ మద్దతుగా లేరు. అప్పుడు నేను కఠిన పరిస్థితులను చుశాను. తను నన్ను నా కుటుంబాన్ని చాలా బాధపెట్టింది. ఆమెతో విడిపోయాక నా జీవితం చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు జీవితంలో చాలా ముందుకు వెళ్లాను. అప్పుడు నేను ఎదుర్కొన్న విమర్శలకు కారణమైనవారు నాకు క్షమాపణలు చెప్పారా లేదా అన్నది నాకు అవసరం లేదు’’ అని వెల్లడించాడు. కాగా ‘రాజ్: ది మిస్టరీ కంటీన్యూస్’ సినిమా షూటింగ్లో సుమన్, కంగనాలు ప్రేమలో పడ్డారు. కంగనాతో విడిపోయే సమయంలో ఆమె తనపై తీవ్ర విమర్శలు చేశారని అంతేగాక తనకు చేతబడి కూడా చేయించిందంటూ చేసిన సుమన్ వ్యాఖ్యలు అప్పట్లో విపరితంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. -
ఫేస్బుక్లో నగ్న ఫొటోలు.. క్విట్ అయిన నటి
సాక్షి, ముంబై : ప్రముఖ హిందీ నటి కవిత కౌశిక్ ఫేస్‌బుక్‌పై మండిపడ్డారు. పనికిమాలిన పనులు చేసేందుకు తప్ప ఫేస్బుక్ దేనికీ పనికిరాదని దుమ్మెత్తి పోశారు. ఫేస్బుక్లో దర్శనమిచ్చిన తన మార్ఫింగ్ నగ్నఫొటోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫేస్బుక్ నుంచి తప్పుకున్నారు. సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి వాడుతున్న ఫేస్బుక్ నుంచి ఎప్పుడో క్విట్ అవుదామనుకున్నానని చెప్పారు. ఇలాంటి ఫొటోలు పెట్టి కొందరు తన పరువును బజారుకీడ్చే దిగజారుడు చర్యలకు పూనుకుంటారని ఊహించలేక పోయానని వాపోయారు. అందుకనే క్విట్ అవుతున్నాననీ, సోషల్ మీడియాకు దూరంగా ఉందామనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఉద్ధరించొద్దు..! ‘పక్కనే ఉండే స్నేహితులు ఎక్కడో ఉండే అపరిచిత వ్యక్తులతో వాదులాడుకోవడం.. మన సహోద్యోగులు ఏదో ఉద్ధరిస్తామంటూ దేశాన్నేలే నేతల గురించి తెగ ఇదై పోవడం.. ఇదంతా మన విలువైన సమయాన్ని ఫేస్‌బుక్‌కు కట్టబెట్టడమేన’ని కవిత అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా చేస్తున్న చేటును, తన అభిప్రాయాలను ఆమె వెల్లడించారు. మనందరి కాలాన్ని హరించే రాక్షసి ఈ ఫేస్బుక్ అని పేర్కొన్నారు. ఈ ఫేస్బుక్లో కుళ్లు రాజకీయాలు విడిచిపెట్టి కావాలంటే తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. తగిన ఆతిథ్యంతో పాటు పనికొచ్చే విషయమేదైనా సరే కాసేపు మాట్లాడుకుందామని వ్యాఖ్యానించారు. పక్కనోడితే పలకరింపులు లేకుండా చేస్తున్ నఫేస్బుక్కు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కాగా, ఫేక్‌బుక్ విత్ కవితా, కుటుంబ్, కహానీ ఘర్ ఘర్ హై, తుమ్హారీ దిశా, రీమిక్స్, సీఐడీ, ఎఫ్ఐఆర్, ఏక్ ప్యారా సా బందన్, సావ్దాన్ వంటి సీరియళ్లలో నటించి కవిత మంచి పేరు తెచ్చుకున్నారు. ఏక్ హసీనా థి, ముంబై కటింగ్, ఫిలిం సిటీ, జంజీర్ వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఆమె రోనిత్ బిస్వాస్‌ను పెళ్లాడారు. -
‘మా ఇద్దరి మధ్య అంతకుమించి ఏం లేదు’
హిందీ టీవీ తారలు కవితా కౌశిక్, నవాబ్ షా ఆకస్మికంగా గత జూలైలో విడిపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. మతం కారణంగానే వీరు విడిపోయారని ఊహాగానాలు వచ్చాయి. నవాబ్ వేరే మతానికి చెందిన వాడు కావడంతో పెళ్లికి కవిత తల్లిదండ్రులు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో వాస్తవం లేదని నవాబ్ తెలిపాడు. ‘మతం ఆధారంగా ఇలాంటి వదంతులు ఎందుకు పుట్టిస్తారో అర్థం కావడం లేదు. చాలా కాలంగా ఉన్న పొరపొచ్చాల వల్లే కవిత, నేను విడిపోయాం. మేమిద్దరం బలమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్లం. వయసు, మతం అనేవి ప్రేమకు అడ్డురావు. ఆడమగ కలిసి పనిచేసే ముంబై లాంటి మెట్రోనగరాల్లో ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. కవిత, నేను ఐదేళ్లు కలిసివున్నాం. ఇప్పుడు ఎవరు దారులు వారు చూసుకున్నాం. ఇంతకుమించి ఏం జరగలేద’ని నవాబ్ వెల్లడించాడు. కవిత నుంచి విడిపోయిన నవాజ్ లాస్ ఏంజెలెస్ కు చెందిన సినిమాటోగ్రాఫర్ దియా బాల్కీకు దగ్గరయ్యాడు. డాన్ 2, దిల్ వాలే సినిమాల్లో నవాబ్ నటించాడు. కవిత కూడా తన పాత స్నేహితుడు రోనిత్ బిశ్వాస్ తో ప్రేమాయణం సాగిస్తోంది. కొత్త జీవితంలో నవాబ్ సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించింది.