
ముంబై: ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబ్రెటీలు తరచూ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. నెటిజన్లు శ్రుతిమించి మరీ వారిపై కామెంట్లు చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్ రియాలిటీ షో ఫేమ్, ఎఫ్‌ఐఆర్ నటి కవితా కౌశిక్‌ను నెటిజన్లు టార్గెట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమెను కొందరు నెటిజన్లు ‘నువ్వు కుక్కలా ఉన్నావంటూ’ అసభ్య పదజాలంతో ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో మనస్తాపానికి గురైన కవితా కౌశిక్ ముంబై పోలీసులు, మహరాష్ట్ర సైబర్ సెల్ అధికారులకు ఆశ్రయించింది. ఆ చాట్‌లను స్క్రీన్‌షాట్ తీసి వాటిని పోలీసులకు చూపించింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
కాగా, సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలు ట్రోలింగ్‌కు గురవ్వడం కొత్తేం కాదు.. ఇదివరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, పరిణితి చొప్రా, తాప్సీ పన్ను, ఈషాగుప్తా, మల్లికా షెరావత్‌లు నెటిజన్లు ట్రోలింగ్‌కు గురయ్యారు. కాగా, కవితా కౌశిక్ బిగ్ బాస్-14 రియాలిటి షోలో రుబినా దిలైక్, అభినవ్ శుక్లాతో తరచు వివాదాలతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఈ సీజన్ రుబీనా దిలైక్ ట్రోఫితో పాటు, 36 లక్షల ప్రైజ్‌మనీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
చదవండి: బిగ్‌బాస్ ఐదో సీజన్: టాప్ కంటెస్టెంట్లు వీళ్లేనా!
Comments
Please login to add a commentAdd a comment