నటి కవిత కౌశిక్ బుల్లితెర ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. టీవీ కంటెంట్‌లో కొత్తదనం లోపించిందని, ఇంకా ఇక్కడే ఉండిపోవడం సబబు కాదని అభిప్రాయపడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఒకప్పుడు టీవీ కంటెంట్ ప్రోగ్రెసివ్‌గా ఉండేది. రకరకాల షోలతో, విభిన్న కంటెంట్‌తో అందరికీ వినోదాన్ని పంచింది.
క్షమించండి
కానీ ఇప్పుడు.. యంగ్ జనరేషన్ టీవీ చూడటానికి వీల్లేదన్నట్లుగా చెడు కంటెంట్ ఉంటోంది. టీవీ ఇండస్ట్రీ పురోగమనం నుంచి తిరోగమనం వైపు వెళ్తోంది. రియాలిటీ షో, సీరియల్స్ చూసి ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. అందులో నేను కూడా భాగమయ్యాను. అందుకు నన్ను క్షమించండి. ఇప్పుడైతే నేనిక్కడ ఉండలేను. బుల్లితెరను వీడుతున్నాను' అని కవిత చెప్పుకొచ్చింది.
మార్పు మొదలైందా?
టీవీ ఇండస్ట్రీ పరిస్థితుల గురించి తాజాగా నటి సుంబుల్ టకీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఎప్పుడూ పాతచింతకాయ పచ్చడే అంటే ఎవరు మాత్రం టీవీ చూస్తారు? కాస్త కొత్తదనం ఉండాలి. రియాలిటీకి దగ్గరగా ఉండాలి. ఇప్పుడిప్పుడే మార్పు మొదలవుతోంది. కొత్త కథలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రచయితలు.. యదార్థ ఘటనలను, నిజ జీవిత సమస్యలపై ఫోకస్ చేయాలి. కాలం మారేకొద్దీ జనాలు రీల్ లైఫ్ కన్నా రియల్ లైఫ్‌పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వారి అభిరుచులకు అనుగుణంగా కంటెంట్‌లో మార్పుచేర్పులు చేయాలి అని పేర్కొంది.
నటి కవితా కౌశిక్
అది కూడా సమస్యే
నటుడు అర్జున్ బిజ్లానీ మాట్లాడుతూ.. ఇక్కడ బడ్జెట్ కూడా ఒక సమస్యే.. నిర్మాతలు తక్కువ బడ్జెట్‌తోనే సీరియల్స్, షో అయిపోవాలని చూస్తారు. దీంతో ఆయా షోలను క్రియేటివ్‌గా ఎలా చేయాలన్నదానికన్నా తక్కువ బడ్జెట్‌లో ఎలా పూర్తి చేయాలన్నదానిపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఎవరో ఒకరి దగ్గరి నుంచి మార్పు మొదలవుతేనే మంచిరోజులు వస్తాయి అని ఆశిస్తున్నాడు.
ఆ సీరియల్‌తో ఫేమస్
కాగా కుటుంబ్ సీరియల్‌తో బుల్లితెరపై తన ప్రస్థానం ప్రారంభించిన కవిత ప్రియ కా ఘర్, కుంకుమ్- ఏక్ ప్యారా సా బంధన్, రీమిక్స్.. ఇలా అనేక సీరియల్స్‌లో నటించింది. ఎఫ్‌ఐఆర్ అనే కామెడీ సీరియల్‌లో పోషించిన ఎస్‌ఐ చంద్రముఖి చౌతాలా పాత్రతో బాగా ఫేమస్ అయింది. హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్‌లోనూ పాల్గొంది. ఏక్ హసీనా తి సినిమాతో వెండితెరపైనా ఎంట్రీ ఇచ్చింది. మ ఉంబై కటింగ్ (హిందీ మూవీ), వదయియాన్ జీవి వదయియాన్, క్యారీ ఆన్ జట్ట 3 వంటి పంజాబీ సినిమాల్లోనూ మెరిసింది. రామ్‌చరణ్ తుఫాన్ సినిమాలో షకీలా సెంటు అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది.
చదవండి: పాక్ నటులపై బ్యాన్.. అంతా రాజకీయమే!: బాలీవుడ్ నటుడు
Comments
Please login to add a commentAdd a comment