పాకిస్తాన్ నటులపై బ్యాన్ విధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాడు బాలీవుడ్ నటుడు రాజీవ్ ఖందేల్వాల్. వాళ్లు నటులు మాత్రమేనని, ఏజెంట్లు కాదని మండిపడ్డాడు. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయాల వల్లే పాక్ నటులపై నిషేధం విధించారు. ఇది చాలా తప్పు పెద్దు. ఆర్టిస్టులపై బ్యాన్ విధించడానికి రాజకీయ నాయకులకు ఏం హక్కు ఉంది? మనల్ని నిర్దేశించడానికి వీళ్లెవరు?
చిచ్చు పెట్టే పార్టీలు
వాళ్లు ఎప్పుడూ కూడా ఒకటే ఫాలో అవుతారు. రెండు దేశాల మధ్య ప్రేమ చిగురించడాన్ని అస్సలు ఒప్పుకోరు. అదెందుకో మరి నాకర్థం కాదు. మనమెప్పుడూ శాంతి, సామరస్యం అని మాట్లాడుతూ ఉంటాం. కానీ అవి ఉన్న చోట కూడా ఈ రాజకీయ పార్టీలు హిందూ, ముస్లిం అన్న కోణాన్ని తీసుకొస్తాయి. అదెంత దారుణం. పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్టిస్టులను ఏజెంట్లుగా ఏమీ పంపట్లేదు.
అది సరి కాదు
అయినా వారిని భారతీయ సినిమాల్లో నటించేదుకు ఒప్పుకోకపోవడం కరెక్ట్ కాదు అని అభిప్రాయపడ్డాడు. కాగా రాజీవ్.. కహీ తో హోగా, సచ్ కా సామ్నా అనే సీరియల్స్‌లో నటించాడు. 2008లో వచ్చిన ఆమిర్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. షైతాన్, టేబుల్ నెం.21 చిత్రాల్లో మెరిశాడు. ఇటీవల వచ్చిన షో టైమ్ వెబ్ సిరీస్ రెండో సీజన్‌లోనూ మెప్పించాడు.
చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్
Comments
Please login to add a commentAdd a comment