Rajeev Khandelwal
-
పాక్ నటులపై బ్యాన్.. అంతా రాజకీయమే!: బాలీవుడ్ నటుడు
పాకిస్తాన్ నటులపై బ్యాన్ విధించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాడు బాలీవుడ్ నటుడు రాజీవ్ ఖందేల్వాల్. వాళ్లు నటులు మాత్రమేనని, ఏజెంట్లు కాదని మండిపడ్డాడు. తాజాగా ఇతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయాల వల్లే పాక్ నటులపై నిషేధం విధించారు. ఇది చాలా తప్పు పెద్దు. ఆర్టిస్టులపై బ్యాన్ విధించడానికి రాజకీయ నాయకులకు ఏం హక్కు ఉంది? మనల్ని నిర్దేశించడానికి వీళ్లెవరు?చిచ్చు పెట్టే పార్టీలువాళ్లు ఎప్పుడూ కూడా ఒకటే ఫాలో అవుతారు. రెండు దేశాల మధ్య ప్రేమ చిగురించడాన్ని అస్సలు ఒప్పుకోరు. అదెందుకో మరి నాకర్థం కాదు. మనమెప్పుడూ శాంతి, సామరస్యం అని మాట్లాడుతూ ఉంటాం. కానీ అవి ఉన్న చోట కూడా ఈ రాజకీయ పార్టీలు హిందూ, ముస్లిం అన్న కోణాన్ని తీసుకొస్తాయి. అదెంత దారుణం. పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్టిస్టులను ఏజెంట్లుగా ఏమీ పంపట్లేదు. అది సరి కాదుఅయినా వారిని భారతీయ సినిమాల్లో నటించేదుకు ఒప్పుకోకపోవడం కరెక్ట్ కాదు అని అభిప్రాయపడ్డాడు. కాగా రాజీవ్.. కహీ తో హోగా, సచ్ కా సామ్నా అనే సీరియల్స్‌లో నటించాడు. 2008లో వచ్చిన ఆమిర్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. షైతాన్, టేబుల్ నెం.21 చిత్రాల్లో మెరిశాడు. ఇటీవల వచ్చిన షో టైమ్ వెబ్ సిరీస్ రెండో సీజన్లోనూ మెప్పించాడు.చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్ -
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: బాలీవుడ్ నటుడు
సీరియల్ నటుడిగా కెరీర్ ఆరంభించిన రాజీవ్ ఖందేల్వాల్ ఐదేళ్లలోనే పాపులర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆమిర్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన అతడు తొలి చిత్రంతోనే సక్సెస్ రుచి చూశాడు. సైతాన్, సౌండ్ ట్రాక్, టేబుల్ నెంబర్ 21, సామ్రాట్ అండ్ కో సహా బాలీవుడ్లో పలు సినిమాలు చేశాడు. హఖ్ సే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటాడు. నటుడిగా కాకుండా హోస్ట్‌గానూ అదరగొట్టాడు రాజీవ్. పలు రియాలిటీ షోలకు అతడు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. తాజాగా అతడు తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడేనని చెప్పాడు. కేవలం ఆడవాళ్లే కాకుండా మగవాళ్లు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చాడు. ఓసారి తనకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని, అప్పుడు తాను తడబడకుండా సారీ బాస్, మీరు చెప్పినట్లు నేను చేయలేను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశానన్నాడు. అబ్బాయిలు ఇలాంటి పరిస్థితులను డీల్ చేసినంతగా అమ్మాయిలు డీల్ చేయలేరన్నాడు. కొన్నిసార్లు వాళ్లు పరిస్థితులకు లొంగిపోయి తమలో తామే కుమిలిపోతారని, కానీ మగవాళ్లు వాటికి ఎదురొడ్డి నిలబడి ముందుకు సాగుతారని, కాకపోతే ఆ విషయాలను బయటకు చెప్పరని పేర్కొన్నాడు. అలాగే ఎప్పుడు చూసినా మహిళల రక్షణ కోసమే మాట్లాడతారు కానీ సినీ ఇండస్ట్రీలో మగవాళ్ల రక్షణ గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరని తెలిపాడు. పురుషాధిపత్యం వల్ల అమ్మాయిలే ఎక్కువగా నలిగిపోతున్నారు కాబట్టి వారి గురించే ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త చూపించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డాడు. కానీ ప్రస్తుత చిత్రపరిశ్రమ మునుపటిలా లేదని, చాలా మారిందని చెప్పుకొచ్చాడు రాజీవ్. చదవండి: నేను పాలిచ్చే తల్లిని, వారికోసం ఆ పని చేయలేను: నటి -
ఆర్మీ ఆఫీసర్ భార్యగా..
‘ది ఫ్యామిలీమేన్’ వెబ్ సిరీస్‌లో నటించి, డిజిటల్ వ్యూయర్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నారు నటి ప్రియమణి. ఇప్పుడు ‘అతీత్’ అనే మరో వెబ్ సిరీస్‌లో కనిపించనున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ భార్య జాన్వీగా కనిపించనున్నారు ప్రియమణి. యుద్ధంలో పోరాడిన ఓ ఆర్మీ ఆఫీసర్ చనిపోయినట్లు ప్రకటిస్తారు. అయితే పదేళ్ల తర్వాత ఆ ఆర్మీ ఆఫీసర్ తన భార్య, కూతురితో కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించాలనుకుని వారి వద్దకు వస్తాడు. అప్పుడు ఆ తల్లీకూతుళ్ల పరిస్థితి ఏంటి? అసలు ఆ ఆర్మీ ఆఫీసర్ చనిపోయినట్లు ప్రకటన రావడం వెనక దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే అంశాల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ సాగుతుందని సమాచారం. ‘‘ఈ వెబ్ సిరీస్ కొన్ని హార్రర్ అంశాలతో కూడుకున్న సైకలాజికల్ థ్రిల్లర్. ఇందులో నాతో పాటు రాజీవ్ ఖండేల్వాల్, సంజయ్ సూరి నటిస్తున్నారు. తనూజ్ భ్రమర్ దర్శకత్వం వహిస్తున్నారు’’ అని పేర్కొన్నారు ప్రియమణి. ‘ది ఫ్యామిలీ మేన్’ సెకండ్ సీజన్లోనూ కనిపించనున్నారట ప్రియమణి. అలాగే ప్రస్తుతం బాలీవుడ్లో అజయ్ దేవగన్ సరసన ‘మైదాన్’ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు ప్రియమణి. ఈ విషయం గురించి ప్రియమణి మాట్లాడుతూ– ‘‘అజయ్ సార్‌తో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ వారికి నేను కొత్తగా కనిపిస్తాను. 2013లో షారుక్ ఖాన్ నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో ఓ డ్యాన్స్ నంబర్ చేశాను. ఆ తర్వాత నాకు బాలీవుడ్ నుంచి స్పెషల్ సాంగ్స్ చేయమని చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నేను చేయలేదు. ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుక్ కాబట్టే చేశాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగులో వెంకటేశ్ ‘నారప్ప’, రానా ‘విరాటపర్వం’, ‘సిరివెన్నెల’ చిత్రాలతో పాటు కన్నడ, తమిళ భాషల్లో ‘డాక్టర్ 56’లో కూడా నటిస్తున్నారు ప్రియమణి. లాక్డౌన్ వల్ల ఈ చిత్రాల చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డ సంగతి తెలిసిందే. -
బ్రేకప్ గురించి చెబుతూ బోరుమన్న నటి!
ముంబై: గత ప్రేమ జ్ఞాపకాలు గుర్తు చేసేసరికి నటి దివ్యాంక త్రిపాఠి కన్నీళ్లు పెట్టుకున్నారు. గతంలో సాగించిన ప్రేమాయణం తన జీవితంలో చీకటి కోణమంటూ ఆమె వ్యాఖ్యానిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ప్రోమో వీడియో వైరల్ అవుతోంది. రాజీవ్ ఖండేల్వాల్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘జజ్ బాత్’లో నటి దివ్యాంక పాల్గొన్నారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత మీ గుండె ఎప్పుడైనా బద్దలైనట్లు అనిపించిందా, ఎక్కువగా బాధపడ్డ సందర్భం ఏంటని రాజీవ్ ఆమెను అడిగారు. ఇక అంతే నటి ఉద్వేగానికి లోనై ఏడ్చేశారు. గతంలో టీవీ నటుడు శరద్ మల్హోత్రా, నటి దివ్యాంక త్రిపాఠిలు గాఢంగా ప్రేమించుకున్నారు. దాదాపు ఎనిమిదేళ్లు ప్రేమాయణం తర్వాత వీరు బ్రేకప్ అయ్యారు. ఈ విషయాన్ని నటి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘ఎనిమిదేళ్లు ముగుస్తున్న సమయంలో నా జీవితం ముగిసి పోతుందనుకున్నా. ఏది నమ్మోలో.. వద్దో తెలియని స్థితి ఎదురైందంటూ’ దివ్యాంక చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. టాక్ షోలో దివ్యాంక భర్త వివేక్ దహియాతో పాల్గొని సందడి చేశారు. 2015లో శరద్‌తో బ్రేకప్ అయ్యాక ఆమె వివేక్ దహియాను వివాహం చేసుకున్నారు. గత రెండేళ్లుగా వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. వీరి అభిమానులు ముద్దుగా ఈ జోడీని ‘దివేక్’అని పిలుచుకోవడం తెలిసిందే. పలు హిందీ సీరియళ్లు, టీవీ షోలతో దివ్యాంక త్రిపాఠి పాపులర్ అయ్యారు. ఆమె తొలి సీరియల్ 'మే తేరి దుల్హాన్' హిట్ కావడం పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. డ్యాన్స్ షో 'నాచ్ బాలియే'లో పాల్గొని విజేతగా నిలిచిన దివ్యాంక.. త్వరలో బాలీవుడ్లో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. -
సినిమా కోసమే టీవీకి దూరం..
బుల్లితెరపై చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకుని, ప్రేక్షకులపై తనదైన ముద్రను వేసిన నటుడు రాజీవ్ ఖండేల్వాల్. బాలీవుడ్లో ఎక్కువ అవకాశాల కోసమే తాను బుల్లితెరను వీడాల్సి వచ్చిందని చెబుతున్నాడు. కహీతో హోగాతో టెలివిజన్‌కు పరిచయమైన రాజీవ్ అంతకుముందు ఎల్ఎంఎల్, గ్రీన్‌లేబుల్ విస్కీ, కొడాక్ ఎక్స్‌ప్రెస్, వీడియోకాన్ రిఫ్రిజిరేటర్స్ ప్రకటనల్లోనూ కనిపించాడు. 10 ఏళ్ల పాటు టెలివిజన్ పరిశ్రమలో కొనసాగిన రాజీవ్ టైజం డ్రామాతో రూపొందిన ‘ఆమిర్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తరువాత షైతాన్‌లో ఇన్స్పెక్టర్ అరవింద్ మాథుర్ పాత్ర పోషించాడు. టేబుల్ నంబర్ 21లో వివాన్ అగస్తీగా కనిపించి మెప్పించాడు. ‘‘ఆమిర్ అవకాశం వచ్చినప్పుడు నేను మరేమీ ఆలోచించలేదు. కారణం నా ఆలోచనల్లో ఉన్న స్క్రిప్ట్ నా ముందుకొచ్చింది. అందుకే వినగానే ఓకే చెప్పాను. మొదటి సినిమాలో ఏ లవర్ బోయ్ పాత్రనో చేయకుండా, భిన్నమైన పాత్ర పోషించడం నాకు నచ్చింది’’ అంటున్నాడు. రాజ్శ్రీ బ్యానర్ నిర్మిస్తున్న డిటెక్టివ్ థ్రిల్లర్ సినిమా సామ్రాట్ అండ్ కో రాజీవ్ తాజా సినిమా. ఇది కుటుంబ కథా చిత్రాలకు భిన్నంగా ఉంటుందని చెబుతున్నాడు. ఇందులో ఇతడు డిటెక్టివ్‌గా కనిపిస్తాడు. హాలీవుడ్, బాలీవుడ్ గూఢచార చిత్రాల్లో లాగా నేల విడిచి సాము చేయకుండా, కథ వాస్తవానికి దగ్గరగా ఉంటుందని చెబుతున్నాడు. ‘‘నా పాత్ర శక్తివంతమైనదే. అయితే బాలీవుడ్ సినిమాల్లో మాదిరిగా భవనాల మీద నుంచి దూకడం వంటి గిమ్మిక్కులు మాత్రం ఉండవు. తెలివి, లాజిక్ తోనే ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాను’’ అని అంటున్నాడు. 2008లోనే బాలీవుడ్‌కి వచ్చినా ఇతడు ఎక్కువ చిత్రాలు చేయలేదు. ఏడాదికి రెండు, మూడు చిత్రాలు చేస్తే చాలని పరేష్ రావల్ వంటి తన శ్రేయోభిలాషులు సూచిస్తున్నారని చెబుతున్నాడు. రాజీవ్ ఖండేల్వాల్ రాబోయే చిత్రం ఫీవర్. దీని షూటింగ్ స్విట్జర్లాండ్‌లో కొనసాగుతోంది.