Bigg Boss Urfi Javed Trolled For Wearing Dress Goes Viral - Sakshi
Sakshi News home page

Urfi Javed: ‘అసలు దాన్ని డ్రెస్‌ అంటారా’.. బాలీవుడ్ నటిపై విపరీత ట్రోలింగ్

Published Thu, Nov 18 2021 9:17 PM | Last Updated on Fri, Dec 17 2021 10:00 PM

Bigg Boss Urfi Javed Trolled For Wearing Dress Goes Viral - Sakshi

ఇటీవల సెలబ్రిటీలు వెండితెర మీదే కాకుండా సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో తారలు తమ అభిమానులతో చాట్‌ చేయడంతో పాటు వారి పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంటారు. కొందరు షేర్  చేసే వీడియోలు.. ఒక్కోసారి పాజిటివ్‌ కామెంట్స్‌ రాగా కొన్ని సార్లు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. తాజాగా ఓ బాలీవుడ్ నటి తన వీడియోను సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇంకేముంది ఆ వీడియో చూసిన నెటిజన్లు ఈ హాట్ బ్యూటీని విపరీతంగా ఆడేసుకుంటున్నారు.

అసలీ అమ్మ‌డేం చేసింది. ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే...? బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ అంటే పెద్దగా తెలియదేమో కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే మైండ్‌లో టక్కున గుర్తు వస్తుంది. బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లిన ఈ అమ్మడు ఫుల్‌ ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ట్రెండీ హీరోయిన్‌గా మారింది. దీంతో ఆమెకు ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగారు.

తాజాగా ఈ బ్యూటీ ఓ డ్రెస్ వేసుకొని కనిపించింది.దాదాపు 10 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియోలో ముందు ఒక డ్రెస్సులో కనిపించిన ఉర్ఫీ ఆ తరువాత జిప్ ఓపెన్ చేసి ఉన్న డ్రెస్సులో ప్రత్యక్షమవుతుంది. అయితే ఆ డ్రెస్‌ కాస్త అభ్యంతకరంగా ఉంది. ఈ  వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది షాక్ అవుతున్నారు. ఉర్ఫీ మరీ ఇలా కనిపిస్తుందని ఊహించలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఒకడుగు ముందుకేసి ‘డ్రెస్ ఓకే గానీ.. జిప్‌ వేసుకో’.. ‘అసలు దీన్ని డ్రెస్‌ అంటారా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి: ప్రేమను నేర్పింది నువ్వేగా...మాటలే దొరకడం లేదు : నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement